…… ఈ ఫోటోలో ఉన్నది అభిజిత్, హారిక, లాస్య.,. బిగ్‌బాస్ హౌస్‌లో ఒక గ్రూపు… నోయెల్ గ్రూపు… నేను బయటికి వెళ్తున్నా, మీకు ఫుల్ సపోర్టుగా దుమ్మురేపుతా అన్నాడు… తనకు గత సీజన్ విజేత రాహుల్ సిప్లిగంజ్ దోస్త్… అభిజిత్‌కు ఆల్రెడీ వోట్లు వేయడానికి, సోషల్ ప్రమోషన్ చేయడానికి, యాంటీ అభిజిత్ కంటెస్టెంట్లను ఆడుకోవడానికి టీమ్స్ ఉన్నయ్… 24 గంటల్లో #WeAdmireAbijeet హాష్ టాగ్ తో 5 లక్షల ట్వీట్లు కొట్టి ఆ టీమ్స్ హల్చల్ క్రియేట్ చేశాయి… అన్నింటికీ అభిజిత్ పెద్ద ముదురు… తెలంగాణ భాషలో చెప్పాలంటే కంక, టెంక… ఎక్కడా రాజీపడడు… అలాగని పోతేపోనీలే అని తేలికగా వదిలేయడు… డీప్ థింకర్… ఈమధ్య ఆటలో కూడా చేంజ్ కనిపిస్తోంది… గోల్ పోస్ట్ కి దగ్గరికి చేరుతున్నాడు…
బిగ్‌బాస్‌ను కూడా అప్పుడప్పుడూ బట్టలిప్పి బజారులో నిలబెడుతున్నాడు… అందరూ కలిసి తనను టార్గెట్ చేస్తున్నా సరే తొణకడు, బెణకడు… ప్రధానంగా మైండ్ గేమర్… ఇప్పుడిది చెప్పుకోవడం దేనికంటే… తన గ్రూపులో ఉన్న కీలకమైన కంటెస్టెంటు లాస్య బయటికి వెళ్లిపోయింది… నిజానికి ఆమె టాప్ ఫైవ్‌లో ఉంటుందని అనుకున్నారు అందరూ… చాలా సేఫ్ గేమర్… వివాదాల్లో ఇరకకుండా, ఎవరికీ దొరకకుండా చాలా జాగ్రత్తగా షో రన్ చేసింది ఇన్నాళ్లూ…
Ads
మొదట్లో అమ్మా రాజశేఖర్ మెడలు పట్టుకుని ఎలిమినేషన్ గేటులోకి తోసినప్పటి దూకుడు తరువాత కనిపించలేదు… వేగంగా తన వ్యవహార శైలి మార్చుకుంది… ఇప్పుడు ఆమే బయటికి వెళ్లిపోవడంతో ఇక గేమ్‌లో అభిజిత్‌కు పోటీ ఎక్కువైంది… మొదట్లో అల్లాటప్పా అనుకున్న సొహెయిల్, ఫస్ట్ నుంచీ అభిజిత్ ప్రత్యర్థిగా ఉన్న అఖిల్ ఒక్కటయ్యారు… మరోవైపు అరియానా, అవినాష్… అందరూ స్ట్రాంగే… అందరినీ మించి బిగ్‌బాస్ ప్రేమించే మోనాల్ సరేసరి…
ఈ ఏడుగురి నడుమ కథ నడవాలి ఇక… ఇద్దరిని పంపించేస్తే టాప్ ఫైవ్ మిగులుతారు… ఈ స్థితిలో లాస్య వెళ్లిపోవడం గ్రూపు కోణంలో అభిజిత్‌కు కాస్త మైనస్… కానీ ఎప్పుడో ఒకప్పుడు వదులుకోక తప్పదు కదా… ఇక్కడ చెప్పుకోవల్సింది ఏమిటంటే…?
మిగతావాళ్లకన్నా అభిజిత్‌కు ప్లస్ పాయింట్లున్నయ్… చివరకు తను ప్రధానంగా రోజూ కొట్లాడే అఖిల్, మోనాల్, సొహెయిల్ తదితర కంటెస్టెంట్ల కుటుంబసభ్యులు కూడా అభిజిత్ ఫ్యాన్స్… అది స్పష్టంగా బిగ్‌బాసే శనివారం షోలో ఎక్స్పోజ్ చేశాడు… ఛల్, ఏ సబ్ ఖేల్ మే చల్తా… ఇదంతా ఆటలో భాగం… అని అభిజిత్ తల్లితోపాటు అందరూ అభిప్రాయపడ్డారు… కంటెస్టెంట్లకన్నా వాళ్లకే మంచి క్లారిటీ ఉంది, టేస్ట్ ఉంది… వీళ్ల సర్టిఫికెట్లు అభిజిత్‌ను మరో మెట్టు పైకి ఎక్కించాయి… పోతూ పోతూ లాస్య కూడా అభిజిత్‌కు ఇంకాస్త పెద్ద సర్టిఫికెట్ ఇచ్చిపోయింది… సో, ఇక రానురాను తనను దాటేయడం అఖిల్‌కు, అవినాష్‌కు, సొహెయిల్కు కష్టం కానుంది…
బట్… ఇది షో… ఎప్పుడు ఏదైనా జరగొచ్చు… ఇది అసలే బిగ్ బాస్… తిక్క కేస్…
Good… లాస్య వీడుకోలు వేళ ఏడుపులు, పెడ బొబ్బలు, శోకాలు కాదు, కనీసం ఒక్క కన్నీటి చుక్క లేదు… హుందాగా… నవ్వుతూ… అదే గేమ్ నుంచి నిష్క్రమించే తీరు… ఆఫ్టరాల్ ఆట… గెలిస్తే నిలుస్తాం, ఓడితే వీడుతాం… అంతే… Sohail, mehaboob చూశారా…?
Share this Article