Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

యమకింకరుడు..! బావకు పేరొచ్చింది… బావమరిదికి డబ్బొచ్చింది…!

March 25, 2025 by M S R

.

Subramanyam Dogiparthi …… బావ చిరంజీవి కోసం బావమరిది అల్లు అరవింద్ తీసిన మాస్ మసాలా 1982 అక్టోబరులో రిలీజయిన ఈ యమకింకరుడు . చిరంజీవికి ఆంధ్రా సిల్వెస్టర్ స్టాలోన్ ఇమేజ్ తెచ్చిపెట్టిన సినిమా . బహుశా ఈ సినిమాలోని నటనే ఖైదీలో విజృంభిస్తానికి దోహదపడిందేమో ! చిరంజీవికి పేరొచ్చింది , బావమరిది అల్లు అరవిందుకి డబ్బులు బాగా వచ్చాయి .

1971లో ఇంగ్లీషులో వచ్చిన డర్టీ హేరీ సినిమా ప్లస్ మ్యాడ్‌మాక్స్‌ల ఆధారంగా మన లోకల్ పరిస్థితులకు అనుగుణంగా కూర్పులు మార్పులు చేసి తీసారు . (శోభన్ బాబు, మాధవి నటించిన బలిదానం సినిమాయేమో ఆ ఇంగ్లిష్ మాతృకకు అఫిషియల్ రీమేక్, ఈ యమకింకరుడు ఫ్రీమేక్ అట…)

Ads

ఈ సినిమాకు పనిచేసిన డైరెక్టర్ , సంగీత దర్శకుడు , సంభాషణల రచయిత అందరికీ తెలిసిన పేర్లే కాదు . అయినా అందరూ బాగానే చేశారు . ముఖ్యంగా సంగీత దర్శకత్వం . సిల్క్ స్మిత పాట ఒయిమా ఒయిమా వయ్యారంలో యస్ జానకి స్వరం , సంగీతం , ట్యూన్ ఎన్ని వయ్యారాలు పోతాయో !

ఇంక సిల్క్ స్మిత డాన్స్ వయ్యారం గురించి చెప్పేదేముంది ! ఈ సంగీత దర్శకుడి పేరు కె యస్ చంద్రశేఖర్ . పశ్చిమ గోదావరి జిల్లా రాయల గ్రామస్తుడు . ఇదే అతని మొదటి సినిమా . కోవిడ్లో చనిపోయాడు .

మరో ప్రయోగం . కేవలం రాగాలాపనతో పాట . వేటూరి ప్రయోగం . నాకు తెలిసి ఇలాంటి సంగీత ప్రయోగం మరే సినిమాలో జరగలేదు . సినిమా , సంగీత పండిత మిత్రులు స్పందించాలి . ఆరుద్ర వ్రాసిన తప్కో తప్కో పోలీస్ వెంకటస్వామి క్లబ్ డాన్స్ పాటలో చిరంజీవి , జయమాలిని ఇద్దరూ అదరగొట్టేసారు .

వేటూరి వ్రాసిందే మరో పాట మాట మాట చిన్న మాట రాధిక , చిరంజీవిల డ్యూయెట్ చాలా బాగుంటుంది . ఆయన వ్రాసిందే మరో శ్రావ్యమైన పాట కంటికి నువ్వే దీపం . సినిమాలో రెండు సార్లు వస్తుంది . బాగుంటుంది .

పాటలన్నీ దర్శకుడు రాజ్ భరత్ బాగా చిత్రీకరించారు . సినిమాని పరుగులెత్తించాడు . ఈ సినిమా కాకుండా మరో రెండు మూడు సినిమాలే డైరెక్ట్ చేసాడు . అందులో ఒకటి చిరంజీవితోనే పులి సినిమా . అది సక్సెస్ కాలేదనుకుంటా .

మెచ్చుకోవలసిన మరో వ్యక్తి  డైలాగులను వ్రాసిన బాబూరావు . నేనయితే ఈ పేరు కూడా వినలేదు . అరవింద్ ఎక్కడెక్కడ నుండి పట్టుకొచ్చాడో కాని ప్రయోగం సక్సెస్ అయింది . గెలిచినోడే ధీరుడు , గొప్పోడు .

సుదర్శన్ అనే కన్నడ నటుడు విలన్ . సైకో . ఓ దోపిడీ ముఠాని మెయింటైన్ చేస్తూ జనాన్ని వణికిస్తుంటాడు . క్రౌర్యాన్ని బాగా చూపాడు . ఈ ముఠాని స్నేహితులు అయిన పోలీసు ఆఫీసర్లు చిరంజీవి , శరత్ బాబులు బంధించి వాళ్ళకు టార్గెట్ అవుతారు . శరత్ బాబు చెల్లెలు రాధికను చిరంజీవి పెళ్ళి చేసుకుంటాడు .

సైకో విలన్ శరత్ బాబుని చంపేస్తాడు . తర్వాత రాధికను , బిడ్డను బంధిస్తాడు . హీరో యమకింకరుడు అయి విలన్ ముఠాని , విలన్ని అందరినీ లేపేసి భార్యాబిడ్డల్ని కాపాడుకుంటాడు . An action-filled emotional romantic movie . జేమ్స్ బాండ్ సినిమాల్లో లాగా చిరంజీవిని బాగా ప్రెజెంట్ చేసారు . తగ్గట్టుగానే చాలా బాగా నటించాడు చిరంజీవి . ఇతర ప్రధాన పాత్రల్లో జగ్గయ్య , సత్యనారాయణ , శరత్ బాబు చాలా బాగా నటించారు .

బహుశా ఈ సినిమా చూడని చిరంజీవి అభిమానులు ఉండరేమో ! ఏక్షన్ సినిమా ప్రియులను బాగా అలరించిన , అలరించే సినిమా . యూట్యూబులో ఉంది . తప్పక చూడండి . సిల్క్ స్మిత డాన్స్ పాటను అస్సలు మిస్ కాకండి . పాటలో , ట్యూన్లో , జానకమ్మ గొంతులో ఎన్ని వయ్యారాలో ! #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమా_కబుర్లు #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఎర్ర రాజకీయాలకు కొరుకుడుపడని కొయ్య… కేరళ కొత్త ముఖ్యమంత్రి…
  • మనోభావాల యూనివర్శిటీ… విభిన్న కోర్సులకు అడ్మిషన్ల నోటిఫికేషన్…
  • బాధితురాలిని బజారుకు లాగడం పక్కా నేరం, అనైతికం…!!
  • ఎటూ మొగ్గు లేదు.., ఎవరికీ వత్తాసు లేదు – సీఎం రేవంత్ పరిణతి…
  • కాసింత నువ్వుల నూనె… ఓ నల్ల రిబ్బన్ ముక్క… కాసిన్ని నల్ల నువ్వులు…
  • ‘‘నా స్టార్‌డమ్ ఎంత అల్పమైందో నాకప్పుడు అర్థమైంది’’
  • ప్రతీక్ యాదవ్..! ములాయం చిన్న కొడుకు కథ కూడా ఓ సినిమా స్క్రిప్టే..!!
  • … ఇప్పుడైతే పోలీసుల మనోభావాలు దెబ్బతినేవేమో…!!
  • బుల్డోజర్ జస్టిస్… మజ్లిస్ నేతకు దెబ్బ… నేరస్తులకు షెల్టరిస్తే ఇల్లే ఉండదు..!
  • ఎంతసేపూ పూరేకలు విచ్చుకోవడంపైనేనా వేటూరి దృష్టి..!?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions