Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇలాంటి షీరోచిత సినిమాలే వాణిశ్రీని టాప్ స్టార్‌గా నిలిపాయి..!!

July 24, 2024 by M S R

కె రామలక్ష్మి మార్కు సినిమా . ఈ అభిమానవతి సినిమాకు కధ ఆమెదే . ఆమె వ్రాసిన కరుణ కధ అనే నవల ఆధారంగా డూండీ దర్శకత్వంలో వచ్చింది ఈ సినిమా . డైలాగులు కూడా ఆమే వ్రాసారు . మరి ఇంకా ఏదయినా సినిమాకు కూడా డైలాగులు వ్రాసారేమో నాకు తెలియదు . రామలక్ష్మి గారి హీరోయిన్ ఎలా ఉండాలో ఈ సినిమాలో హీరోయిన్ అలాగే ఉంటుంది .

షీరో వాణిశ్రీయే . ఆత్మాభిమానాన్ని ఎన్ని కష్టాలొచ్చినా వదలిపెట్టకుండా విధితోనే పోరాడే హీరోయిన్ గా వాణిశ్రీ బాగా నటించింది . అనాధగా పెరిగి , కోటీశ్వరుడికి భార్య అయి , ఇష్టం లేని అత్తగారి చేతిలో మోసపోయి , భర్త విదేశాలలో ఉన్నప్పుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళవలసి వస్తుంది . బయటకు వెళ్ళాక తెలియకుండానే తండ్రి వద్దకు చేరి , హత్యానేరంలో కోర్టు బోనెక్కుతుంది . లాయరయిన కొడుకు రక్షిస్తాడు .

కృష్ణ తండ్రీ కొడుకులుగా బాగా నటించారు . అత్తగా యస్ వరలక్ష్మి , విలన్ గా శరత్ బాబు , కొడుకు కృష్ణకు ప్రియురాలిగా ప్రమీల బాగా నటించారు . ఇతర పాత్రల్లో ప్రభాకరరెడ్డి , మాడా , రావి కొండలరావు , టి జి కమలాదేవి ప్రభృతులు నటించారు .

Ads

చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటలు శ్రావ్యంగా ఉంటాయి . ముఖ్యంగా దాశరధి వ్రాసిన నీపైన నాకెంత ప్రేముందో నీకెలా తెలిపేది పాట చాలా శ్రావ్యంగా ఉంటుంది . బాలసుబ్రమణ్యం చాలా బాగా పాడారు . మిగిలిన పాటల్లో మామిడితోటలో అనే పాట ఇద్దరు కృష్ణల మీద బాగుంటుంది .

మా నరసరావుపేటలో సత్యనారాయణ టాకీసులో చూసినట్లు గుర్తు . కమర్షియల్ గా ఎలా ఆడిందో గుర్తు లేదు కానీ , సినిమా బాగుంటుంది . ముఖ్యంగా వాణిశ్రీ , రామలక్ష్మి అభిమానులకు బాగా నచ్చుతుంది . కృష్ణ , యస్ వరలక్ష్మి , ప్రమీలల నటన కూడా బాగుంటుంది . యూట్యూబులో ఉంది . చూడబులే .

By the way , 1975 లోకి వచ్చేసాం . ఈ సంవత్సరంలో సుమారు 70 సినిమాలు వచ్చాయి . అనారోగ్య కారణాల వలన ఈ సంవత్సరం అక్కినేని సినిమాలు ఏవీ రాలేదు . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు ……….   ( By దోగిపర్తి సుబ్రహ్మణ్యం )

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • స్టార్ హీరో ఇమేజ్, డాన్సులు, ఫైట్లు, ఎలివేషన్లు ఉండగానే సరిపోదు..!!
  • కాంగ్రెస్‌తోపాటు బీజేపీ కూడా..! తెలంగాణకు కేసీయార్ జలద్రోహం- నిజాలు..!!
  • ‘ట్రంపరితనం’… ప్రపంచానికే వినాశకరం… ఏదో ముంచుకొస్తోంది…
  • వ్యాపిస్తున్న దుర్గంధం… తిట్ల పర్వంలో జాతీయ నేతలనూ వదలడం లేదు…
  • ఒకటి బాసట…! మరొకటి కబళింపు..! ఇదే అమెరికాకూ ఇండియాకూ తేడా..!!
  • శివశంకర ప్రసాద్ గారు… మీ ‘గెస్చర్’ మనసుని గెలుచుకుంది..!
  • సంక్రాంతి ఎప్పుడు..? ఎందుకు మీమాంస..? మళ్లీ సందిగ్ధత..!!
  • వాటిని గజల్స్ అంటారా..? నీ సారస్వత సేవ ఏమిటి శ్రీనివాసులూ…?
  • వెనెజులా..! ట్రంపుదే కాదు… మన చమురూ ఉంది అక్కడ… తవ్వాలి..!!
  • అవునూ, ఇంతకీ ఈ ‘తెలుగు గజల్ శ్రీనివాస్’ పాత కేసు ఏమైనట్టు..?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions