Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కన్నడ కస్తూరి..! బెంగుళూరు టు హైదరాబాద్… ఇదొక టీవీ నటప్రవాహం…!

March 12, 2024 by M S R

తెలుగు సీరియల్స్ చూసేవాళ్లకు బాగా తెలుసు ఈ విషయం… దాదాపు కన్నడ టీవీ తారలే డామినేట్ చేస్తున్నారు… తప్పు కాదు, వాళ్లకు
ఆ మెరిట్ ఉంది… ప్రూవ్ చేసుకుంటున్నారు… సినిమాలకు సంబంధించి తమిళ, మలయాళ తారలు తమ ప్రతిభతో నిలదొక్కుకుంటున్నారు… కష్టపడతారు… టీవీలకు వచ్చేసరికి మాత్రం కన్నడ తారలే…

అన్నింటికన్నా ముఖ్యంగా త్వరగా తెలుగులో ఫ్లూయెన్సీ సాధించేస్తారు… యాంకర్లుగా సౌమ్యారావు వంటి కన్నడ మొహాలు ఫెయిలైనా సరే… సీరియల్స్‌లో మాత్రం వాళ్లదే హవా… తెలుగులో ‘షరతులు వర్తిస్తాయి’ అనే సినిమా రాబోతోంది కదా… దాని ప్రమోషన్ వీడియోలు కొన్ని చూస్తున్నప్పుడు అందులోని హీరోయిన్ భూమికా శెట్టి @ భూమి శెట్టి కాస్త ఇంట్రస్టింగుగా కనిపించింది… సినిమాలో కూడా బాగా చేసిందని అంటున్నారు…

ఒక వీడియో చూస్తే మరింత ఆశ్చర్యం వేసింది… భూమి శెట్టి గురించి ఆ సినిమాలో హీరోగా చేసిన చైతన్యకే మొత్తం తెలియదట… ఆ ఇంటర్వ్యూ చేస్తున్న యాంకరే భూమి శెట్టి గురించి తెలియదా అని హాశ్చర్యపోయింది… భూమి మంగుళూరు ఏరియాలో పుట్టింది… ( ఆ ఏరియాలో శెట్టి అనేది కాస్త ఎన్‌లైటెన్ గ్రూప్… రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి, అనుష్క శెట్టి, శిల్పా శెట్టి, శోభా శెట్టి ఎట్సెట్రా పాపులర్ సినిమా, టీవీ పర్సనాలిటీస్ తెలుసు కదా…)

Ads

భూమి భరతనాట్యం, యక్షగానం నేర్చుకుంది… కన్నడంలో ఓ పాపులర్ సీరియల్‌లో చేసింది… అక్కడి బిగ్‌బాస్ సీజన్ 7లో ఫైనలిస్టు… ఫోర్త్ ప్లేస్… తెలుగులో కూడా నిన్నే పెళ్లాడతా వంటి సీరియల్స్ చేసింది… తెలుగు సీరియల్స్ వీక్షకులకు పరిచయమే ఈ మొహం… కన్నడంలో ఓ సినిమా కూడా చేసినట్టుంది… తెలుగులో మాత్రం షరతులు వర్తిస్తాయి తన తొలి సినిమా… పూర్తిగా సినిమా అవకాశాల నిరీక్షణ, ప్రయత్నాల్లో పడి టీవీలకు ఈమధ్య దూరమైనట్టుంది…

ఇక్కడ భూమి గురించి చెప్పడం అంటే… స్థూలంగా, పరోక్షంగా హైదరాబాద్‌కు వచ్చి కష్టపడుతున్న కన్నడ తారలందరి గురించి ఈ ఉదాహరణతో చెప్పుకోవడం… సుమ, శ్రీముఖి, రష్మి వంటి మనవాళ్లు యాంకర్లుగా వోకే… సినిమాల్లో మాత్రం తెలుగు తారలు పెద్దగా క్లిక్ కావడం లేదు… కనీసం టీవీ సీరియల్స్‌లోనూ పాగా వేయలేకపోతున్నారు దేనికి..? శరణ్య ప్రదీప్ వంటి తారలు అప్పుడప్పుడూ కాస్త మెరుస్తున్నారు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అమరావతిపై ద్వేషం, విషం… మరీ ఈ డర్టీ ముద్రలతోనా..?!
  • నో నో… కల్వకుంట్ల శైలిమ రాజకీయాల్లోకి అస్సలు రాకపోవచ్చు..!!
  • అమెరికా మీద చైనా అగ్రిటెర్రర్ కుట్ర… ఆ ఫంగస్ దానికోసమేనా..?
  • అప్పు పుట్టని దురవస్థ నుంచి…. వన్ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ దాకా…
  • జుట్టు సెట్ చేయాలంటే కనీసం లక్ష… ఇదొక సక్సెస్ స్టోరీ…
  • కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, సంగీతం, ఫోటోగ్రఫీ, దర్శకత్వం, నటన…
  • రాజకీయ నాయకులతో కృష్ణ కబడ్డీ… తరువాత తనే పాలిటిక్స్‌లోకి…
  • అచ్చు శ్యాంసింగరాయ్‌ కథలాగే… ఆ సినిమాల్లో ప్రస్తావించిన స్టోరీయే..!!
  • మెగాస్టార్‌ కనిపిస్తే చాలు, ఈ కెమెరా రెచ్చిపోయేది… ఓ విశేషబంధం..!
  • జైనబ్… అఖిల్‌కన్నా 9 ఏళ్లు పెద్ద… ఐతే ఏంటట..? ఆమెకు తెలియదా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions