ఒక వార్త బాగా ఆకర్షించింది… కొత్త సంవత్సరం ఆగమనవేళ… పూరి జగన్నాథుడిని 5 లక్షలకు మించి భక్తులు దర్శించారు… అవును, అక్షరాలా 5 లక్షల మంది… ఏదో సోషల్ మీడియాలో వచ్చిన పిచ్చి లెక్క కాదు ఇది… అక్కడి అధికారులు, పోలీసులను కోట్ చేస్తూ టైమ్స్ వంటి పత్రికలు రాసిన అంకె అది… అబ్బురం… ఎందుకంటే..?
తిరుమలను తీసుకొండి… ఎప్పుడూ వీవీఐపీల గొడవ, బ్రేక్ దర్శనాలు, ప్రొటోకాల్ దర్శనాలు, మరీ వీవీఐపీ వస్తే క్యూ ఆపేయడం… చూశాం కదా, మంత్రి రోజాకు రోజూ ఇదే పని… భక్తుల మందలను తీసుకురావడం… విశిష్ట దర్శనాలు ఇప్పించడం… తిరుమల వెంకన్నను ఓ జబ్బు పేరు రోజా… సరే, జగన్‌కు గానీ, కరుణాకర్‌రెడ్డికి గానీ ఇవేమీ పట్టవు… ఆలయ నిర్వహణకన్నా భక్తులిచ్చిన డబ్బును ఎలా వాడుకుందామా, ఏ ప్రభుత్వ కార్యక్రమాలకు ఖర్చు చేసేద్దామా… ఇదే సోయి… అన్యమత కొలువులు, ప్రచారాల బెడద సరేసరి… తిరుమల అంటేనే రాజకీయ దుర్గంధం…
కొత్త సంవత్సరం వేళ ఎందరు దర్శనాలు చేసుకున్నారనే సంఖ్య ఎక్కడా కనిపించలేదు… ఏదో మొక్కుబడిగా ఒకటో తారీఖు వేసేసి 63,358 మంది దర్శించుకున్నారు, 19,534 మందికి గుండ్లు గీకబడ్డాయి అనే నోట్ జారీ చేశారు… ఎప్పటి నుంచి ఎప్పటివరకు అనేది తెలియదు… 6.47 లక్షల మందికి దర్శనాలు కల్పించామని అని ఈవో ప్రకటన… కానీ అది డిసెంబరు 23 నుంచి జనవరి 1 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు… అంటే పది రోజులు…
Ads
సరే, అదొక అరాచక వ్యవస్థ… ఇంత ఆదాాయం, వ్యవస్థ ఉన్న ఇక్కడ ఇలా ఉంటే… పెద్దగా క్యూ లైన్లు వంటి నిర్బంధాలు, పరిమితులు కూడా కనిపించని గౌహతి కామాఖ్య గుడిని కూడా లక్ష మంది సందర్శించారని అక్కడి అధికారులు చెబుతున్నారు… సాఫీగా, సంతోషంగా…
పూరికి వద్దాం… ఎప్పుడో రాత్రి ఒంటిగంటన్నరకు గుడి తెరిచారు… దర్శనాలు నడుస్తూనే ఉన్నాయి… రాత్రి ఏడు గంటల వరకే 5 లక్షల మంది దర్శించుకున్నట్టు ఎస్పీ కన్వర్ విశాల్ సింగ్ చెబుతున్నారు… గుడి మూసేవేళ దాకా లెక్కిస్తే ఇంకా దర్శనాల సంఖ్య పెరిగే ఉంటుంది కదా… అంతమంది ఏ చిన్న ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఎలా దర్శించుకోగలిగారు… ఒడిశా ప్రభుత్వం పూరి గుడి మీద రాజకీయ మకిలిని అంటించకుండా, అక్కడి నిర్వహణను స్థానిక గుడి పెద్దలకే అప్పగించింది… తోడుగా పోలీసులు…
గ్రాండ్ మెయిన్ రోడ్ వరకూ రెండు కిలోమీటర్ల క్యూ లైన్… మహిళలకు, పురుషులకు ఖచ్చితంగా డ్రెస్ కోడ్… ‘‘బహుశా ఎంట్రన్స్, ఎగ్జిట్ వేర్వేరు తోవలు… నో వీఐపీ దర్శనాలు… దర్శనానికి 20 గంటల వ్యవధి… తిరుమల, శ్రీరంగం గుళ్లలోలాగా గాకుండా భక్తులు దర్శనం చేసుకుని వెళ్లే దృశ్యం విశాాలం… ఇలాంటి చాలా కారణాలు ఎక్కువ సంఖ్యలో భక్తుల దర్శనాలకు అనుకూలించవచ్చు… పక్క పక్కన నిలబడి కనీసం 10 మంది దర్శనం చేసుకునేలా పూరీ జగన్నాథ్ గర్భగుడి ఉంటుంది… ఇలా దాదాపు 10 వరుసల్లో ఒకేసారి నిలబడి చూసి వెలుపలికి వెళ్లవచ్చు… రాకపోకలకు వేర్వేరు మార్గాలు ఉంటాయి… వంటగది నుంచి ప్రసాదాలు తెచ్చేందుకు మరో మార్గం ఉంది… రోజులో మూడు నాలుగుసార్లు భారీగా నైవేద్యాలు సమర్పిస్తారు… నైవేద్యాల తరలింపునకు ఒకోసారి గంటకు పైగా సమయం పడుతుంది..’’ అనే వివరణాత్మక వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి… గుడ్… ఈ విషయానికి కూడా అక్కడి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను అభినందిద్దాం… అయిదారు లక్షల మంది దర్శనపుణ్యంలో వీసమెత్తు లభించినా అదృష్టవంతుడే…!!
Share this Article