.
పుడింగి అనేది తిట్టా..? పెద్ద తోపువా..? అనే అర్థం అంతే… సాధారణంగా కోపంతో అంటుంటారు… నయని పవని దాన్ని పెద్ద ఇష్యూ చేసింది ఎప్పటిలాగే… దాన్ని పట్టుకుని నాగార్జున వీకెండ్ షోలో వివరణ అడగడం, తప్పుపట్టడం, అదో పెద్ద ఇష్యూగా ప్రేరణను మందలించడం జస్ట్ నాన్సెన్స్… నయని పవనికి సారీ కూడా చెప్పించాడు…
ఈసారి వీకెండ్ షో మొత్తం అలాగే ఉంది… చిన్న చిన్న ‘మ్యాటర్ లేని’ విషయాల్ని కూడా పెద్ద భూతద్దంలో చూపించి, దాదాపు అందరికీ క్లాస్ పీకాడు… అఫ్‌కోర్స్, బిగ్‌బాస్ టీమ్ రాసిచ్చిన స్క్రిప్టే కావచ్చు గాక… పరువు పోయేది నాగార్జునదే కదా… నిజానికి ప్రేరణ కాస్త భోళా… ఉద్దేశపూర్వకంగా కించపరచడం కాదు… ఆమె తన డేటింగ్ గురించి తోటి కంటెస్టెంట్లకు చెప్పుకున్న తీరు కూడా ఓ ఉదాహరణ… ఆట కూడా కూల్… అందుకే ఆమెకు వోట్లు పెరుగుతున్నాయి…
Ads
గౌతమ్ ఏదో హీట్ సీన్‌లో ఏదో పిచ్చికూత కూశాడు… కాకపోతే పైకి వినీవినిపించకుండా… దాంతో నిఖిల్ రెయిజ్ అయిపోయాడు… గౌతమ్ దగ్గర సమాధానం లేదు… తలవంచుకోవడమే… ఏ భేషజమూ లేకుండా నిఖిల్ తను బ్యాలెన్స్ కోల్పోయినట్టు అంగీకరించి, గౌతమ్‌ను కూడా క్షమిస్తున్నట్టు చెప్పి హుందాగా కనిపించాడు…
యష్మిని గౌతమ్ అక్కా అని పిలిస్తే అది బూతు అట… అవును, తనేదో ఆశపడ్డాడు, ఆమె తిరస్కరించింది, నీమీద ఏ ఫీలింగ్సూ లేవు అని నిర్మొహమాటంగా చెప్పింది… తప్పేముంది..? దానికి గౌతమ్ అక్కా అని వ్యంగ్యంగా చెప్పడంతో ఫీలైంది… తమ్ముడూ అని ఉల్టా సెటైర్ వేసింది… అందులోనూ తప్పు లేదు… అక్కడ నిఖిల్ దగ్గర అవే కూతలు, ఇక్కడ యష్మి దగ్గర అవే కూతలు… దటీజ్ గౌతమ్… ఇంకా ఉంది…
గౌతమ్ నయని పవనిని కూడా అక్కా అని పిలిచాడు మరో సందర్భంలో… అదీ వ్యంగ్యం, అదీ వెటకారం… నన్ను అక్కా అని పిలవకు అంటూ ఆమె రెచ్చిపోయింది… సహజం… తను కూడా బ్రో అనేసింది… ఆ రెండు పదాలూ ఆ ఇద్దరి మనోభావాల్ని దెబ్బతీశాయట… ఏం కేరక్టర్లురా బాబూ… చాలాసార్లు గౌతమే తన మాటతీరుతో నొప్పిస్తున్నాడు అందరినీ… పస్ల్ నయని పవని… ఆటతీరుతో మెప్పించలేకపోయినా..! (ఒక్క ప్రేరణ మాత్రమే అక్కా అని పిలిచినా లైట్ తీసుకుంటుందట)…
నబీల్‌ను విష్ణుప్రియ బ్రదర్ అన్నందుకు నబీల్ దాంతో మనోభావాలు దెబ్బతీసుకున్నాడు… హౌజులో నాకెవరూ అక్కాచెల్లెళ్లు లేరు అని నబీల్ సీరియస్‌గా రియాక్ట్ కావల్సిన అవసరమే లేదు… హరితేజ తన పేరు పిలవకుండానే గీత దాటి వెళ్లిపోయాడు ఏదో టాస్క్‌లో, పైగా పదే పదే సమర్థించుకున్నాడు… సేమ్, అవినాష్‌కు తన టాస్క్ వదిలేసి మెగాచీఫ్ పోస్టు అప్పగించేశాడు… ఈ రెండూ నబీల్ వైపు నుంచి కరెక్ట్ కాదు…
అన్నట్టు… గరుడ పురాణ పురుషుడు శివాజీ వస్తాడని క్రయింగ్ స్టార్ నయని పవనిని ఏమీ సేవ్ చేయలేదు… జనం వద్దు పోపో అనేశారు… హౌజు నుంచి బిగ్‌బాస్ వెళ్లగొట్టేశాడు… గత సీజన్‌లో వారంలోనే… ఈ సీజన్‌లో కొన్నాళ్లలోనే…!!
Share this Article