Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ సీరియల్‌ సీతారాములం… నిజంగానే సీతారాములం అయ్యాం…

March 13, 2023 by M S R

నా పేరు గుర్మీత్ చౌదరి… ఆరేళ్ల వయస్సున్నప్పుడు మా టీచర్ అడిగాడు… ‘‘నువ్వు జీవితంలో ఏం కావాలని అనుకుంటున్నావురా..?’’ నేను సింపుల్‌గా ‘యాక్టర్ అవుతాను సార్’’ అన్నాను… అందరూ నవ్వారు… టీచర్ కూడా జోక్‌గానే తీసుకున్నాడు… సరదాగా పిర్రల మీద ఒక్కటేశాడు… కానీ నేను సీరియస్‌గానే చెప్పాను… కాకపోతే మా కుటుంబానిది ఆర్మీ నేపథ్యం… అసలు ఫిలిమ్, టీవీ ఇండస్ట్రీలతో ఏమాత్రం లింక్ లేదు… కానీ నేను వెళ్లే తోవ అదేనని వాళ్లకూ తెలియదు అప్పుడు…

మాది నిజానికి బీహార్‌, బాగల్‌పూర్ ప్రాంతంలోని జైరాంపూర్… ఆర్మీ కుటుంబం కదా, చాలా ప్రాంతాలు తిరిగింది మా ఫ్యామిలీ… దయాల్‌పూర్‌లో ఎక్కువ కాలం ఉన్నాం.. చాలా వేసవులు గడిచిపోయాయి అక్కడే… ఆ ఊళ్లో ఒక్కటే టీవీ ఉండేది… దాని ముందు కూర్చుని ప్రోగ్రామ్స్ అన్నీ సీరియస్‌గా గమనించేవాడిని… వాటినే మళ్లీ మా కుటుంబసభ్యుల ఎదుట అనుకరిస్తూ ప్రదర్శించేవాడిని… మోహ్రా రిలీజైనప్పుడు బందన కట్టుకుని తూ చీజ్ బడీ హై మస్త్ పాటకు డాన్స్ చేస్తుంటే అందరూ బాగా చేశావురా అని చప్పట్లు కొట్టేవాళ్లు…

అందరూ చప్పట్లు కొడుతుంటే నా మనసు ఆగుతుందా ఇక… 16 ఏళ్లు వచ్చాక… నాన్నకు చెప్పాను… ‘‘నాన్నా నేను ముంబై వెళ్తాను’’… ఆయన మొదట నమ్మలేదు, తరువాత ఏమనుకున్నాడో ఏమో… క్లుప్తంగా ‘సరే’ అన్నాడు… కాసిన్ని డబ్బులతో, అనేకానేక కలలతో ముంబై చేరాను… నాలాంటోళ్లు కూడా వేలల్లో ఉంటారక్కడ… ఓ ఫిలిమ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాను… కొన్నాళ్లకు చేతిలో డబ్బు ఖర్చయిపోయింది… జేబులు ఖాళీ… అక్కడే స్వీపర్లతోపాటు పడుకునేవాడిని…

ఓసారి నా ఫ్రెండ్ సందీప్ నన్నక్కడ చూసి, కన్నీళ్లు పెట్టుకుని, తన రూం‌లో ఉండటానికి చాన్స్ ఇచ్చాడు… ఎలాగోలా గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశాను కదా… ఆడిషన్స్ ఇవ్వడం మొదలు పెట్టాను… ఓరోజు 10 ఆడిషన్స్‌కు వెళ్లాను… నాలుగేళ్లు కడుపు నిండటానికి మోడలింగ్ చేశాను… చిన్న చిన్న యాడ్ ఫిలిమ్స్ చేసేవాడిని… కథ నడుస్తోంది… కానీ ఎన్నాళ్లు ఇలా..? 24 ఏళ్లకు నాకు రామాయణ్ టీవీ సీరిస్‌లో ఏకంగా రాముడి పాత్ర దొరికింది… నవ్వకండి, హీరో పాత్ర…

రామాయణ్ టీవీ సీరియల్ అంటే దూరదర్శన్‌ కోసం రామానంద సాగర్ తీసిన ఆ రామాయణం కాదు… కానీ 2008లో ఇది తీసింది మాత్రం ఆ రామానంద సాగర్ కొడుకే, పేరు ఆనంద సాగర్… 300 ఎపిసోడ్స్… ఓరోజు ముంబైకి వచ్చిన నాన్నను బైక్ మీద తీసుకెళ్లి ఓ బిల్ బోర్డు ముందు బైక్ ఆపి చూపించాను… అందులో నేను రాముడిగా ప్రధానంగా కనిపిస్తున్నాను… నాన్న గట్టిగా హత్తుకున్నాడు… తను పెద్దగా తన ఉద్వేగాల్ని ప్రదర్శించడు… అలాంటిది నన్ను హత్తుకున్నాడు అంటే తనకు నా వృత్తి జీవితం నచ్చిందనే అర్థం…

ఆ టీవీ సీరియల్‌కు మంచి ఆదరణ లభించింది… తరువాత మలయాళం, తెలుగు, తమిళ, గుజరాత్ టీవీల్లో అనువాదాలు ప్రసారమయ్యాయి… ఇక అన్నీ అలాంటి పాత్రలే వచ్చేవి… శివుడు, విష్ణువు… ఇలా… నాకేమో ఎన్నాళ్లీ పౌరాణిక పాత్రలు అని విసుగొచ్చేది… గీత్‌లో మాన్ పాత్ర దొరికేదాకా అదే ఫీలింగ్… మాన్ పాత్ర నాకు బాగా నచ్చింది… ఓరోజు ఒక కేఫ్‌లో ఉన్నప్పుడు అమ్మాయిలు చుట్టుముట్టి ఫోటోలు తీసుకున్నారు… పర్లేదు, నేను ఎంతోకొంత సక్సెస్ సాధించినట్టే కనిపిస్తున్నాను…

14 ఏళ్లయింది ఇలా… బాగానే ఉంది జీవితం… పునర్వివాహ్ నుంచి ఖామోషీయాఁ దాకా బోలెడు పాత్రలు… రామాయణంలోనే నాతోపాటు సీత పాత్ర వేసిన డెబినాను పెళ్లిచేసుకున్నాను… సీరియల్‌లోని సీతారాములం నిజజీవితంలోనూ సీతారాములం అయ్యాం… ఇద్దరు పిల్లలు మాకు… (డెబినా తెలుగులో 2003 నాటి అమ్మాయిలు- అబ్బాయిలు, 2013లో ఆరు అనే సినిమాల్లో నటించింది)… మొదట్లో కేవలం ఒక గుడిలో పెళ్లిచేసుకున్నాం మేం… అది 2011… తరువాత తనకు బెంగాలీ పద్ధతిలో పెళ్లి చేసుకోవాలని ఉన్నట్టు చెప్పింది డెబినా… పదేళ్ల తరువాత ఆ పద్ధతిలో కూడా పెళ్లి చేసుకున్నాం… యాక్టర్ అనే కలను నేను నిజం చేసుకున్నాను… కలాం చెప్పినట్టు చిన్నవో, పెద్దవో కలలు కందాం, ఆ కలల్ని నిజం చేసుకుందాం కూడా…!!

Share this Article






Advertisement

Search On Site

Latest Articles

  • రంగమార్తాండ సినిమాలో కృష్ణవంశీ ఎక్కడెక్కడ రాంగ్‌స్టెప్స్ వేశాడంటే..?!
  • ధమాకా, ఖిలాడీ మూవీల కంబైన్డ్ కిచిడీ… విష్వక్సేనుడి దాస్‌కాధమ్కీ…
  • Rangamarthanda… ప్రకాష్‌రాజ్ ‘అతి’… బ్రహ్మానందం పర్‌ఫెక్ట్… రమ్యకృష్ణ వోకే…
  • రంగు సోడాల కడుపులు కొట్టి… ఆర్గానిక్ షర్బతుల పనిపట్టి… కూల్‌డ్రింక్స్ రసాయనదాడి…
  • ఢిల్లీ టు మద్రాస్… గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్‌లో రెండు రోజుల ప్రయాణం…
  • FingerTip… సోషల్ మీడియా కోట శ్రీనివాసరావును చంపేశాక ఇది గుర్తొచ్చింది…
  • ఈసారి ఉగాది టీవీ షోస్… పులుపు లేని చింత, తీపి లేని బెల్లం, చేదెక్కువ వేప్పువ్వు…
  • 186 అమెరికన్ బ్యాంకులు దివాలా దిశలో… అగ్రరాజ్యంలో ఆర్థిక సంక్షోభం…
  • థూమీబచె… ఎంతకు తెగించార్రా… ఇది ఉగాది స్పెషల్ షో అట..!!
  • కన్నతల్లికి మళ్లీ కల్యాణం… పెళ్లీడుకొచ్చిన కొడుకులే ఈ పెళ్లికి పెద్దలు…

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions