Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బహుశా విజయశాంతికీ గుర్తుండి ఉండదు ఇదో సినిమా చేసినట్టు..!!

July 12, 2025 by M S R

.

Subramanyam Dogiparthi .....  విజయశాంతి సినిమా . లేడీ అమితాబ్ కాకముందు లేడీగా ఉన్న రోజుల్లోని విజయశాంతి సినిమా . బహుశా ఏవరేజుగా ఆడి ఉండొచ్చు . ఈ సినిమా పేరు కూడా చాలామందికి గుర్థుండి ఉండదు . 1985 జూన్ 21న విడుదలయిన ఈ కొత్త పెళ్ళికూతురు సినిమా సాదాసీదా కుటుంబ కధా చిత్రం . ఒక్కింత సస్పెన్సుతో .

ఓ ఆర్మీ డాక్టర్ గారు యుధ్ధంలో గాయపడి మరణిస్తాడు . ఆయన పోతూపోతూ తనకు ఓ నర్సుతో సంబంధం ఉందని , ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడని , వాళ్ళను ఆదుకొమ్మని ధర్మపత్నిని కోరుతాడు . ఆ డాక్టర్ గారి ధర్మపత్ని ఆ నర్సు కోసం వాళ్ళ ఊరు వెళుతుంది . డాక్టర్ మరణ వార్త విని ఆమె చనిపోతుంది . ఆ కొడుకుని మేనమామకు అప్పచెప్పి లక్ష రూపాయలను కూడా ఇస్తుంది ధర్మపత్ని .

Ads

ఆ మేనమామ డబ్బును తానుంచుకుని బిడ్డను మరొక దంపతులకు ఇచ్చి భార్యాకుమార్తెలతో , మేనల్లుడితో పట్నం వెళ్ళిపోతాడు . నర్సు కొడుకు చిల్లర దొంగ అవుతాడు . కధ మలుపులు తిరిగి చివర్లో తప్పులు చేసినవారు తప్పులను తెలుసుకుని బుధ్ధిమంతులు కావడంతో సినిమా అయిపోతుంది .

హీరో చంద్రమోహన్ విలువలు కలిగిన జర్నలిస్ట్ . అభ్యుదయావేశ భావాలు కలవాడు. హీరోయిన్ విజయశాంతి డబ్బు చేసిన పొగరుబోతు . కరాటే ఫైటర్ , శాస్త్రీయ నృత్యంలో ప్రావీణ్యం ఉన్న యువతి కూడా . ఆమెను సంస్కరించే క్రమంలో మహాకవి శ్రీశ్రీ పాట కూడా ఒకటి ఉంటుంది సినిమాలో . చూడు చూడు నీడలు అంటూ సాగుతుంది .

చంద్రమోహన్ మేనమామగా గొల్లపూడి మారుతీరావు నటించాడు . సినిమాలో విలన్ అతనే . వీడియో పార్లర్ నడుపుతుంటాడు . 1990 తర్వాత పుట్టినవారికి బహుశా ఈ వీడియో పార్లర్ల గురించి తెలియకపోవచ్చు . టివిలు , వీడియో ప్లేయర్లు మధ్య తరగతి ఇళ్ళల్లోకి చేరకముందు ఈ వీడియో పార్లర్లు ఉండేవి . ఓ చిన్న గదిలో నడుపుతుండేవారు . సినిమా మధ్యలో బ్లూ ఫిలింలు వేస్తుండేవారు . పోలీసులకు పని , పోలీసుల పని బాగా ఉంటుండేది .

కె వి మహదేవన్ సంగీత దర్శకత్వంలో వేటూరి వారి పాటలు శ్రావ్యంగా ఉంటాయి . నృత్య దర్శకుడు శేషు విజయశాంతి శాస్త్రీయ నృత్యాలను చాలా అందంగా కంపోజ్ చేసారు . పాడుదు నా జావళి అనే పాటతో విజయశాంతి ఇచ్చే నృత్య ప్రదర్శనలో ఆమె నృత్యం చాలా చాలా బాగుంటుంది .

విజయశాంతి , చంద్రమోహన్ల రెండు డ్యూయెట్లు కూడా చాలా బాగుంటాయి . రెండింటిలోనూ విజయశాంతి నృత్యాలు చాలా బాగుంటాయి . కొత్త నీరు పెట్టుకుంది గోదావరి , కొమ్మలో కూసింది ఓ కోయిలా పాటలు ఈ రెండు . అనూరాధ పంచుకో పట్టె మంచముంది ఉంచుకో పిట్ట మంచిగుంది రొమాంటిగ్గా హుషారుగా ఉంటుంది .

కె యస్ రామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఇతర ప్రధాన పాత్రల్లో రాజేంద్రప్రసాద్ , కాకరాల , రావి కొండలరావు , అన్నపూర్ణ , వనితశ్రీ , చిట్టిబాబు , రమాప్రభ  ప్రభృతులు నటించారు . అలనాటి హాట్ హీరో హరనాధ్ ఆర్మీ డాక్టరుగా కాసేపు అతిధి పాత్రలో కనిపిస్తాడు .

తోటపల్లి మధు సంభాషణలను వ్రాసారు . సినిమా కాస్తో కూస్తో గుర్తుందంటే విజయశాంతి నృత్యాలు మాత్రమే , మహదేవన్ సంగీతంతో పాటలు , శేషు కంపోజ్ చేసిన నృత్యాలే కారణం . కధను బాగానే ఎంచుకున్నా చిత్రానువాదంలో దర్శకుడు తచ్చాడారు . అయిననూ విజయశాంతి అభిమానులు చూడవచ్చు . ఒకేసారి కాకపోయినా వాయిదాల్లో చూడొచ్చు . యూట్యూబులో ఉంది . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమాకబుర్లు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అంతా కాలమహిమ- చంద్రబాబా మహత్తు- ఆ లీలలెన్న తరమా !?
  • ‘యాదాద్రి’పై రేవంత్ రెడ్డి కొరడా ! కేసీయార్ నిర్వాకాలే అసలు తలనొప్పి !!
  • రజినీ ఒక్కడు చాలదా..? మరీ ఇన్ని కామియోలు ఎందుకురా బుజ్జా..!!
  • కట్టి, కూల్చి, మళ్లీ కట్టి… కేసీయార్ మార్క్ ‘ఇంజినీరింగ్ అద్భుతం’…
  • మళ్లీ తెరపైకి బనకచర్ల ! చంద్రబాబు తమిళనాడు నుంచి నరుక్కొస్తున్నాడా..!?
  • జాతీయ పరీక్షల్లో AI సాయం ! నందన్ నీలేకని ప్రతిపాదన భేష్ !!
  • గజల్ శ్రీనివాస్ అంటేనే… గజలియత్‌కు ఓ అవమానం, ఓ కళంకం !!
  • ఓ సామాజిక కథతో మళ్లీ కలిసిన సీతారాముల జంట!
  • ఈ జెండాలు స్పష్టంగానే కుట్ర హెచ్చరికల్ని జారీ చేస్తున్నయ్!!
  • పొలిటికల్ రిపోర్టింగ్ ఎన్నో జీవితసత్యాల్ని ‘అక్షరాలా’ కళ్లకుగట్టింది !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions