.
నిన్నటి నుంచీ ఒకటే గోల… పుష్ప2 మీద నోరు పారేసుకున్న సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ అని…
చందనం దొంగ హీరో అట అని సంచలన వ్యాఖ్యలు… అల్లు అర్జున్‌ను కించపరిచాడు అని వార్తలు… టీవీ చానెళ్లలో, మెయిన్ స్ట్రీమ్ అనుబంధ సైట్లలో, సోషల్ మీడియాలో ప్రచారం…
Ads
ఏమిటబ్బా, అంత సీనియర్ నటుడు అలాంటి కామెంట్ ఎందుకు చేశాడు అని ఒక వీడియో క్లిప్పింగ్ చూస్తే… కొంత భిన్నంగా కనిపించింది…
(వీడియో బిట్ హిట్ టీవీ సౌజన్యం)
హరికథ అనే వెబ్ సీరీస్ హాట్‌స్టార్ ప్లాట్‌ఫామ్ కోసం రెడీ అయ్యింది… బహుశా ఈవారమే స్ట్రీమింగ్ అనుకుంటా… అందులో రాజేంద్రప్రసాద్ ప్రధానపాత్ర… రంగాచారి అనే హరికథలు చెప్పుకునే పాత్ర… ఇందులో పూజిత, దివి, శ్రీకాంత్ (తమిళ్), అంబటి అర్జున్ , మౌనిక తదితరులు నటీనటులు…
ప్రిరిలీజ్ ఫంక్షన్ వంటిదే ఏదో ఏర్పాటు చేశారు… అక్కడ రాజేంద్రప్రసాద్ మాట్లాడినప్పుడు తన ప్రసంగంలో చేసిన వ్యాఖ్యే ఈ చందనం దొంగ హీరో అనే వ్యాఖ్య… నిజానికి ఇందులో బన్నీని విమర్శించిందేమీ లేదు…
తనకు దక్కిన పాత్ర ఎంత గొప్పదో చెప్పుకోవడానికి… ఓ కంట్రాస్టుగా నెగెటివ్ షేడ్స్ ఉన్న హీరోల కథలు వస్తున్న నేపథ్యాన్ని చెబుతూ… తన పాత్ర విశిష్టతను ప్రొజెక్ట్ చేసుకోవడానికి చేసిన ఓ విఫల ప్రయత్నం… పుష్ప హీరో పాత్రనే కాదు… తను నటించిన లేడీస్ టైలర్, పేకాట పాపారావు వంటి పాత్రల్నీ ప్రస్తావించాడు తను…
కాకపోతే తనేం మాట్లాడుతున్నాడో తనకే అర్థం కాదు… అంత పొంతన లేకుండా ఉంటాయి వాక్యాలు… ఎటు నుంచి ఎటు పోతున్నాడో తెలియదు… తను చెప్పదలుచుకున్నది సూటిగా, అర్థమయ్యేలా చెప్పడం చేతకాని అవస్థ ఇది…
ఏదో జోక్ వేశానని అనుకుంటాడు… ఇది జోకే సుమా అని తనే క్లారిటీ ఇస్తాడు… ఐదు తరాల్నుంచి వచ్చినవాడిని అంటాడు… అంటే ఎన్టీయార్, ఏఎన్నార్ కాలం నుంచి నేటి కుర్ర హీరోల వరకు చూశాను, ఇప్పటికీ తనను నమ్మి ఆనాటి ఉదాత్త పాత్రలు తనకు వస్తున్నాయని చెప్పడం తన ఉద్దేశం…
అదేదో సూటిగా చెప్పి, భుజాలు చరుచుకుంటే అయిపోయేది కదా… మనిషి ఏదో ‘మత్తు’లో ఉన్నట్టు, అర్థమయ్యీకానట్టు మాట్లాడటమే ఈ వ్యాఖ్యల వివాదానికి కారణం… పోనీ, ఆ పాత్ర గొప్పదనాన్నీ చెప్పలేకపోయాడు… ఏదో హరికథ వినిపించబోయాడు… అది కాస్తా అటూఇటూ గాకుండా పోయింది… మంచి నటులందరూ మంచి వక్తలు కావాలనేముంది..? ఇదుగో ఇలా..!!
నిజానికి తను ఒకవేళ ధైర్యంగా చేయాలనుకుంటే… నేరుగానే పుష్పరాజ్ పాత్ర మీద వ్యాఖ్యలు చేసినా తప్పులేదు… చాన్నాళ్లుగా సినిమాల్లో హీరోల పాత్రకు ఓ ఔచిత్యం లేకుండా పోతోంది… స్మగ్లర్లు, దొంగలు, ఆర్థిక నేరస్థులు కూడా హీరోలు అయిపోతున్నారు..! విలనీ గ్లోరిఫై అవుతోంది… అది సమాజానికి మంచిది కాదనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నవే కదా…!!
Share this Article