ఒక చిన్న వార్త… ఎందుకు ఆకర్షించిందీ అంటే… సాధారణంగా సినిమా తారలు, టీవీ తారలు ఎవరూ సినిమాల మీద గానీ, నటీనటుల మీద గానీ, దర్శకుల మీద గానీ నెగెటివ్ వ్యాఖ్యలు చేయరు… వాళ్ల జీవితాలు ఇండస్ట్రీలో సెన్సిటివ్… అసలే మగ వివక్ష… తమ వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడితే తరువాత తమను తొక్కేస్తారనే భయం… అందుకే నచ్చినా నచ్చకపోయినా గొంతు దాటనివ్వరు… లోలోపల అణిచేసుకుంటారు…
కానీ తమిళ నటి కస్తూరి అలా కాదు… సినిమాలే కాదు, పలు సామాజిక, రాజకీయ అంశాల మీద కూడా మాట్లాడేస్తుంది… తరువాత ఏమైనా కానియ్, డోన్ట్ కేర్ అనుకునే డేరింగ్ తత్వం ఆమెది… పలు అంశాల మీద, ప్రత్యేకించి మహిళల మీద వివక్ష అంశాలపై సింగర్, డబ్బింగ్ ఆర్డిస్ట్ చిన్మయి కూడా నోరు విప్పుతుంది… కస్తూరి తాజా వ్యాఖ్య యానిమల్ సినిమా మీద…
సూపర్ బంపర్ హిట్ కదా… వసూళ్లకు సంబంధించి…! సరే, ఇప్పుడు ఓటీటీలోకి వచ్చాక, దాన్ని చూస్తూ చాలామంది తిట్టిపోస్తున్నారు, ఫేస్‌బుక్‌లో పోస్టులు కూడా కనిపిస్తున్నాయి… కస్తూరి కూడా ఓటీటీలోనే చూసినట్టుంది… అందుకే లేట్‌గా రియాక్టవుతూ వంగా సందీప్‌రెడ్డి దర్శకత్వానికి ఇచ్చిపడేసింది… అంతకుముందు నటి రాధిక కూడా ఆ సినిమా పేరు చెప్పకుండా ఛస్, ఇదేం సినిమార భయ్ అన్నట్టు కామెంట్స్ చేసింది… కానీ ఈమె కస్తూరి కదా, సినిమా పేరు చెప్పి మరీ కామెంట్స్ పాస్ చేసింది…
Ads
అంతకుముందు ఇదే సందీప్‌రెడ్డి తెలుగులో తీసిన అర్జున్‌రెడ్డి సినిమా కూడా చాలా విమర్శలకు గురైంది… అప్పట్లో టీవీ యాంకర్, ప్రస్తుత నటి అనసూయ కూడా నెగెటివ్‌గా స్పందించింది… ట్రోలింగ్‌కు కూడా గురైంది… కానీ తన అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పినందుకు నో రిగ్రెట్స్ అన్నట్టుగానే వ్యవహరించింది… కాస్త డేరింగే… యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన యానిమల్ మరీ అర్జున్‌రెడ్డికన్నా ఘోరంగా ఉందని కొందరి అభిప్రాయం…
ప్రత్యేకించి సినిమాలోని కంటెంటుతోపాటు వాడిన భాష, ఆ సీన్లను వ్యతిరేకిస్తున్నారు చాలామంది… కస్తూరి, రాధిక మాత్రమే కాదు, తమిళ నెటిజనం కూడా ఈ సినిమాను ఏవగించుకుంటున్నట్టు సోషల్ మీడియా పోస్టులు చెబుతున్నాయి… “నిన్న రాత్రి ఈ సినిమా చూడటం మొదలుపెట్టాను. సగం కూడా అయిపోలేదు. అప్పటికే విసుగొచ్చింది. అసలు ఈ మూవీని ఎలా చూశారు? మూడున్నర గంటలు ప్రజలు సినిమా హాళ్లలో ఎలా కూర్చున్నారు? ఆటో ఫ్లైయింగ్ ప్లేన్‌లో ఆ సన్నివేశాలు ఏమిటి? ప్రేమలో పడటం, మాట్లాడుకునే సమయంలోనే అలా జరగడం ఏంటి? నన్ను తప్పుగా భావించవద్దు, ఇది ఒక ఫిల్మ్ మేకర్ టాప్ నాచ్‌లో తెరకెక్కించాడు. కానీ ఆ రేంజ్ అందుకోలేం. మూవీలో చాలా ఉంది. కానీ ఆ మూవీ ఎంటర్టైన్ చేయకుండా, విసుగును తెప్పించింది” అని సామాజిక వేదిక ఎక్స్ లో రాసుకొచ్చింది కస్తూరి…
Share this Article