Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అగ్రరాజ్యాల అసలు రాజకీయాల్లో పావులు ఇజ్రాయిల్, పాలస్తీనా…

October 11, 2023 by M S R

పార్ధసారధి పోట్లూరి ….. రష్యా, ఇరాన్, టర్కీ ,లేబనాన్, జోర్డాన్,సిరియా, ఇప్పటికే బయట పడ్డాయి తాము అమెరికా, ఇజ్రాయెల్, నాటో కి వ్యతిరేకం అని. ఇంతకీ రష్యా ఇజ్రాయెల్ విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంది? చాలా కారణాలు ఉన్నాయి!

నాటో దేశాలలో చాలా వరకు ఉక్రేయిన్ కి ఆయుధాలు సరఫరా చేసి విసిగిపోయాయి! యుక్రెయిన్ కన్ఫ్లిక్ట్ ఇప్పట్లో ముగిసేలా లేదు. ఏదో ఒక చోట ఆగిపోవాలి. దానికోసం మెల్లగా ఆయుధ సరఫరాని తగ్గిస్తూ వస్తున్నాయి. కానీ అమెరికా నుండి వత్తిడి పెరుగుతున్నది! మీ దగ్గర ఉన్న పాత ఆయుధాలు వదిలించుకోండి. అధునాతన ఆయుధాలు మేమిస్తాము. ఇదీ అమెరికా నాటో దేశాల మీద తెస్తున్న వత్తిడి.

కానీ అధునాతన ఆయుధాల మీద ఖర్చు చేసే స్థితిలో లేవు నాటో దేశాలు. ఇజ్రాయెల్ కనుక ఉక్రేయిన్ కి సహాయం చేస్తే ఉక్రేయిన్ రష్యాని ధీటుగా ఎదుర్కోగలదు అని పెంటగాన్ వ్యూహం! ప్రస్తుతం రష్యన్ ఎయిర్ ఫోర్స్ కి వెన్నెముక అయిన SU-30 జెట్లని ఉక్రేయిన్ SU-27 లు ఎదుర్కొలేకపోతున్నాయి.

Ads

అదే సమయంలో భారత్ దగ్గరున్న SU-30 MKI లకి ఇజ్రాయెల్ ఇచ్చిన EW (Electronic Warfere) సూట్ వల్ల పాక్ F-16 నుండి ప్రయోగించిన AMRAAM 120 మిస్సైల్స్ ని జామ్ చేయగలింది. గత కొంత కాలంగా అమెరికా ఉక్రేయిన్ కి కూడా EW సూట్ SU27 లకి అమార్చమని అడుగుతున్నది. కానీ ఇజ్రాయెల్ తిరస్కరిస్తూ వస్తున్నది. అలాగే వివిధ రంగాలలో ఉపయోగించే ఎలెక్ట్రానిక్ జామర్స్ ఇవ్వమని అడుగుతున్నది.

ఇజ్రాయెల్ మొదటి నుండి రష్యా, ఉక్రేయిన్ ల విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోకుండా తటస్థంగా ఉంటూ వచ్చింది. మూడు నెలల క్రితం జెలెన్స్కీ ఇజ్రాయెల్ కి మానవత్వం అంటే ఏమిటో తెలియదు అంటూ మాట్లాడాడు, దానికి ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహూ బదులిస్తూ నీ ఇంటిని చక్కపెట్టుకునే పనిలో ఉండు, మాకు నీతులు చెప్పే ప్రయత్నం చేస్తే తగిన గుణపాఠం చెప్తుంది ఇజ్రాయెల్ అంటూ తీవ్రమయిన హెచ్చరిక చేశాడు.

*****************

ఇజ్రాయెల్ కి రష్యాతో పెట్టుకుంటే పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసు, అందుకే భారత్ లాగా న్యూట్రల్ గా ఉంటూ వస్తున్నది! పుతిన్ మాజీ గూఢచారి అన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలి! మాస్కో నుండి టెల్ అవీవ్ చేరుకోగల ICBM లు రష్యా దగ్గర ఉన్నాయి!

ఇచ్చి పుచ్చుకోవాలి కదా?

ఆపద సమయంలో ఇరాన్ వేల కొద్దీ కామికాజ్ డ్రోన్లని ఇచ్చింది! ప్రస్తుతం రష్యాకి ఇప్పటికిప్పుడు డ్రోన్లు అదీ వేల సంఖ్యలో తయారుచేసే సమయం లేదు కాబట్టి ఇరాన్ నుండి నేరుగా డిజైన్ తీసుకుని, కొద్దిపాటి మార్పులు చేసి స్వంతంగా తయారు చేసుకుంటున్నది! హమాస్ విషయంలో చాలామంది మర్చిపోయిన విషయం ఏమిటంటే పాలస్తీనాని ఒక దేశంగా గుర్తించి వాళ్ళ ప్రతినిధికి శాశ్వత ప్రాతిపదికన మాస్కోలో కార్యాలయం ఇచ్చాడు పుతిన్.

ఇజ్రాయెల్ భయానికి కారణం పాలస్తీనాకి ప్రతినిధిని మాస్కోలో ఉంచడం ఒక కారణం. రష్యా తనకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ ఎలాంటి స్టెప్ తీసుకున్నా హమాస్ కి సహాయం చేస్తుంది. ఇప్పటికే ఉక్రేయిన్ పైలట్లకి F-16 ల మీద ట్రైనింగ్ ఇస్తున్నాయి నాటో దేశాలు. Su-30 MKI జన్మస్థలం రష్యా అయినా రష్యా దగ్గర ఉన్న SU 30 లకంటే మన దగ్గర ఉన్న SU-30 MKI లు చాలా అడ్వాన్స్ గా ఉండడానికి కారణం ఫ్రెంచ్ ఏవియానిక్స్, ఇజ్రాయేలీ EW సూట్ లు కారణం.

అలాగే ఇజ్రెయేల్ దగ్గర ఉన్న F-16 లు అమెరికా దగ్గర ఉన్న F-16 ల కంటే చాలా అడ్వాన్స్. ఇజ్రాయెల్ తన స్వంత EW సూట్ ని అమర్చుకుంది. రష్యా భయం ఏమిటంటే ఉక్రేయిన్ కి ఇచ్చే F-16 లలో ఇజ్రాయెల్ టెక్నాలజీ పెట్టి ఇస్తే అది రష్యన్ ఎయిర్ ఫోర్స్ కి నష్టం కలిగిస్తుంది. ఇజ్రాయెల్ తన భద్రత చూసుకోవడంలో బిజీగా ఉండాలి అంటే హమాస్ చేత దాడి చేయించాలి అదీ సాదా సీదాగా ఉండకూడదు.

మరోవైపు ఇరాన్ ఎప్పటినుండో అడుగుతున్న సహాయం చేసి ఋణం తీర్చుకుంది. ఇక ముస్లిం దేశాలను ఇజ్రాయెల్ నుండి వేరు చేయాలి అంటే ఇజ్రాయెల్ పాలస్తీనా మీద భీకర దాడి చేయాలి. ఇప్పుడు ఇజ్రాయెల్ అదే చేస్తున్నది. UAE మాత్రమే హమాస్ చర్యని ఖండించింది. మిగతా అరబ్ దేశాలు మౌనంగా ఉన్నాయి.

ఈ నెలలో ఇజ్రాయెల్ సౌదీతో వాణిజ్య, వ్యవసాయ, టెక్నాలజీ రంగాలలో పరస్పర ఒప్పందం చేసుకోబోతున్న సమయంలో హమాస్ దాడి జరిగింది. మరీ మసీదులని బాంబులతో కూల్చేసింది గాజాలో ఇజ్రాయెల్. సౌదీకి ఇది నచ్చకపోతే ఒప్పందం ఉండదు. పుతిన్ కి , ఇరాన్ కి కావాల్సింది ఇదే! SO! అరబ్ ప్రపంచాన్ని డైలమాలో పడేసింది రష్యా. నాతో కలుస్తారా? లేక ఇజ్రాయెల్ అమెరికా కూటమిలో కలుస్తారా? రష్యా విసిరిన సవాల్ కి జవాబు ఇప్పట్లో ఎవరూ ఇవ్వలేరు. ఉక్రేయిన్ తో చేస్తున్న యుద్ధంని దృష్టి మళ్లించి ఫోకస్ మధ్య ప్రాచ్యం వైపు మళ్లించడంలో విజయం సాధించింది రష్యా!

ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్, ఇరాక్, లిబియా దేశాలలో అమెరికా, యూరోపు దేశాలు చేసింది కరెక్ట్ అయితే ఇప్పుడు రష్యా చేసింది కూడా కరెక్ట్ అవుతుంది. హమాస్ ఎలా ప్రవరిస్తుందో పుతీన్ కి తెలుసు! పుతిన్ వల్ల పరోక్షంగా 2000 మంది యూదులు మరణిస్తే ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్, లిబియా దేశాలలో మరణించిన సామాన్య ప్రజల గురుంచి ఎవరూ మాట్లాడరు!

ఇజ్రాయెల్ మనకి మిత్ర దేశం కాబట్టి బాధ కలుగుతున్నదేమో కానీ కొద్ది వేల మంది ఉగ్రవాదులను చంపడం కోసం అమెరికా, కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్, జెర్మనీ, స్వీడన్, నెదర్లాoడ్ దేశాలు కలిసి 5 లక్షల మంది ఉసురు తీశారు.అప్పుడు రష్యా కలుగ చేసుకోలేదు! ISIS, అల్ ఖైదా, ముజాహిదీన్, తాలిబాన్, లష్కరే తోయిబాలని సృష్టించింది అమెరికా కాదా?

ఉక్రేయిన్ లో ఇప్పటివరకు 2 లక్షల మంది మరణించారు. 10 లక్షల మంది వలస వెళ్లిపోయారు. అమెరికా వేలు పెట్టకుండా ఉంటే రష్యా ఉక్రేయిన్ మీద దాడి చేసేదా? జియో పాలిటిక్స్  అర్ధం చేసుకోవాలి ముందు! హిందువులు, ముస్లిమ్స్, క్రైస్తవులు, యూదులు , సిక్కులు అనే పదాలు ఒక సాకుగా చూపబడుతున్నాయి. ఏ దేశ ప్రయోజనాల కోసం ఇదంతా జరుగున్నది అనేది ఎప్పటికీ అర్ధం కాదు!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions