మీరు గమనించే ఉంటారు కదా… సుడిగాలి సుధీర్ వీడియోలకు సంబంధించిన కామెంట్ సెక్షన్‌లో… తెలుగులోనే కాదు, ఇతర భాషల నుంచి కూడా బోలెడు ప్రశంసలు, సుధీర్ ప్రత్యర్థులపై విమర్శలు, విసుర్లు కనిపిస్తుంటాయి… రీజన్ సింపుల్… తన పీఆర్ టీం ఎఫిషియెంట్ వర్క్… తను హీరోగా చేసిన గాలోడు సినిమా రిలీజైంది కదా… మొదటి రోజు నుంచే వసూళ్ల మీద డప్పు కథనాలు స్టార్టయ్యాయి…
తప్పులేదు, పెద్ద పెద్ద హీరోలే వసూళ్ల లెక్కలను ప్రచారంలోకి పెడుతుంటారు… వాటిల్లో చాలావరకు అబద్ధాలే ఉంటయ్… కానీ గాలోడు విషయానికి వస్తే అవి శృతి మించాయి… అవి నిజానికి సుధీర్ కెరీర్‌కు బాగా నష్టం వాటిల్లజేయబోతున్నాయి… ఇండస్ట్రీలోని రెండు బలమైన కుటుంబాలకు సుధీర్ పట్ల వ్యతిరేకత పెరగడానికి అవి కారణం కాబోతున్నాయి… ఇది అనవసరం గోకుడే… ఎందుకంటే..?
వసూళ్ల గురించి ఏం రాసుకున్నా వోకే… కానీ మంచు విష్ణు జిన్నాతో, అల్లు శిరీష్ ఊర్వశివో రాక్షసివో సినిమాతో పోలుస్తూ… ఆ వసూల్లతో పోలుస్తూ… వాళ్లకన్నా సుధీరే తోపు, వాళ్లు వేస్ట్ అనేట్టుగా కథనాలు రావడం తనకే నష్టం… ఏ సినిమాను ఆ సినిమా కోణంలోనే చూడాలి… ఏ హీరోను ఆ హీరో కోణంలోనే చూడాలి… ఈ పోలికలు అనవసరంగా సుధీర్ పట్ల శతృత్వాన్ని పెంచడమే అవుతుంది… అదసలే మంచు కుటుంబం… హఠాత్తుగా సుధీర్‌ను ఏమో చేస్తారని కాదు, వాళ్లు గుర్తుంచుకుంటారు… అల్లు అరవింద్ సహా…!
Ads
ఆచార్య అట్టర్ ఫ్లాప్ అయ్యింది, ఇక చిరంజీవి వేస్టా..? అఖండ హిట్టయింది… ఇక చిరంజీవి వేస్ట్, బాలయ్య తోపు అని రాసేస్తమా..? రాయం కదా… రాయకూడదు కదా… ఎవరి కెరీర్ వాళ్లదే… ఇదీ అంతే… మంచు విష్ణు ఒక సినిమా ఫెయిల్ కావడానికి లక్ష కారణాలున్నయ్… అసలు ఆ టైటిల్ ఎంపికే ఓ మూర్ఖత్వం… రొటీన్, రొడ్డకొట్టుడు, సగటు తెలుగు సినిమా బిల్డప్ పోకడ… జనానికి నచ్చలేదు… కానీ ఏదైనా మంచిపాత్ర దొరికితే, తన పట్ల ప్రేక్షకలోకంలో బాగా వ్యతిరేకతను పెంచే తన నాలుకను అదుపులో పెట్టుకోగలిగితే బ్రహ్మాండమైన హిట్ సాధించగలడు…
శిరీష్ కూడా అంతే… తన వెనుక ఓ బలమైన శక్తి ఉంది… తనకు సరిపోయే పాత్ర పడటం లేదు… సుడి బాగాలేదు… ఏమో, తనకూ ఏదైనా మంచి పాత్ర దొరికితే తనూ హిట్టవుతాడు కదా… మరి గాలోడులో ఏముంది..? ఓ ప్రయోగం ఉందా..? ఓ కొత్తదనం ఉందా..? గ్రిప్పింగ్ కథనం ఉందా..? అనవసరపు బిల్డప్పులు, యాక్షన్ సీన్లే కదా… కాకపోతే ఇప్పుడు మార్కెట్‌లో చూడబుల్ సినిమాలేమీ లేవు, తన మీద బూతుల జబర్దస్త్ ముద్ర ఉన్నా సరే, తన సినిమాలో మాత్రం అశ్లీలాన్ని నమ్ముకోకపోవడం ఓ గుడ్ అండ్ ప్లస్ పాయింట్… యశోద, కాంతార తప్ప… సో, సుధీర్ సినిమాకు అడ్వాంటేజ్ కావచ్చుగాక…
ఐనా సుధీర్ రేంజ్ చాలా చిన్నది… గాలోడు సినిమా వ్యాపారమే బహుశా 2, 3 కోట్ల లోపు… అఫ్‌కోర్స్, తను తక్కువేమీ కాదు, మంచి రోల్ పడాలే గానీ ఇరగదీస్తాడు… కానీ ప్రేక్షకులు ఇంకా తనను ఓ జబర్దస్త్ సుధీర్‌గానే చూస్తున్నారు… అది తనకు పెద్ద మైనస్… విష్ణు, శిరీష్‌ల నేపథ్యాలు వేరు… ఇక్కడ సుధీర్ కూడా ఈ కథనాలపై ఏమీ చేయలేడు… ఫాఫం, ఖండించలేడు, వివరణ ఇవ్వలేడు… కాకపోతే చిన్న రిలీఫ్ ఏమిటంటే… అల్లు అరవింద్ ఇవి పట్టించుకోడు, సుధీర్‌నైనా తనకు పనికొస్తాడా లేదా అనే వ్యాపార సరుకుగా చూస్తాడు… కానీ మోహన్‌బాబు అలా కాదు… కాదు…!!
Share this Article