.
పమేలా సత్పతి… స్వరాష్ట్రం ఒడిశా… తండ్రి డీఆర్డీవో ఆఫీసర్… భర్త ప్రముఖ వైద్యుడు… ఆమె బీటెక్ చేసి, ఇన్ఫోసిస్‌లో చేసింది… సీఎస్‌ఐఆర్‌లో ఫెలో సైంటిస్ట్… జేఎన్‌యూలో ఎంఏ… ఎన్ఐఆర్‌డీలో పీజీ డిప్లొమా… ఓపెన్ యూనివర్శిటీలో ఎంఏ… హ్యూమన్ రైట్స్ సబ్జెక్టులో పీడీ డిప్లొమా… 2015 సివిల్స్ 51 వ ర్యాంకు, ఐఏఎస్… ఇదీ కరీంనగర్ కలెక్టర్ నేపథ్యం…
జిల్లా అత్యున్నత అధికారిని పట్టుకుని, ఏదో పబ్లిక్ మీటింగ్ సందర్భంగా ‘కామన్ సెన్స్ లేదా’ అని ఒక మంత్రి పొంగులేటి నోరు పారేసుకున్నాడు… అదీ తన వ్యక్తిగత సంస్కార స్థాయి… డబ్బు, అధికారం కలగలిస్తే అలాగే ఉంటుంది… ఐతే ఇందులో కాంగ్రెస్ ఎక్కువ కాదు, బీఆర్ఎస్ తక్కువ కాదు… మహిళా అధికారిణుల పట్ల ఒకరిద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరు గతంలో చదివాం కదా… అదే బీఆర్ఎస్ దొరికింది కదా చాన్స్ అనుకుని పొంగులేటి మీద విరుచుకుపడుతోంది… ఐరనీ…
Ads
దీనికి పొంగులేటి వివరణ కూడా తన ధోరణిలాగే ఉంది… ‘నేనేమిటో నాకు తెలుసు, అనవసర రాద్ధాంతం చేస్తున్నారు, ఎవరో ఏదో అంటే పట్టించుకోను, స్పందించాల్సిన అవసరం లేదు’ అంటున్నాడు… అదీ పొంగులేటి… తను తిట్టాక ఆమె హర్టయిందని అక్కడి బీజేపీ నేతలు కూడా చెబుతున్నారు… సహజం… వర్తమానంలో ఫాఫం కలెక్టర్ల దుర్గతి అది… రాజకీయాధికారానికి ఎవరైనా అలుసే కదా…
ఆమె ఇన్‌స్టాలో ఓ పోస్టు పెట్టుకుంది… ఇదీ అది…
I am a women of seasons, I burn, I bloom, I stike, I turn to ice, sometimes I melt away… ఇదీ పోస్టు… ఓ కవిత… ప్యూర్ తెలుగులోకి దించలేకపోవచ్చు గానీ… దాని అర్థం… సందర్భాలకు తగినట్టుండే మహిళను, నేను కాలిపోతా, నేను చిగురిస్తా, విరుచుకుపడతా, గడ్డకడతా, కొన్నిసార్లు కరిగిపోతా…
నిజానికి ఆమె హర్ట్ కావచ్చుగాక… కానీ ఆమె బాధకూ ఈ కవితాపాదాలకు పెద్దగా పొంతన కుదరదు… ఏదో అనాలని అనుకుందా, లేక యథాలాపంగా తనకు యాదికొచ్చిన ఓ ఇంగ్లిష్ పొయెట్రీని ఇన్‌స్టాలో పోస్ట్ చేసుకుందా… ఇంతకీ తద్వారా ఆమె ఏం చెప్పాలనుకుందో ఎవరికీ అర్థం కాని మిస్టరీ… ఆ కవితలాగే..!
నో, నో, పొంగులేటి మీదే అని ఓ సెక్షన్ మీడియా రాసుకొచ్చింది… పొంగులేని తిట్లకూ, ఆమె బాధకూ దీనికీ అన్వయం ఎలా కుదురుతుందో ఏమిటో మరి..! ఎందుకు అనవసరంగా ప్రముఖ్య ముఖ్యులతో గోక్కోవడం, ఆ పోస్టు బాగా నెగెటివ్‌గా వెళ్తోంది అని ఎవరైనా చెప్పారో ఏమో… ఆమె ఏమనుకున్నదో ఏమో… కాసేపటికే ఆ పోస్టు డిలిట్ అయిపోయింది…
Share this Article