Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సూర్యకాంతం వేయాల్సిన గయ్యాళి పాత్ర మహానటి సావిత్రి వేస్తే..?

July 3, 2024 by M S R

1974 లోకి వచ్చేసాం . ఈ ఆడంబరాలు అనుబంధాలు సినిమా లోకి వద్దాం .

మాదిరెడ్డి సులోచన వ్రాసిన సంసార నౌక అనే నవల ఆధారంగా ప్రముఖ దర్శకులు సి యస్ రావు దర్శకత్వంలో వచ్చింది ఈ సినిమా . నవల బాగున్నా , ఆ నవలలోని కధను సినిమాకరించటం చాలా ముఖ్యం . సి యస్ రావు అనుభవం ఉన్న డైరెక్టర్ అయినా స్క్రీన్ ప్లే బలహీనంగా ఉంటుంది . అయితే మంచి సందేశాన్ని ఇచ్చే సినిమా .

మా తాతలు నేతలు తాగారు , మా మూతుల వాసన చూడండి . మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె . మంచం ఉన్నంత వరకే కాళ్ళు చాపాలి . పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు . అప్పు చేసి పప్పు కూడు . కూర్చుని తింటే కొండలయినా కరుగుతాయి . ఈ సామెతలు , ఈ మంచి పలుకుల సమాహారమే ఈ సినిమా . ఆడంబరాలకు , అట్టహాసాలకు , బడాయిలకు పోయి కుటుంబాలు కుటుంబాలే నాశనం కావడం మనందరికీ తెలిసిందే . మన కుటుంబాలే వాటిల్లో ఉన్నా ఆశ్చర్యం లేదు .

Ads

కృష్ణ ఈ సినిమాలో ఎక్కువ సేపు మధ్య వయస్కుడుగా కనిపిస్తాడు . బాధ్యత కలిగిన తమ్ముడుగా హుందాగా నటించాడు . అతనికి వదినగా సావిత్రి గయ్యాళిగా , తగవులమారిగా నటించింది . యస్ వరలక్ష్మి , సూరేకాంతం వంటి వారు వేయవలసిన పాత్ర ఆమె ఎందుకు నటించిందో ! అప్పటికే ఆమెకు ఈ సినిమా కష్టాలు మొదలయ్యాయిగా !

ఎర్ర నటుడు మాదాల రంగారావు . 1974 లోనే అతను సినిమా రంగంలోకి వచ్చాడు . ఈ సినిమా ముందా లేక చైర్మన్ చలమయ్య ముందా నాకు ఐడియా లేదు . శారద సినిమాతో రావు గోపాలరావు మంచి కేరెక్టర్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నారు . ఈ సినిమాతో ఆయన శకం ప్రారంభమయిందని చెప్పుకోవచ్చు . శారద , ప్రభాకర రెడ్డి , రాజబాబు , రమాప్రభ , కె విజయ , నాగయ్య , కాంతారావు , విజయలలిత ప్రభృతులు నటించారు .

చక్రవర్తి సంగీత దర్శకత్వంలో శ్రావ్యమైన పాటలు ఉన్నాయి . ముఖ్యంగా నీ రూపం నా హృదయంలో నిలిపేనా పాట చాలా బాగుంటుంది . తాతలు ముత్తాతలు నేతులు తాగారని అనే సందేశాత్మక పాట స్కూల్ పిల్లలతో రాజబాబు పాట బాగుంటుంది .

ఏవరేజ్ సినిమా అని గుర్తు . గుర్తుంచుకునే అంత సినిమా కూడా కాదనుకుంటా . అయితే ఓ మంచి సందేశాన్ని అందించే సినిమా అని మాత్రం చెప్పగలను . మా నరసరావుపేటలో ఏ థియేటర్లో చూసానో గుర్తు లేదు . యూట్యూబులో ఉంది . కుటుంబ పెద్దలు తమ పిల్లలకు , కుటుంబ సభ్యులకు కనీసం వాయిదాల పధ్ధతుల్లో అయినా చూపించవలసిన సందేశాత్మక సినిమా . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు…….. By డోగిపర్తి సుబ్రహ్మణ్యం

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఎరుపు లోలాకు కులికెను కులికెను… ఆమె గుర్తుందా మీకు..?!
  • ఆ పాట చరణాల సొగసు చూడతరమా…? వేటూరి మేథోమథనం కథ..!!
  • మళ్లీ ఇజ్జత్ తీసుకున్న పాకిస్థాన్… ఈసారి ఏకంగా దాని ప్రధాని వంతు…
  • నోటి తుత్తర ఎంత ప్రమాదకరమో చెప్పే సినిమా… మధురానగరిలో…
  • దేవనపల్లి కవిత..! టీఆర్ఎస్ కాదు… తెలంగాణ జాగృతి పార్టీయే..!!
  • అందరికీ శకునాలు చెప్పే బల్లి కుడితి తొట్టెలో పడినట్టు…!!
  • ఇరాన్ యుద్ధనీతిని అస్సలు అంచనా వేయలేని ట్రంప్ వైఫల్యం…
  • ఇదే డెస్టినీ అంటే..! కేసీయార్ సార్, ఓసారి ఇది తాపీగా చదవగలరు…!!
  • అమెరికా, ఇజ్రాయిల్ తప్పులో కాలేశాయి..? మొస్సాద్‌కు మొదటిసారి షాక్..!!
  • సర్కారు సకాల స్పందన… రిటైర్డ్ ఉద్యోగులందరికీ భారీ ఊరట

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions