….. Nancharaiah Merugumala….. భారతదేశంలో హిందువులైనా, జైనులైనా వైశ్యులే కష్టపడతారు, సంపద సృష్టిస్తారు! అందుకే అదానీకి
ఫోర్బ్స్ లిస్టులో ఆరో ర్యాంక్
—————///————–///———
ప్రపంచ అగ్రశ్రేణి బిలియనీర్ల జాబితాలోని మొదటి పది మందిలో కొత్త షావుకారు గౌతమ్ అదానీ పేరు ఒకటే ఉందని మొదట వార్త వచ్చింది. ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక మీడియా సంస్థ Forbes రూపొందించిన ఈ విశ్వ కుబేరుల లిస్టులోని పది మందిలో రిలయన్స్ ముకేష్ డీ అంబానీ కూడా ఉన్నాడని మళ్లీ మరో కబురు. అయితే ఈ పది మందిలో నూరు బిలియన్ల డాలర్ల సంపద దాటినోళ్లలో 9 మంది ఉంటే గుజరాతీ జైన వైశ్యుడు అదానీ 6వ స్థానంలోకి ఎగబాకారట. వంద బిలియన్లకు ముకేష్ అంబానీ ఆస్తి విలువ కొద్దిగా తగ్గినా గాని టాప్ టెన్ లో చోటు సంపాదించాడు.
ఈ ఇద్దరు భారత అపర కుబేరులూ గుజరాతీ వైశ్యులు. కులానికి ఒకటేగాని మతాలు వేరు. పాకిస్థాన్ షరీఫ్ కుటుంబం, మన నెహ్రూ ఫామిలీ- రెండూ కులానికి కశ్మీరీ బ్రాహ్మణులేగాని ఇస్లాం, హిందూ ధర్మాలకు చెందుతాయి. అలాగే ఈ అదానీ ఇండియాలోని అతి తక్కువ జనసంఖ్య ఉన్న మతాల్లో ఒకటైన జైన కుటుంబంలో పుట్టాడు. అంబానీ విషయం తెలిసిందే.
గుజరాత్ జునాగఢ్ జిల్లా చోర్వాడ్ (దొంగలూరు అని అర్ధం)లో మూలాలున్న వణిక్ ప్రముఖుడు ధీరూభాయ్ పెద్ద కొడుకనే విషయం తెలిసిందే. ఒకప్పుడు సముద్రపు దొంగలకు అడ్డా అయిన చోర్వాడ్ లో రూట్స్ ఉన్న ముకేష్ అనే హిందూ బనియాను- కడలి రేవులూ, హవాయి అడ్డాలు (ఎయిర్ పోర్టులు) నడుపుకునే వ్యాపారం ద్వారా మైనారిటీ జైన కోమటి గౌతమ్ అదానీ శరవేగంతో దాటిపోవడం గొప్ప పరిణామం. దేశంలోని అన్ని హవాయి అడ్డాలు, పోర్టులు ఈ జైనుడి పరమైతే- దేశంలోని మిగిలిన మైనారిటీ మతస్తులకు భారత రాజ్యాంగంపై నమ్మకం కుదురుతుంది.
Ads
దేశ సంపద మతపరమైన అల్పసంఖ్యాకులదే అనే వాస్తవం బోధపడుతుంది. దేశ ప్రధానిగా ఉండగా డాక్టర్ మన్మోహన్ సింగ్ కూడా ఇదే మాట చెప్పినందుకు విమర్శల పాలయ్యారు 12 ఏళ్ల క్రితం. అదానీ కేసు చూశాక, ముఖ్యంగా ముస్లింలు ఇండియా ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థ కావడానికి ఇరగబడి పన్జేస్తారు. అప్పుడంతా సామరస్యమే కనిపిస్తది.
ఏదేమైనా, ఏ మతానికి చెందినా వైశ్యులు గొప్పోళ్లు. గాంధీ నుంచి అదానీ దాకా దేశ ప్రతిష్ఠకు వారు చక్కటి చిహ్నాలు. శాకాహారులే (జైనులు, హిందూ వైశ్యులు) దేశంలో సంపద పెంచే సామాజిక వర్గాలని మిగిలినవారు ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది- గౌతముడి (అదానీ) ‘అఖండ’ విజయంతో… శ్వేతాంబర జైనులు మాంసాహారం ముట్టరు గాని బీఫ్ ప్లాంట్లు పెట్టి అరబ్బు దేశాలకు ఎగుమతి చేస్తారు. అందుకే-ఏం తింటున్నామనే దానికన్నా ఏమి అమ్మి సంపాదిస్తున్నామనేదే కీలకమని ఆర్థికవేత్తలు చెబుతున్నారు….
Share this Article