Bharadwaja Rangavajhala……… ఆర్ ఆర్ ఆర్ క్లాస్ రూమ్ … నేను దాదాపు 60 ఏళ్లుగా సినిమాలు తీస్తున్నా… ఒక దర్శకుడిగా నా చిత్రాలను ఆదరించిన ప్రేక్షక దేవుళ్లందరికీ ముందుగా నా కృతజ్ఞతలు… నా తర్వాత తరం దర్శకులకు నా అనుభవం ఉపయోగపడాలనే ఉద్దేశ్యంతోనే ఈ ఆర్ ఆర్ ఆర్ క్లాసు రూం యుట్యూబు సిరీస్ ప్రారంభిస్తున్నా ….
మాయదారి రాముడు … నా డైరక్షన్ లో వచ్చిన సూపర్ డూపర్ హిట్ మూవీ అది. ఈ రోజుల ధరల ప్రకారం చూస్తే … ఆ సినిమా ఐదొందల కోట్లు వసూలు చేసినట్టు. ఆ సినిమాలో ఎందుకు మొత్తం హీరోయిన్ తో పొడవాటి డ్రస్సులు వేయించానో చాలా మందికి తెలీదు. ముఖ్యంగా చెయిరేసుకోబోయి చాపేసుకున్నాను శివా శివా పాటలో ఎందుకు పొడవాటి డ్రస్సు వాడారు అని చాలా మంది అడిగారు నన్ను. అంటే వాళ్ల ఉద్దేశ్యం అంత పొడవాటి డ్రస్సులు వేయడం వల్ల హీరోయిన్ని పూర్తిగా చూసే అవకాశం ఉండదు కదా అనే… నేను అర్ధం చేసుకోగలను.
అయితే ఒక దర్శకుడుగా నేను ఏమాలోచించానంటే … ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన గ్రీష్మశ్రీకి శరీరపరంగా కొన్ని ఇబ్బందులున్నాయి. ఒక డైరక్టర్ గా ఉన్నప్పుడు మనం అన్ని విషయాలూ పట్టించుకోవాలి. ముఖ్యంగా కమర్షియల్ సినిమా తీసేటప్పుడు హీరోయిన్ మొత్తం శరీరం మీద దర్శకులుగా మనకో అంచనా ఉండాలి. మాయదారి రాముడు తీసేప్పుడు అప్పటికి కమర్షియల్ గా రెండు మూడు హిట్స్ ఉన్న ఆ అమ్మాయి అయితేనే సినిమాకు హెల్ప్ అవుతుందన్నారు నిర్మాతలు.
Ads
మనం నిర్మాతల మాటను కాదనలేం. అవతల పెద్ద హీరో … హీరోయిన్ విషయంలో పట్టుపడితే డైరక్టర్ నే మార్చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు నేను తెలివిగా ఆలోచించి సినిమా నిర్మాణంలో కొన్ని మెలకువలు పాటించాను. అందులో కొన్ని మీకిప్పుడు వివరిస్తాను.
హీరోయిన్ నడుం కింద నుంచీ చాలా లావు. నడుంపైన భాగమంతా సన్నగానే కనిపిస్తుంది. ఈ విషయం చాలా షార్ప్ గా చూస్తేనే తెలుస్తుంది. అందుకు నేనేం చేశానంటే … లాంగ్ , మిడ్ , రెగ్యులర్ షాట్స్ తీసేప్పుడు గ్రీష్మశ్రీతో పొడవాటి డ్రస్సులు వేయించాను. ఇక బొడ్డుపైన పళ్లు విసిరేప్పుడు , నడుం కింది భాగం కనిపించేలా పాటల్లో స్టెప్పులేసే సమయాల్లోనూ … నిర్మొహమాటంలగా డూపును పెట్టేశాను.
సినిమా చూసేవాళ్లెవరికీ అనుమానం రాదు … కావాలంటే ఓసారి ప్లే చేస్తాను చూడండి … సో, ఒక దర్శకుడుగా మనకి నిర్మాతలు ఏ హీరోని ఏ హీరోయిన్ని అప్పగించినా వాళ్లతో సినిమా తీసి వావ్ అనిపించేయడమే దర్శకుడుగా మనం సాధించే విజయం. అది ఒక దర్శకుడి కనీస బాద్యత.
చూశారు కదా … నిర్మాతలు కాస్టింగ్ పట్టించుకున్న సందర్భాల్లో దర్శకుడు ఎలా వ్యవహరించాలి అనే అంశం చూశారు కదా… వచ్చే ఎపిసోడ్ లో వాన పాటలు తీసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? మెలకువలేమిటి? అనే అంశం మీద మాట్లాడుకుందాం. అంత వరకు సెలవు నమస్తే … ఓ రెండేళ్లుగా మాట్లాడుతున్న మహాదర్శక దార్శనికుడు గారికి క్షమాపణలతో…..
Share this Article