అదితిరావు హైదరీ..! తెలుగు సినీప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేని పేరు… పాపులర్ టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్… హీరో సిద్ధార్థ్‌ను ఆమె వనపర్తి జిల్లాలోని రంగనాథ ఆలయంలో మార్చి 27న ఉదయం రహస్యంగా పెళ్లి చేసుకుందనేది తాజా వార్త… ఎంతోకాలంగా వాళ్లిద్దరూ రిలేషన్ షిప్‌లోనే ఉన్నారు… పెళ్లి పెద్ద విశేషమైన వార్తేమీ కాదు… ఆమెకు ఇది బహుశా రెండో పెళ్లి, సదరు హీరోకు ఎన్నో పెళ్లో లెక్క తెలియదు…
సారు గారి బంధాలు అనంతం, అపరిమితం… ఏదో గుడ్డిగా నమ్మేసింది అదితి… గతంలో చాలామంది నమ్మినట్టే… నమ్మించగలడు… అందులో సిద్ధహస్తుడు… (నమ్మదగిన జీవిత భాగస్వామి కాదు… బోలెడు ఉదాహరణలున్నయ్… మనమూ గతంలో వివరంగా చెప్పుకున్నాం… ఇదీ లింక్…)
Ads
అదితిరావును అభిమానించే ప్రేక్షకులూ ఎక్కువ సంఖ్యలో ఉన్నారు… తెలుగులో కూడా… ఆమె తెలుగమ్మాయి కావడం ఓ కారణం కావచ్చు… సిద్ధార్థ్ ట్రాక్ రికార్డు బాగా లేని కారణంగా ఆమె పెళ్లి చాయిస్‌ను ఎవరూ పెద్దగా ఇష్టపడలేదు… సరే, ఆమె ఇష్టం, ఆమె ఖర్మ అనుకుంటారు… కానీ వనపర్తి జిల్లాలోని ఆ గుడిలో పెళ్లి చేసుకోవాలనే ఆమె చాయిస్‌ను మాత్రం అభినందిస్తున్నారు నెటిజనం… ఎందుకంటే..?
ఆమె తన రూట్స్‌ను గౌరవిస్తోంది గనుక… అదే శ్రీరంగాపురం రంగనాథస్వామి మీద పాత విశ్వాసాన్నే కనబరుస్తున్నది కాబట్టి… ఆమె మొదటి పెళ్లి కూడా అక్కడే జరిగిందట… వోకే, వాళ్ల పెళ్లి వివరాలు బయట తెలిస్తే, జనం రద్దీని కంట్రోల్ చేయలేరు కాబట్టి రహస్యంగా పెళ్లి చేసుకున్నారు, మరీ తమ ముఖ్యులైన సన్నిహితుల సమక్షంలో… ఎక్కడా వార్త లీక్ గాకుండా జాగ్రత్తపడ్డారు… గుడ్…
ఏమిటి ఆమె రూట్స్..? వనపర్తికి ఆమెకూ ఏం సంబంధం అని తెలియనివాళ్లూ ఉంటారు కదా, ఆ వివరాలు ఇవీ…
ఆమె తల్లి విద్యా రావు తండ్రి వనపర్తి చివరి రాజు రామేశ్వర రావు… ఇక అదితి తండ్రి పేరు ఎహసాన్ హైదరీ… ఆయన హైదరాబాద్ స్టేట్ కు ఒకప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న అక్బర్ హైదరీ మనవడు… ఇలా అదితి రావ్ మూలాలు మొత్తం పాత వనపర్తి సంస్థానంలో, అనగా ప్రస్తుత వనపర్తి జిల్లాలోనే ఉన్నయ్…
ఈ గుడితో ఆ ప్రాంత ప్రజలకు బలమైన బాండ్… తెలంగాణ నుంచే కాదు, కర్నాటకలోని గుల్బర్గా, రాయచూర్, సిందూరు ప్రాంతాల నుంచీ భక్తులు వస్తుంటారు… ఆ గుళ్లో పెళ్లి అనేది తెంచుకోవడానికి ఇష్టపడని విశ్వాసం… ఏటా 300- 400 పెళ్లిళ్లు జరుగుతుంటాయి అక్కడ… వనపర్తి, పెద్దగూడెం, రాజానగరం, కొత్తపేట తదితర ప్రాంతాల్లోని గుళ్లన్నింటినీ శ్రీకృష్ణదేవరాయ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ నిర్వహిస్తుంటుంది… ఆర్గనైజ్ చేసేది జె.కృష్ణదేవరావు… ఇవన్నీ రాయలకాలంలో నిర్మితమయ్యాయంటారు…
సాధారణంగా రెండో పెళ్లి గానీ, మూడో పెళ్లి గానీ… సెలబ్రిటీలు ధూంధాంగా పెళ్లి చేసుకుంటూ ఉంటారు కదా… బోలెడు మంది సినిమా ప్రముఖులను పిలిచి అట్టహాసంగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా… కానీ అదితి చాయిస్ మేరకే ఈ జంట తెలంగాణలో ఓ మూలన ఉండే ఓ చిన్న గుడిలో పెళ్లి చేసుకోవడమే ఈ పెళ్లి ఎపిసోడ్‌లోని అసలైన విశేషం… అఫ్‌కోర్స్, తరువాత ముంబైలో ఎలాగూ ఓ రిసెప్షన్ ఏర్పాటు చేస్తారు… ఈమెతోనైనా నాలుగు రోజులు కుదురుగా ఉండవయ్యా సిద్ధార్థుడా… అసలే తమరిది డ్యాష్ డ్యాష్ బుద్ధి..!!
Share this Article