Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అడుసు తొక్కుతున్న అదితి… అనుభవంతోగానీ తత్వం బోధపడదు…

January 27, 2023 by M S R

ఎప్పుడో రాసిన కథనం… అదితిరావు హైదరి హీరో సిద్ధార్థ్‌తో కలిసి తిరుగుతున్న వార్తల నేపథ్యంలో… సదరు హీరోగారి చంచల మనస్తత్వం మీద హైదరిని హెచ్చరించిన హితవు..! నిన్నో మొన్నో శర్వానంద్ నిశ్చితార్థానికి ఆ ఇద్దరూ జంటగా కలిసే వచ్చారు… తమ ప్రేమ, లివ్ ఇన్ ‘సహజీవనం’ నిజమేనని లోకానికి పరోక్షంగా చెప్పేశారు… త్వరలో పెళ్లి అని తాజా వార్తలు… కొందరికి అనుభవంతో గానీ తత్వం బోధపడదు… ఎందుకో… కలకాలం కలిసి ఉండండి అని కొందరి మీద అక్షింతలు చల్లడానికి మనసొప్పదు… సిద్ధార్థ్ గురించి తెలిసిన వాళ్లకు అస్సలే ఇష్టముండదు… ఆ పాత కథనం ఇదుగో… యథాతథంగా…



గొర్రె కసాయినే నమ్మును…. సినిమా ఫీల్డ్‌లో ఉన్న తారలు కూడా అంతేనా..? విశ్వాసరహితమైన, వివాదాస్పద వ్యక్తిగత వ్యవహారశైలి ఉన్న నటుల్నే ఇష్టపడతారు… జతకడతారు… తరువాత బోరుమంటారు… చాలా ఉదాహరణలున్నయ్… అందమైన నటి, రాజకుటుంబీకురాలు అదితిరావు హైదరీ హీరో సిద్ధార్థ్‌ను డేటింగులో ఉందనీ, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నదనీ వార్తలు చదివితే అదే అనిపించింది… ఫీల్డ్‌లో ఉన్న ఆమెకు సిద్ధార్థ్ గురించి తెలియదని అనుకోలేం…

ముంబైలో సిద్ధార్థ్ గురించి ఇండస్ట్రీలో అందరికీ తెలుసు… పైగా గత ఏడాది మహాసముద్రం సినిమాలో కలిసి నటించినప్పటి నుంచే అదితి, సిద్ధార్థ్ నడుమ లవ్ ట్రాక్ స్టార్టయిందనీ, చెట్టపట్టాల్ వేసుకుని తిరుగుతున్నారనీ టాక్… మరి ఇన్నాళ్లుగా సిద్ధార్థ్‌ను అదితి అర్థం చేసుకున్నది ఏమున్నట్టు..? ఒక్కసారి సిద్ధార్థ్ కథలు తవ్వండి, తనెంతటి గ్రంథసాంగుడో తెలుస్తుంది… సమంత- చైతూల పెళ్లి పెటాకులు కాగానే, సమంతను వెక్కిరిస్తూ ట్వీటాడు గుర్తుందా… ఓ శాడిస్టిక్ ఆనందాన్ని కనబరిచాడు కదా… అసలు ఏమిటీ సిద్ధార్థుడి కథ…

Ads

siddharth

ఆమధ్య ఇండియాటుడే సిద్ధార్థ్ ప్రేమాయణాల మీద ఓ పెద్ద కథనాన్నే ప్రచురించింది… ఆకర్షిస్తాడు, కలిసిపోతాడు, ఆనందిస్తాడు, కానీ ఏ బంధాన్నీ కాపాడుకోలేడు, తను కాదు, తన సహచరులే తనని అసహ్యించుకుని వెళ్లిపోతారు… ఇదీ మనకు అర్థమయ్యేది… ఫస్ట్ ఆఫ్ ఆల్… మేఘన… ఢిల్లీ అమ్మాయి… సిద్ధార్థ్‌కు బాల్యస్నేహితురాలు, తరువాత ప్రేమికురాలు… 2003లో పెళ్లి చేసుకున్నారు… 2006 నుంచీ దూరం ఉంటూ, చివరకు 2007లో విడాకులు…

ఆ తరువాత పెళ్లి దాకా వెళ్లనివ్వలేదు ఏ వ్యవహారాన్ని కూడా…! రంగ్‌దేబసంతిలో తనతో నటించిన సోహా అలీ ఖాన్‌తో యవ్వారం తన మొదటి భార్య పసిగట్టింది, అదిలించింది… మారకపోవడంతో చివరకు వదిలేసింది… ముంబైలోని సోహా ఇంట్లో చాన్నాళ్లున్నాడు… ఆమె కూడా ఈ బంధాన్ని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నించింది… సిద్ధార్థ్‌తో అనేక అంశాల్లో అభిప్రాయభేదాలు ముదిరి, ఆమె కూడా వదిలేసింది… తరువాత కొన్నాళ్లకే సిద్ధార్థ్ ట్రాప్‌లో మరొకరు…

aditi

ఆమె పేరు శృతిహాసన్… అప్పట్లో బాలీవుడ్ కెరీర్ స్టార్ట్ చేస్తున్న కాలమది… మొత్తానికి సిద్ధార్థ్, శృతి ఒక్కటయ్యారు… శృతి కలిసింది… అలా కలిపేస్తాడు తను… సహజీవనం కూడా స్టార్ట్ చేశారు… తండ్రి కమల్‌హాసన్ కూడా ఈ టైపే కదా… ఎంకరేజ్ చేశాడు… కానీ ఇదీ నిలవలేదు… ఇక్కడా సిద్ధార్థ్ వైఖరితోనే సమస్య… ఏడాదిన్నర సహజీవనంతో శృతికి అర్థమైపోయింది… సూట్‌కేసు సర్దుకుని బయటికి వచ్చేసింది… ఇది 2011లో… ఇద్దరి నడుమ మాటలు కూడా లేవట ఇప్పుడు…

వెంటనే సమంత దొరికింది సిద్ధార్థ్‌కు… అప్పట్లో జబర్దస్త్ అనే సినిమా చేశారు ఇద్దరూ… అక్కడ పడేశాడు ఆమెను… దాదాపు రెండున్నరేళ్లు బంధం కొనసాగింది… ఇక పెళ్లిచేసుకుందాం అని కూడా అనుకున్నారు… ఇనక్కుల్ ఒరువన్ అనే సినిమాలో సిద్దార్థ్ పక్కన నటించిన దీప సన్నిధితో ఆయన కలిసి తిరుగుతున్నాడనీ, ఈ వుమనైజర్‌ను పెళ్లి చేసుకుంటే నువ్వే కష్టాల పాలవుతావ్ అని ఆమె దోస్తులు హెచ్చరించారు… దీప, సిద్ధార్థ్ బంధం గమనించి, మనస్సు విరిగిపోయి ఇక వదిలేసింది…

aditi

వాడుకోవడం, వదిలేయడం, కలిసిపోవడం, కలహించుకుని కాదనుకోవడం… ఇవన్నీ ఈ గ్లామర్ ప్రపంచంలో చాలా చిన్న విషయాలు… ఎవరూ శుద్ధపూసలు కాదు… కానీ తెలిసీ తెలిసీ అడుసు తొక్కనేల అనేదే ఇక్కడ పాయింట్… అవునూ, అదితి హైదరీ మాటేమిటి..? 21 ఏళ్ల వయస్సప్పుడే ఆమెకు సత్యదీప్ మిశ్రాతో పెళ్లయింది… పెళ్లి నాటికి తను కూడా నటుడే… తరువాత విడిపోయారు…

2007లో పెళ్లయితే 2013 వరకూ రహస్యంగానే ఉంచారు తమ బంధాన్ని… తరువాత కొన్నాళ్లు ఫర్హాన్ అఖ్తర్‌తో ప్రేమ వ్యవహారం నడిచింది కానీ అది స్థిరపడలేదు… సో, ఆమె ఏమీ తెలియని అమాయకప్పిల్ల ఏమీ కాదు… 35 ఏళ్లు… పెళ్లిళ్లు, బ్రేకప్పులు, లవ్వుల యవ్వారాల్నీ తెలిసిందే… మరి అలాంటిది ఈ సిద్ధార్థుడి జాబితాలో తాజా బకరా కావడం ఏమిటో…!!

aditi

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తేడా లేని పాటలు… నటిగా అదే జయప్రద… బాపు ఫెయిల్… దాసరి హిట్…
  • ఆ పదం వినగానే యూనిట్ మొత్తం కకావికలై పరుగులు తీసింది…
  • ఆయన ఆ జడ్జిని చూపిస్తే… ఈయన పోటీగా మరో జడ్జిని ప్రవేశపెట్టాడు…
  • మరో జలియన్‌ వాలాబాగ్… పాకిస్థాన్ ఆర్మీ ఘాతుకం… ఢాకా గుడి కథ..!!
  • ప్రపంచ సుందరి కిరీటపు ధగధగల వెనుక… కన్నీళ్లు, కష్టాలు…
  • ‘‘అబ్బో, ఆమె చాలా కాస్ట్‌లీ అట, ఎక్కువ డిమాండ్ చేస్తుందంటున్నారు…’’
  • ఫిక్సేనా..? ‘ఈసాల కప్ నమ్‌దే’ నిజమేనా..? ఈ జోస్యం ఫలిస్తుందా..?
  • ఈమె సోనియాని మించిన హక్కుదారు..!? అడుగడుగునా ఓవరాక్షన్..!!
  • రియల్ సూపర్‌స్టార్ కృష్ణను సరిగ్గా ఆవిష్కరించిన కథనం ఇది..!!
  • మొక్కు కోడెల ఉసురు… కలుక్కుమనిపించే మరణాల వార్తలు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions