మొన్నామధ్య బాలయ్య అన్స్టాపబుల్ షోలో హీరో అడివి శేషుకు ఓ ప్రశ్న ఎదురైంది… ఇంకా పెళ్లెందుకు చేసుకోవడం లేదు అని… తను సరదాగా ఆ ప్రశ్నను శర్వానంద్ మీదకు మళ్లించి, నాకన్నా సీనియర్లున్నారుగా ఇంకా అని బదులిచ్చాడు… శర్వానంద్ ‘నేను ప్రభాస్ పేరు చెప్పుకుని తప్పించుకుంటున్నానులే, నువ్వు నన్ను చూపించడం దేనికి’ అని తనూ సరదాగా సమాధానం ఇచ్చాడు… అయితే ఇక్కడ ఓ అసలైన ప్రశ్న…
చాన్నాళ్లుగా యార్లగడ్డ సుప్రియ (నాగార్జున మేనకోడలు)తో ప్రేమ వ్యవహారం గట్టిగానే కొనసాగుతున్నా సరే… ఇప్పుడు తాజాగా మరోసారి బహిరంగం అయిపోయినా సరే, అధికారికం చేసేస్తే సరిపోయేదానికి శేషు గానీ, సుప్రియ గానీ ఎందుకు వెనుకాడుతున్నారు..? వాళ్ల పెళ్లికి… పోనీ, సహజీవనానికి అడ్డుపడుతున్న శక్తులేవి..? ఎందుకు..? ఇవీ అసలు ప్రశ్నలు…
ఇప్పుడెందుకు చర్చ మొదలైందంటే..? నిన్న అక్కినేని కుటుంబానికి చెందిన వారసులు సుశాంత్, సుమంత్, అఖిల్, సుప్రియ తదితరులు క్రిస్మస్ పార్టీ చేసుకున్నారు… ఓ ఫోటో దిగారు… వాళ్లలో ఒకరు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు… అందులో అవుట్ సైడర్ అడివి శేషు మాత్రమే… ఐనా అవుట్ సైడర్ అని అక్కినేని కుటుంబమే అనుకోవడం లేదు… సైలెంటుగా శేషు- సుప్రియ బంధాన్ని ఆ కుటుంబం ఎప్పుడో ఆమోదించినట్టుగా ఉంది… శేషు కూడా ఆ కుటుంబంలో ఆల్రెడీ చేరిపోయినట్టుగా ఉంది ఫోటో… గుడ్…
Ads
నిజానికి శేషు, సుప్రియ బంధం నాలుగేళ్లుగా బహిరంగమే… కానీ ఎప్పటికప్పుడు ఖండించరు, కరెక్టే అనరు… ఇప్పుడు పెళ్లి మీద ఆలోచన లేదు అని శేషు తప్పించుకుంటాడు… సుప్రియ నోరే విప్పదు… ఆమధ్య చైతూ-సమంత విడిపోవడానికి సుప్రియే కారణమంటూ కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి గానీ… అవి కరెక్టు కాదు… సమంతతో పడినా పడకపోయినా సుప్రియ చైతూ నిర్ణయాన్ని వ్యతిరేకించదు, పైగా ఆ కుటుంబంలో ఆమె డెసిషన్ మేకర్ కూడా కాదు…
సరే, సెలబ్రిటీల కుటుంబాలు, జీవితాలు అన్నాక ఏవో గాసిప్స్, రూమర్స్ వస్తూనే ఉంటాయి… సుప్రియ జీవితానికి వస్తే… దగ్గుబాటి, అక్కినేని కుటుంబాలకు చెందిన వారసత్వం… తను ఎప్పుడూ ఏ వివాదాల్లోకి రాదు… యాక్టర్ చరణ్రెడ్డిని పెళ్లిచేసుకుంది, కొన్నాళ్లకే పడలేదు, విడిపోయారు, అప్పట్నుంచీ సింగిల్… స్టూడియో వ్యవహారాలను చూసుకుంటూ ఉంటుంది… బిజినెస్ వుమన్…
శేషు కూడా అంతే… చాన్నాళ్ల క్రితం తనకూ ఏదో ట్రాజెడీ లవ్ స్టోరీ… ఆ తరువాతే పెళ్లికి దూరంగా ఉంటున్నాడు… తల్లిదండ్రుల నుంచి పెళ్లికి సంబంధించిన ప్రెజర్ ఉందని మాత్రం చెబుతాడు… సుప్రియ, శేషు బంధం నిజానికి రహస్యమేమీ కాదు… కానీ ఎందుకు అధికారికం చేయడం లేదు..? అదీ మిస్టరీ… సుప్రియ అన్నపూర్ణ స్టూడియోస్ తరఫున శేషు హీరోగా ఓ పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్నారు… ఆ స్టూడియోస్ నుంచి పాన్ ఇండియా సినిమా ఇప్పుడే తొలిసారి… ఇప్పుడు శేషును ఈ క్రిస్మస్ ఫోటో గురించి అడగండి… అబ్బే, నేను ఫలానా సినిమా మీద సీరియస్ వర్క్ చేసుకుంటున్నాను, పెళ్లి మీద ఆలోచనలు లేవు ఇప్పుడప్పుడే అంటాడు…!!
Share this Article