మీకు డిపెప్ కుంభకోణం గుర్తుందా..? అబ్బే, అస్సలు గుర్తుకురావడం లేదు అంటారా..? సరే, వైఎస్ హయాంలో… నేదురుమల్లి రాజ్యలక్ష్మి విద్యా శాఖ చూస్తున్న తరుణంలో…!
సర్వశిక్షాఅభియాన్ అంటేనే కుంభకోణాలు… ఏ రాష్ట్రంలోనైనా అంతే… అప్పట్లో చంద్రమౌళి అనే ఆఫీసర్ ఉండేవాడు… ఫాఫం, రాజ్యలక్ష్మినే బుక్ చేసేలా అక్రమాలకు పాల్పడ్డాడు… ఇప్పుడూ అదే సర్వశిక్షా అభియాన్ ఉంది… అవునండీ, జగన్ కాలంలోనూ ఉంది…
అసలే జగన్ కదా… తన హయాంలో ఒకరికి 100 కోట్లు దోచిపెట్టే పన్నాగం అంటూ ఈనాడు ఓ వార్త రాసింది అప్పట్లో… సర్వశిక్షా అభియాన్ కదా, ఎవడికి ఎంత దొరికితే అంత… అడ్డమైన, ఓ దిక్కుమాలిన కేంద్ర పథకం… ఢిల్లీలో ఉండేవాడికి ఫీల్డులో ఏం జరుగుతుందో తెలియదు… ఎవడికి దక్కాల్సింది వాడు చూసుకుంటాడు… అరె, మోడీ కదా, ఖానా నహీ, ఖావుంగా నహీ అంటారా..? పర్లేదు, చెప్పుకోవడానికి ఏముంది లెండి…?
Ads
స్కిల్ డెవలప్‌మెంట్ అనేది అది పెద్ద స్కాం… మోడీకి అర్థమైతే తను రాజకీయాల్లోనే ఉండడు, సన్యాసం తీసుకుని అర్జెంటుగా హిమాలయాలకు వెళ్లిపోతాడు… సరే, అదే మోడీకి ప్రస్తుత బద్ధ దోస్త్… గతం మరిచిపొండి, నాలుగు రోజులకు ఎలా ఉంటాడో కూడా తెలియదు… అదే సర్వశిక్షా అభియాన్, ఇతర విద్యా పథకాల్లో చంద్రబాబు చేతివాటం కనబడుతోంది…
ఇది ఈనాడులోనే కనిపించిన వార్త… సంక్షిప్తంగా ఏమిటంటే..? సెల్‌కాన్ అనే కంపెనీ 2000 యూనిట్లు సప్లయ్ చేయాలి, తను 779 సరఫరా చేశాడు, అంతకే డబ్బు రిలీజ్ చేయాలని హైకోర్టు దాకా వ్యాజ్యం చేరింది… మిగతా 1229 యూనిట్లకు కలిపి సొమ్ము చెల్లించాలని ఆర్బిట్రేటర్‌ను ఆశ్రయించారట… సరే, పెనాల్టీలు, రూల్స్ ఉల్లంఘనలు వదిలేస్తే… రఫ్‌గా చెప్పుకోవాలంటే… మొత్తం సొమ్ము చెల్లించడానికి జగన్ ప్రభుత్వంలో ముఖ్యులు చక్రాలు తిప్పారు… ఎవరి స్వార్థం వాళ్లది… కోర్టులు గీర్టులు జాన్తా నై…
పేరుకు అడ్వాన్స్‌డ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ స్కీం… చాలా అడ్వాన్స్‌డ్ స్కామ్స్…ఈలోపు జనం ఛీకొట్టారు… జగన్ దిగిపోయాడు… చంద్రబాబు ఎక్కాడు… సదరు వ్యాపారి లోకేష్ పంచన చేరాడు… విచిత్రం ఏమిటంటే..? అప్పటిదాకా జగన్ ప్రభుత్వ ముఖ్యులకు అత్యంత సన్నిహితుడిగా కనిపించిన సదరు సెల్‌కానుడు చంద్రబాబుకూ ఆత్మీయుడిగా కనిపించసాగాడు… అంతేనండీ, అధికార పార్టీ, అవసరాలు, ప్రభుత్వం, అధికారాలు, డబ్బులు … ఎన్ని లెక్కలుంటాయని..!!
ఐదేళ్లుగా అసలే ఆకలితో ఉన్న వ్యవహారమాయె… సదరు వ్యాపారి హఠాత్తుగా చంద్రబాబు క్యాంపులోకి చేరిపోయి, వాళ్లను హత్తుకున్నాడట… ఇంకేముంది..? సేమ్, జగన్ ప్రభుత్వంలోలాగే… ఆ డబ్బు రిలీజ్ చేయడానికి ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వ ముఖ్యలు రంగం సిద్ధం చేశారట… అదేమంటే..? మనవాడే కదా అంటున్నారట… మనవాడే అంటే..? మనతో ఇష్యూస్ డీల్ చేసేవాడా..? మన సామాజికవర్గమా..? ఏమిటి..? సో, ఏతావాతా అర్థమయ్యేది ఏమిటంటే..? అధికారంలో ఉన్నవాడికి ‘‘అక్కరకు వచ్చేవాడే మనవాడు..’’ అంతే… నో కులం, నో మతం, నో ప్రాంతం… జాన్తా నై…
జగన్ పోయాడు, చంద్రబాబు వచ్చాడు, ఏదో తేడా ఉంటుంది అనుకోవడమే ఒక భ్రమ… మరి అప్పట్లో వార్త రాసిన ఈనాడుకు ఇప్పటి పరిణామాలు కనిపిస్తాయా..? లేదు, కనిపించవు… మరిప్పుడు చంద్రబాబు అధికారం కదా… పోనీ, సాక్షికి కనిపిస్తాయా..? నెవ్వర్, అప్పట్లో పెంచి పోషించింది జగన్ కదా… అసలు ఈ 100 కోట్లు అనేది నథింగ్… జుజుబీ… సదరు వ్యాపారి కథలు చాలా ఉన్నాయి… చెప్పుకుందామా..? సరే…!! ఎటొచ్చీ చెప్పేదేమిటంటే…? సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు ఎవరికీ ఏమీ కనిపించవు… ధనమూలం మిదం జగత్..!! ఎవరూ శుద్దపూసలు కాదు..!!!
Share this Article