అప్పట్లో… అంటే దాదాపు 30 ఏళ్ల క్రితం ఓ సినిమా వచ్చింది… అర్జున్, మధుబాల హీరోహీరోయిన్లు… పేరు జెంటిల్‌మన్… అప్పట్లో బాగా హిట్టయ్యింది సినిమా… ఈ సినిమా పేరు వినగానే గుర్తొచ్చేది ప్రభుదేవా, గౌతమి సాంగ్ ‘‘చికుబుకు చికుబుకు రైలే’’… ఎవరి నోట విన్నా ఆ పాటే అప్పట్లో… అంత హిట్… ఇదోరకం ఐటం సాంగ్… అంటే సినిమా కథకు సంబంధం ఉండదు…
సినిమా పేరు వింటే గుర్తొచ్చే మరో పేరు శుభశ్రీ… ఆమె అల్లరిచిల్లర ఆటలు భలే నవ్వు పుట్టిస్తయ్… ఆటపట్టిస్తయ్… హీరో మీద ప్రేమను పెంచుకుంటుంది మొదట్లో… ఓ పాట కూడా ఉందామెకు… నటి మాలాశ్రీ సొంత చెల్లె ఈమె… కెరీర్‌లో గొప్పగా పేరు తెచ్చిపెట్టిన పాత్రలు, సినిమాలు పెద్దగా ఏమీ కనిపించవు… సొంత భాష తమిళంకన్నా తెలుగులోనే చాలా సినిమాలు చేసింది…
Ads
1997 ప్రాంతంలో పెళ్లి చేసుకుని గుడ్ బై కొట్టేసింది… ఇప్పుడు మళ్లీ ఎందుకు గుర్తొచ్చిందీ అంటే… ఆలీతో సరదాగా షోకు గెస్టుగా వచ్చింది… పాత తారల్ని మళ్లీ తెర మీదకు తీసుకొచ్చి, ముచ్చట్లు పెట్టే ఈ షోకు ఎందుకో గానీ రేటింగ్స్ దారుణంగా పడిపోతున్నయ్… కానీ ఆసక్తిగా చూసే ఓ సెక్షన్ ప్రేక్షకులు ఉండనే ఉన్నారు… మరీ గతవారం బార్క్ రేటింగుల్లో ఈ షోకు దక్కిన టీఆర్పీలు ఒకటిలోపు… నిజమే, ఒకటిలోపు… దయనీయమైన రేటింగ్స్…
అస్సలు గుర్తుపట్టేలా లేదు… అఫ్ కోర్స్, అప్పుడెప్పుడో యంగ్ ఏజ్‌లో చేసిన జెంటిల్‌మన్ సినిమా… ఇప్పుడు 46 ఏళ్లు… (ఆలీతో సరదాగా మేకప్ టీం పెద్ద దరిద్రం… గతంలోనూ చెప్పుకున్నాం కదా… ఇప్పుడు శుభశ్రీ మొహానికీ అదే దరిద్రం పూశారు… ఫోటో చూడండి…) సోదరి మాలాశ్రీతో పోలిస్తే ఈమె కెరీర్ కొన్నేళ్లే సాగింది, ఆగింది… పెద్ద సీరియస్ కెరీర్ కూడా కాదు… పేరుకు పెదరాయుడు, ముత్తు సినిమాలు కూడా చేసినా సరే, అందరికీ ఆ జెంటిల్‌మన్ పాత్రే గుర్తుంటుంది…
ఇలా కనుమరుగైన పాత తారల్ని పిలిచి పాత సంగతులన్నీ చెప్పిస్తుంటే బాగానే ఉంటుంది… కానీ ఎందుకో ఆలీతో సరదాగా షోలో ఆ పాత చమక్కులు లోపిస్తున్నయ్… అందుకేనేమో ఈ రేటింగుల్లో దారుణమైన ఫాల్… ఈ సరదా ముచ్చట్లలో ఎక్కువ ఆలీ సొంత జ్ఞాపకాలు దొర్లడం కూడా ఈ ఫాల్‌కు కారణం కావచ్చు… గెస్టు జీవితం ఎలా సాగుతుందో చెప్పించగలగాలి తప్ప నీ సొంత సోది దేనికి ఆలీ…? కాకపోతే ఈసారి ఎపిసోడ్‌లో ఏడుపు సీన్ లేనట్టుంది… అది రిలీఫ్… కావాలని గెస్టులతో కన్నీళ్లు పెట్టించే పైత్యానికి తెరవేసినట్టున్నాడు… గుడ్…!!
Share this Article