ఇండియాకు ఐటీని తెచ్చినవాడు… మన ఐటీకి ఆద్యుడు… కంప్యూటర్ కనిపెట్టినవాడు… ఐటీ పితామహుడు... వంటి విశేషణాలతో చంద్రబాబును కీర్తిస్తూ సాగే డప్పులు బోలెడు చదవబడ్డాం… బడుతున్నాం ఇంకా…! తనకు అంత సీన్ లేదని కూడా మనం నిజాలు చెప్పుకున్నాం… సరే, అదంతా వేరే సంగతి గానీ ఓ ప్రశ్న… కంప్యూటర్‌ను కనిపెట్టిన పితామహుడు చంద్రబాబుకు కంప్యూటర్ ఆపరేట్ చేయడం తెలుసా..? ఎవరికైనా సమాధానం తెలుసా..?
భలేవారే… రాకెట్ కనిపెట్టినవాడు ఆ రాకెట్‌లో అంతరిక్షానికి వెళ్లి రావాలనేముంది అంటారా..? సరే, ఈసారికి అలా కానివ్వండి… కానీ చంద్రబాబు అరెస్టు తరువాత ఈ ఐటీ పితామహుడు అనే ప్రచారం మరింత జోరందుకుంది కదా… నిజానికి మన దేశంలో ఐటీకి కొత్త దారులు పరిచిన పీవీ స్వయంగా కంప్యూటర్ భాషను ఎలా నేర్చుకున్నారో తెలుసా మీకు..? ఓసారి చదువుదాం… మనం గతంలో (రెండున్నరేళ్ల క్రితం) చెప్పుకున్నదే… ఇప్పుడు ఓసారి మననం చేసుకోవల్సి వస్తోంది… అనివార్యంగా… ఆ పాత కథనం ఇదుగో… ఇదీ… పీవీకి భారత రత్న ప్రకటించిన సందర్భంగా…
అప్పుడెప్పుడో నాలుగు దశాబ్దాల క్రితం…. అంటే ఎయిటీస్‌లో మాటన్నమాట… రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నాడప్పుడు… ఆయన మంత్రివర్గంలో పీవీ నరసింహారావు కూడా ఓ మంత్రి… తనవి కీలకమైన శాఖలే… తరువాత కాలంలో ఆయనంటే అదే రాజీవ్ భార్య సోనియాకు నచ్చలేదు, అమానవీయంగా తొక్కేసింది, చివరకు ఆయన శవం మీద కూడా కక్ష కనబర్చింది… అది వేరే కథ…
Ads
తిట్టకండి, ఆమె తెలంగాణ ప్రదాత… అయితే రాజీవ్ గాంధీ టెక్నాలజీకి గేట్లు తెరిచాడు, దేశాన్ని కొత్త సాంకేతిక జ్ఞానం వైపు తీసుకుపోయాడు,.. టెక్నాలజీ మీద ఆయన సలహాదారులు ఎవరో గానీ ఆయన్ని సరైన దారిలో తీసుకెళ్లారు… ఓరోజు ఓ ఉన్నత స్థాయి సమావేశంలో… రాజీవ్ మాట్లాడుతూ…. ‘‘పర్సనల్ కంప్యూటర్లు వచ్చేస్తున్నయ్… అఫ్ కోర్స్, వయస్సు మళ్లిన వాళ్లకు అందిపుచ్చుకోవడం కష్టమే, కానీ రాబోయే కాలం మాత్రం వాటిదే’’ అని ఏదేదో చెప్పేశాడు… కట్ చేసేయండి ఇక్కడ…
అదే మంత్రివర్గంలోని సీనియర్లలో పీవీ అనే ఓ నిత్యయవ్వనుడు ఉన్నాడని మరిచిపోయాడు… ఆయనొక మానవాతీతుడు… ‘‘మంత్రివర్గంలో మరీ వయస్సెక్కువ ఉన్నది నేనే కదా… ఇదేదో నన్నే ఉద్దేశించి అన్నట్టుంది…’’ అనుకున్నాడు… చిన్నబుచ్చుకోలేదు… పాజిటివ్‌గా తీసుకున్నాడు… మనిషి ఓ యోగి అనేది మనకు తెలుసు కదా…
సరే, ఓ సవాల్‌గా తీసుకుందాం అనుకున్నాడు… అసలే పే-ద్ద గట్టి బుర్ర… అందులోనూ రాజీపడని బుర్ర… ఇప్పటిలాగా ఓటి బుర్రలు కాదు కదా… అసలు ఈ కంప్యూటర్ అనేది అంతటి క్లిష్టమైన సబ్జెక్టా, సరే, దీని సంగతీ చూద్దాం అనుకుని… అదే వారంలో తన సొంత ఖర్చులతో ఓ పర్సనల్ కంప్యూటర్ అమెరికా నుంచి తెప్పించుకున్నాడు… మాన్యువల్స్ చదివేశాడు, బుర్రలోకి ఎక్కేసినయ్… పెద్దగా ఎవరి సాయమూ అక్కరకు రాలేదు… (వినయ్ సీతాపతి రాసిన హాఫ్ లయన్ (తెలుగులో నరసింహమా, అరసింహమా) పుస్తకంలో ఇంకా చాలా వివరాలున్నయ్… పేజీ 71 మరీ ప్రత్యేకించి…)
ఇక కొన్ని రోజులపాటు తన రెగ్యులర్ పనిని సాయంత్రానికల్లా ముగించుకోవడం… ఇంటికి చేరడం… మిగతా రోజంతా ఆ కంప్యూటర్ మీద కూర్చుని, దాని పనిపట్టడం… అసలు పర్సనల్ కంప్యూటర్ అనగానేమి అనే పాయింట్ దగ్గర్నుంచి, దాని భాష ఏమిటో తెలుసుకునేదాకా… మెల్లిమెల్లిగా దానిపై పట్టు ఎంత వచ్చిందంటే… మూడు విభిన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పట్టు దొరికించుకున్నాడు…
అంతేకాదు, తనకంటూ ఓ సొంత లాంగ్వేజీ క్రియేట్ చేసుకున్నాడు… దాంతో అక్షరాలా ఆడుకోవడం స్టార్ట్ చేశాడు… ఇతర మంత్రులు ఈర్ష్యపడేవాళ్లు… ఎవరో గుర్తించాలని, ఎవరో సర్టిఫికెట్ ఇవ్వాలని కాదు….. మనిషి కనిపెట్టిన ఓ సాంకేతిక పరికరం అది… అదేమైనా బ్రహ్మపదార్థమా..? అనుకున్నాడు… పూర్తి పట్టు సాధించాడు…
నిజానికి ఆ కుటుంబ పార్టీలో గనుక ఉండకుండా ఉంటే పీవీ ఎక్కడో ఉండేవాడు… సోనియా వంటి లీడర్ నికృష్టదృష్టి పడకుండా ఉంటే ఎక్కడికో వెళ్లేవాడు… కాదు, దేశాన్ని ఇంకా వేగంగా ముందుకు తీసుకెళ్లేవాడు… ఒక లాల్ బహద్దూర్ శాస్త్రి, ఒక వాజపేయి, ఒక పీవీ…. ఇంకెవ్వరూ కనిపించడం లేదు ఆ తెర మీద… ఈరోజుకూ..!!
Share this Article