సాక్షాత్తూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను కలిసి… ‘‘మై డియర్ రాధా, దయచేసి నన్ను వదిలెయ్, రాష్ట్రపతిగా చాన్స్ ఇవ్వనప్పుడే నా మనస్సు విరిగిపోయింది… మళ్లీ ఉపరాష్ట్రపతి పదవికి పోటీ నాకెందుకు చెప్పు..? ఏదో ఆ స్వర్ణభారతి ట్రస్టు పనులు చూసుకుంటూ, చేసుకుంటూ శేషజీవితం గడిపేస్తా… కాస్త ఈ క్యాంపెయిన్ ఆపుతావా..?’’ అని కోరినా సరే… నో, నో, ఒక తెలుగు వెలుగు సంతకానికి గుర్తింపు ఇవ్వకపోతే ఎలా సార్..? మీరు వద్దన్నా సరే, మా పోరాటం ఆపబోం అంటాడేమో ఆర్కే…
మాస్ట్ హెడ్ పక్కనే మళ్లీ ఓ బాక్సు కట్టి, వార్త కొట్టాడు… ఉపరాష్ట్రపతిగా మళ్లీ వెంకయ్య అని రాసేశాడు… ఆ వార్తకు మళ్లీ ఓ క్రెడిబులిటీ కావాలి కదా, దానికోసం రేసులో తెలంగాణ గవర్నర్ తమిళిసై కూడా ఉందని సన్నాయి నొక్కులు… ఇదే వార్త రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికకు ముందు రాశారు… రాష్ట్రపతి అభ్యర్థి ప్రకటనకు ముందు వెంకయ్యనాయుడిని కలిసి కూడా, అభ్యర్థి ఎవరో చెప్పలేదు బీజేపీ ముఖ్యనాయకులు… దాన్ని కూడా తప్పుపడుతూ, చూశారా, మోడీ ఎంత దుర్మార్గుడో అన్నట్టుగా ఇంకో వార్త రాశారు… మళ్లీ ఇప్పుడిక ఉపరాష్ట్రపతి పదవి క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు…
Ads
అసలు ఉపరాష్ట్రపతి పదవితో వచ్చేదేమిటి..? అనే కనీస సోయి కూడా లేదు ఈ పత్రికకు… దీనివెనుక ఉన్న స్వయంప్రకటిత మేధావులకు… వెంకయ్యనాయుడిని ఆల్‌రెడీ మార్గదర్శకమండలికి పంపించడానికి మోడీ అండ్ గ్యాంగ్ నిర్ణయం ఎప్పుడో తీసుకుంది… ఆయన ఓసీ, పైగా దక్షిణాది… ఆల్‌రెడీ ఓసారి పదవి చేపట్టాడు… పైగా ద్రౌపది ముర్ము తూర్పు భారతానికి చెందిన ఆదివాసీ మహిళ… ఇప్పటికిప్పుడు బీజేపీ పొలిటికల్ స్ట్రాటజీలో వెంకయ్యనాయుడి పేరు ఫిట్ కాదు…
సౌత్ సౌత్ అంటున్నారు… ఆల్రెడీ నాలుగు రాజ్యసభ సభ్యత్వాలు ఇచ్చేశారు… బస్…
ఒడిశా దిగువనే ఏపీ… ఉపరాష్ట్రపతి పదవి ఎంపికకు కూడా బీజేపీకి కొన్ని స్ట్రాటజీలు ఉంటయ్… ఆల్‌రెడీ ఓ ఆదివాసీ మహిళకు ఇచ్చారు కాబట్టి, ఒక మైనారిటీ అభ్యర్థి వ్యూహాత్మకంగా బెటర్… అది కేరళ గవర్నరా..? మాజీ కేంద్ర మంత్రి నక్వీయా..? కశ్మీర్ నేత గులాం నబీ ఆజాదా..? అది వేరే సంగతి… లేదంటే ఓ పంజాబ్ సిక్కు… అది అమరీందరే కావచ్చు, ఇంకెవరైనా కావొచ్చు… లేదంటే పక్కా ఈశాన్య రాష్ట్రాల నుంచి…! పార్టీ జాతీయ వాదానికి ప్రతీకగా ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక ఉంటుంది…
అంతేతప్ప… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చెప్పాడు, యెల్లో బీజేపీ సత్యకుమార్ చెప్పాడు అని అభ్యర్థిత్వాల ఎంపిక జరగదు… ప్రత్యేక ద్రవిడనాడు ఉద్యమం చేస్తాం, పోరాటం చేస్తాం వంటి మాటలు, ఎచ్చులు, బీరాలు గట్రా గత ఎన్నికల ముందు చంద్రబాబు వర్సెస్ మోడీ ఎపిసోడ్‌లో బోలెడు చూశాం… చివరకు ఏమైంది..? బాబ్బాబు, ఓసారి అపాయింట్‌మెంట్ ఇవ్వు బాసూ అని చంద్రబాబు దేబిరించాల్సిన దురవస్థ ఇప్పుడు… సో, రాధాకృష్ణ క్యాంపెయిన్ స్టార్ట్ చేయగానే భయపడిపోయి, వెంకయ్యకూ జై అన్నట్టుగా ఉండదు బీజేపీ స్ట్రాటజీ… అంతటి అద్వానీనే అటక మీదకు ఎక్కించిన బ్యాచ్ మోడీషా… వెంకయ్య అంటే గురుభక్తి, భయం ఉంటుందనుకోవడమే పెద్ద విచిత్రం…
వోెకే, నక్వీకి ఆర్ఎస్ఎస్ నో అనవచ్చుగాక… తమిళనాడుకు చెందిన తెలంగాణ గవర్నర్‌కు కూడా చాన్సెస్ తక్కువే… ఆల్‌రెడీ రాష్ట్రపతిగా ఓ మహిళకు చాన్స్ ఇచ్చారు… ఇక ఉపరాష్ట్రపతిగా కూడా ఇంకో మహిళకు చాన్స్ అనేది స్ట్రాటజిక్‌గా కష్టం… మరి ఈ క్యాంపెయిన్ ఎందుకు అంటారా..? ఏదో పొద్దుపోక… వెంకయ్యకు విధేయత… అంతకుమించి ఏమీ లేదు…! పిచ్చి పాఠకులు…!! అవునూ, మీ పవన్ కల్యాణ్‌తో ఓ మాట అనిపించలేకపోయారా..? వెంకయ్యను ఎంపిక చేయకపోతే మోడీ తాటతీస్తా అని…! తాడోపేడో తేలిపోయేది…!!
Share this Article