రాజా అనే కేరక్టర్ గుర్తుందా..? వేల కోట్ల 2జీ స్కాంలో ప్రధాన నిందితుడు… అప్పట్లో టెలికాం మంత్రి… కరుణానిధి బిడ్డ కనిమొళి కూడా ఈ స్కాంలో నిందితురాలే… జైలులో కూడా ఉన్నారు కొన్నాళ్లు… ఢిల్లీ హైకోర్టు పరిధిలో ఉంది కేసు ఇప్పటికీ… బీజేపీకి పంజాబ్ రాజకీయాలు చేతకాక ఖలిస్థానీవాదం మళ్లీ బలం పుంజుకుంటోంది కదా… డీఎంకే నేతలకు కూడా ఆ ప్రత్యేక దేశవిభజన స్పూర్తి కలుగుతూ ఉన్నట్టుంది… అందుకే మళ్లీ పురుగు మెసులుతోంది… ద్రవిడనాడు మాటలు మొదలయ్యాయి మళ్లీ… ఆ రాజా అనబడే కేరక్టర్ ఈ ద్రవిడనాడు బెదిరింపుల్ని బహిరంగంగానే చేస్తున్నాడు…
మోడీ ఫాఫం శశికళ వ్యవస్థను దెబ్బతీసి, ఆమె కాళ్లూకీళ్లూ సాఫ్ చేసి, మళ్లీ తిరగకుండా చేశాడు… కానీ డీఎంకే పట్ల ఎందుకో సాఫ్ట్ కార్నర్ ఉంది… అదేనా అలుసు..? ఏమో, మోడీకే తెలుసు..! (ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఆంధ్రా మేధావుల సంఘానికి ఇంట్రస్టింగు వార్త… వెంకయ్యకు మళ్లీ చాన్స్ ఇవ్వకపోతే సౌతిండియా ప్రత్యేకదేశం అని ఈమధ్య ‘‘అరుస్తున్నారు కదా’’..) ఇప్పుడు బీజేపీ సపోర్ట్ ఉన్న అన్నాడీఎంకే దారుణంగా బలహీనపడిపోయింది… నాయకత్వ సమస్య…
ఇంకోవైపు స్టాలిన్ బలోపేతమైపోయాడు… అందుకే ఆ నోళ్లు మళ్లీ లేస్తున్నట్టున్నయ్… మొన్న నమక్కల్‌లో ‘మథియిల్ కూటచ్చి, మానిలాథిల్ సూయచ్చి’ పేరిట స్థానిక సంస్థల ప్రతినిధులతో భేటీ వేశాడు టూజీస్కామర్ రాజా… (రఫ్‌గా దాని అర్థమేంటంటే..? కేంద్రంలో సమాఖ్య స్పూర్తి- రాష్ట్రాలకు స్వయంప్రతిపత్తి)… ఆ భేటీలో తనేమంటాడంటే..?
Ads
‘‘పాకిస్థాన్ ఎలా విడిపోయిందో తెలుసా..? బెంగాలీ మాత్రమే తెలిసిన తూర్పు పాకిస్థాన్ మీద ఉర్దూను రుద్దే ప్రయత్నం జరిగింది… అది అంతిమంగా ఆ దేశమే విడిపోయేందుకు కారణమైంది… ఇప్పుడు అమిత్ షా కూడా హిందీ భాష విషయంలో అలాగే మాట్లాడుతున్నాడు… ఈ దేశ ఐక్యత కావాలంటే హిందీ నేర్చుకోవాలంటున్నాడు… అసలు దేశంలో రాష్ట్రాలకు చిన్న చిన్న హక్కులు కూడా లేకుండా చేశారు… ప్రధాన అధికారాలన్నీ కేంద్రం చేతుల్లోనే ఉన్నాయి (కేసీయార్ ఈమధ్య చేస్తున్న విమర్శ కూడా ఇదే)…
ఓసారి తంజావూరు గుడి దగ్గర రాజరాజచోళుడి విగ్రహం ప్రతిష్టించాలని కరుణానిధి అనుకున్నారు… కానీ అది ఆర్కియాలజీ పరిధిలో ఉండటంతో కేంద్రం విగ్రహ ప్రతిష్ఠాపన అనుమతిని తిరస్కరించింది… చివరకు చిన్న చిన్న అంశాల్లోనూ రాష్ట్రాల అధికారాలకు విలువ లేదు… నిజానికి మా మార్గదర్శి అన్నా, పెరియార్‌లది కూడా ప్రత్యేకదేశవాదమే… విభజనవాదాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటిస్తూ 1962లో ఓ చట్టం తీసుకురావడంతో ఈ ద్రవిడనాడు కోరికకు గండిపడింది… (ప్రత్యేకదేశ పోరాటమే గమ్యమని భావిస్తే, ఆ చట్టాన్ని గౌరవించాలని ఏముంది..? డీఎంకే వాదనలు, వివరణల్లో ఏదో లోపముంది…)
ఇప్పటివరకూ మా ముఖ్యమంత్రి స్టాలిన్ అన్నా బాటలో నడుస్తున్నాడు… మాకు గనుక స్వయంప్రతిపత్తి ఇవ్వకపోతే పెరియార్ మార్గంలోకి వెళ్లాల్సి వస్తుంది… మోడీకి ఇదే నా సూచన…’’ ఇలా సాగిపోయింది రాజా ప్రసంగం… మోడీ ఒక్కసారి కన్నుతెరిస్తే కణిమొళి, రాజా మళ్లీ జైలుకు వెళ్లకతప్పదు… ఈడీ, సీబీఐ హైకోర్టులో కేసు విషయంలో పెద్ద సీరియస్‌గా లేరు… ఎందుకో తెలియదు… అవునూ, రాజా కోరే స్వయంప్రతిపత్తి ఎలాంటిదో… ఆర్టికల్ 370 తరహాలో ప్రత్యేక ప్రతిపత్తి, ప్రత్యేక జెండా, ప్రత్యేక ప్రధాని ఎట్సెట్రా కావాలా..? క్లారిటీ ఇవ్వు రాజా…!! (ద్రవిడనాడు అనగానే మేమూ కలిసొస్తాం అంటారేమో తెలుగు రాష్ట్రాల మందబుద్ధులు… తమిళ తంబీలు ఎవరినీ కలుపుకోరు… ఆ పక్కన మలయాళాన్నే సహించరు… ఇక తెలుగును, కన్నడాన్ని ఎందుకు సహిస్తారు..? వోన్లీ తమిళ్… అంతే…)
Share this Article