ఎంతసేపూ రొటీన్ ఫార్ములా కథలు… అవే ఫైట్లు, అవే స్టెప్పులు, ఇదే ఇమేజ్ బిల్డప్పులు… జనం ఇష్టపడటం లేదు బాసూ, కాస్త మారాలి, లేకపోతే కష్టం అని చెప్పినా సరే చిరంజీవి వినడు… నాకు ఆ పాత్రలే సూటవుతాయి, అవే చేస్తాను అంటాడు…
వైవిధ్యమైన కథలు, పాత్రలతో తన ఇమేజీని సుసంపన్నం చేసుకునే ఒక్క ఆలోచన కూడా ఉండదు… జనం ఆ ధోరణిని ఏమాత్రం ఇష్టపడటం లేదని భోళాశంకర్ సినిమా డిజాస్టర్ నిరూపించింది… అవును కదా, అదొక సినిమా వచ్చిపోయింది కదా అన్నట్టుంది…
మళ్లీ ఇప్పుడు ప్రస్తావన దేనికీ అంటే… 15న జీతెలుగులో ప్రసారం చేశారు… హైదరాబాద్ బార్క్ కేటగిరీలో దానికి వచ్చిన టీఆర్పీలు ఎంతో తెలుసా..? జస్ట్, 2.48…టీవీలోనూ డిజాస్టరే… అంతటి చిరంజీవి, తమన్నా, కీర్తిసురేష్ గట్రా ఉన్నారు… ఐతేనేం, జనం థియేటర్లలో తిరస్కరించారు… చివరకు ఇళ్లల్లో టీవీల్లో చూడటానికి కూడా ఇష్టపడలేదు…
Ads
ఇంకా దాని గురించి చర్చ అనవసరం… టిల్లూ-2 మళ్లీ ప్రసారం చేస్తే 3.94 టీఆర్పీలు వచ్చయ్, అర్థమైంది కదా… సరే, ఎప్పటిలాగే ఈటీవీ రియాలిటీ షోలు రేటింగ్స్‌లో చాలా పూర్ పర్‌ఫామెన్స్ కనబరిచాయి… బిగ్‌బాస్ గురించి చెప్పాలి… ఫాఫం, ఈ సీజన్ కూడా గత సీజన్‌లాగే ఫ్లాప్ దిశలోనే సాగుతోంది… చివరకు నాగార్జున వీకెండ్ షోలకు కూడా జనాదరణ కరువైంది… ఎవరూ పట్టించుకోవడం లేదు…
ఫ్రైడే రోజు రేటింగ్స్ మరీ 3.08… వెరీ పూర్ రేటింగ్స్… అంతెందుకు నాగార్జున ఫన్ షో అంటారు కదా, సండే… 4.78 మాత్రమే… శనివారం 4.50… ఏదో లిమిట్ లెస్ అన్నారు, ముంబై టీమ్ అన్నారు… మస్తు వోటింగులు అన్నారు… తీరా చూస్తే నిఖిల్ ఆట ఒక్కటే కాస్త తెలివిగా, కూల్‌గా సాగుతోంది… ఆడ లేడీస్ మరీ వీథి పంపు కొట్లాట బ్యాచ్‌లా కనిపిస్తున్నారు… వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా వచ్చే హరితేజ, అవినాష్, రోహిణి వీళ్లను తట్టుకోలేక వాళ్లే పారిపోతారేమో… ఏం సెలక్షన్లురా బాబూ… టీంలో చాలామంది మణికంఠలు ఉన్నట్టున్నారు…
అదీ పక్కన పెడితే… సీరియల్స్‌లో మళ్లీ అదే స్టార్ మా బ్రహ్మముడి టాప్, కార్తీకదీపం నెంబర్ టూ… ఎటొచ్చీ జీతెలుగు చేజేతులా చెడగొట్టుకుంటోంది…. అప్పట్లో త్రినయని సీరియల్ కాస్త ఆదరణ పొందేది… ఇప్పుడు అదీ టాప్ 30 ప్రోగ్రామ్స్ నుంచి మాయమై ఫ్లాప్ దిశ వైపు సాగుతోంది… మేఘసందేశం, పడమటి సంధ్యారాగం కాస్త బెటర్…
మరీ విఠలాచార్య బాపతు మాయలుమంత్రాల సతీ త్రినయని సీరియల్ విషయంలో కాస్త ధైర్యంగా గ్రాఫిక్స్ కూడా జొప్పించి ఏవేవో కథలు పడుతున్నారు దర్శకుడు, నిర్మాత… కానీ జనానికి పట్టడం లేదు… మరీ ఇప్పుడైతే పాత కథల్లో తల్లిదండ్రులను కావడిలో మోసుకుపోయిన శ్రవణుడి కథలాగే… త్రినయని మొగుడిని, బిడ్డను, ఓ ఉత్సవ విగ్రహాన్ని కావడిలో పెట్టుకుని మోస్తూ, చెమటలు కక్కుతూ ఎటో వెళ్తోంది…
ఎప్పటికప్పుడు సోదెమ్మల్ని, మంత్రగాళ్లను మారుస్తూ… పిచ్చి పిచ్చి ట్విస్టులు తిప్పినంత మాత్రాన జనం ఆదరిస్తారనుకోవడం ఓ భ్రమ మాస్టారూ… నిండునూరేళ్ల సావాసం, జగద్ధాత్రి కాస్త రేటింగుల్లో నయమే… కానీ జగద్ధాత్రి దర్శకుడు ‘తీసేవాడికి చూసేవాడు లోకువ’ అన్నట్టుగా కథను ప్రజెంట్ చేస్తున్నాడు మరీ లాజిక్కురహితంగా… ఇదండీ ఈ వారం తెలుగు టీవీల రేటింగ్స్ కథాకమామిషు…!!
Share this Article