Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

డీకే భాయ్… తగ్గొద్దు… మనం వేణుస్వామితో కామాఖ్యలో చేయిద్దాం…

June 1, 2024 by M S R

ఒక వార్త… ఏదో పత్రికలో కనిపించింది… నన్ను గెలిపించకపోతే నా అంత్యక్రియలకు రండి, నన్ను బొందపెట్టండి, నన్ను కాలబెట్టండి తరహా నాయకుల ఎమోషనల్ బెదిరింపుల వార్తలు చదివీ చదివీ మనమూ అఘోరాల్లాగా ముదిరిపోయి ఉన్నాం కదా… సో, ఈ వార్త కూడా పెద్దగా కదిలించలేదు…

ఇంతకీ ఆ వార్త ఏమిటంటే… ‘‘రాజకీయ ప్రత్యర్థులు తనకు, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా తాంత్రిక పూజలు చేయిస్తున్నారని కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివరామయ్య ఆరోపించాడు… తమ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కేరళలోని ఓ దేవాలయంలో అఘోరాలు, తాంత్రికులతో యాగాలు చేయిస్తున్నారన్నారు… 

థాలిపరంబులోని రాజరాజేశ్వర ఆలయానికి దగ్గరలోని నిర్మానుష్య ప్రాంతంలో అఘోరాలు రాజకంటక, మరణమోహన స్థంభన యాగాలు చేస్తున్నారు… శత్రువులను అడ్డుతొలగించుకోవడానికి ఈ యాగాలు చేస్తారు… 21 ఎర్ర మేకలు, 21 నల్లమేకలు, ఐదు పందులు, మూడు గేదెలను బలిస్తున్నారు… వాళ్లు పేర్లు చెప్పననీ, మీరే ఇన్వెస్టిగేట్ చేయాలని మీడియాకు సూచించారు…’’

Ads

కౌంటర్‌గా మీరు కూడా పూజలు చేయిస్తారా అనడిగితే నో, నో, నేను రోజూ ఒక నిమిషంపాటు దేవుడిని ప్రార్థిస్తాను, మనం నమ్మేశక్తులే మనల్ని కాపాడతాయి అన్నాడు డీకే….. జస్ట్, ఇక నిమిషం దేవుడిని ప్రార్థిస్తే తను నమ్మే శక్తులే తనను కాపాడే స్థితి ఉన్నప్పుడు ప్రత్యర్థులు రాజకంటకలు చేస్తేనేం..? మరణమోహన స్థంభన చేస్తేనేం..? ఈ విమర్శలు దేనికి..? అంటే లోలోపల ఆ క్షుద్రపూజలు తనను ఏదో చేస్తాయని భయమా..?

అసలు సిద్ధరామయ్య ఇలాంటివేవీ నమ్మడంటారు, కానీ ఎల్లప్పుడూ మంత్రించిన నిమ్మకాయలు జేబులో పెట్టుకుని తిరుగుతాడంటారు… ఇలాంటి పూజలు డీకేకు కూడా కొత్తేమీ కాదు… కానీ అఘోరాలు యాగాలు చేయడం ఏమిటి..? నోరు తిరగని ఆ పూజల పేర్లు తనకెలా తెలుసు మరి..? పైగా ఎన్ని ఎర్రమేకలు, ఎన్ని నల్లమేకలు అనే లెక్క కూడా బాగానే తెలిసింది…

ఇంతకీ ప్రత్యర్థులు అనగా ఎవరు..? సొంత పార్టీలో కుంపట్లు రగిలిస్తున్న శక్తులా..? బీజేపీలో యడ్యూరప్ప కొడుకా..? తేజస్వియా..? యడ్యూరప్ప దోస్త్ శోభా..? అనేకమందితో ఆడుకున్న ప్లేబాయ్ ప్రజ్వల్ రేవణ్ననా..? తన తండ్రా…? లేక నేరుగా దేవెగౌడే చేయిస్తున్నాడా..? పేర్లు చెప్పకపోతే ఎలా మాస్టారూ..?

లేకపోతే ఓ పనిచేద్దాం మాస్టారూ… ఎలాగూ నీకు స్టార్ అస్ట్రాలజర్ వేణుస్వామి స్నేహితుడే కదా… తనతోపాటు కామాఖ్యకు వెళ్లిపో… అక్కడే రెట్టింపు సంఖ్యలో ఎర్రమేకలు, నల్లమేకలు, గేదెలు, పందులతో రాజమహా కంటక, మారణ మోహన మహాస్థంభన పూజలు చేయించేద్దాం… వీలైతే మోడీ, అమిత్ షాలపై రాజశూల, దారుణ మోహన అష్ట దిగ్బంధన యాగాలు కూడా చేయించేద్దాం… అరె సార్, ప్రభుత్వం మనది, ప్రభుత్వ సుస్థిరత కోసం డబ్బులకేం కొదువ..? మంత్రించిన నిమ్మకాయలతో ఆ సిద్ధరాముడినీ తీసుకుని వెళ్దాం, సరేనా..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రేవంత్ రెడ్డి ప్రదర్శించిన అరుదైన గౌరవం… రోశయ్యకు ఘన నివాళి…
  • మార్గన్..! ఆ ‘బిచ్చగాడు’ గుడ్డిగా ఓ దర్శకుడిని నమ్మి మునిగిన కథ..!!
  • అవునూ హరీషూ… కొండగట్టు బస్సు ప్రమాద మృతులు గుర్తున్నారా..?!
  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions