ఆహా యాప్ క్రాష్ అయ్యింది… ఎవరికీ ఓపెన్ కావడం లేదు… యాజమాన్యం కూడా ఓ వివరణ జారీ చేస్తూ… ‘‘డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ అమితమైన ప్రేమ కారణంగా ఓవర్ లోడ్ అయిపోయి మా యాప్ క్రాషయింది… దీని మీద వర్క్ చేయిస్తున్నాం, త్వరలో రీస్టోర్ అవుతుంది…’’ అని వెల్లడించారు… ఎస్, నిజం…
ఈ ఎపిసోడ్ మీద విపరీతమైన హైప్ క్రియేటైంది… ప్రభాస్ పట్ల ప్రేక్షకుల్లో క్రేజ్ ఉంది… పైగా బాలయ్య అన్‌స్టాపబుల్ షోకు కూడా పాపులారిటీ ఉంది… ఈ ఎపిసోడ్‌ను కొత్త సంవత్సర కానుకగా స్ట్రీమింగ్ చేయాలని అనుకున్నట్టున్నారు… అందుకే షూటింగ్, ఎడిటింగ్ ఎప్పుడో పూర్తయినా సరే, ఇంకా ప్రోమోలు గుద్దుతూనే ఉన్నారు… వాయిదా వేస్తూనే ఉన్నారు… ఈరోజు రిలీజ్… తీరా ఓపెన్ చేసే టైమ్‌కు క్రాష్…
ఇదుగో, ఆహా యాజమాన్యం తమ యాప్ క్రాష్ మీద ఇచ్చిన వివరణ…
Ads
నిజానికి ప్రభాస్ ఫ్యాన్స్ ఆ ప్రోమోలను విపరీతంగా చూస్తూ ఉండవచ్చుగాక… తాజాగా స్ట్రీమింగ్ కోసం విపరీతంగా యాప్ ఓపెన్ చేయవచ్చు గాక… ఈమాత్రం దానికి ఏకంగా సర్వర్లే క్రాష్ అవుతాయా..? మరేమిటి కారణం అని కాస్త ఆరాతీస్తే… ఆహా లోకల్ సర్వర్లను వాడుతుందని, నిజంగానే లోడ్ పెరిగితే తట్టుకోలేవని తెలిసింది… పరోక్షంగా ఆహా మేనేజ్‌మెంట్ చెబుతున్నదీ అదే… లోడ్ తట్టుకోలేక క్రాష్ అయ్యిందని…
ఆహా మాత్రమే కాదు… సన్ నెక్స్‌ట్ కూడా అంతేనట… నిజానికి ఓటీటీ అన్నప్పుడు విపరీతమైన స్టోరేజీ కెపాసిటీతోపాటు, ఒకేసారి వచ్చిపడే లోడ్‌ను తట్టుకునే సర్వర్లు కావాలి… మరి ఆహా దీని గురించి ఎందుకు ఆలోచించలేదో అర్థం కాదు… ఇతర ఓటీటీలు ఎప్పుడైతే తెలుగు కంటెంట్ పట్ల ఇంట్రస్టు చూపించడం లేదో ఆహా ప్రేక్షకుల సంఖ్య పెరుగుతోంది…
టీవీ తరహా రియాలిటీ షోలు చేస్తున్నారు కాబట్టి సహజంగానే వీక్షకులు పెరిగారు… సర్వర్ల మీద లోడ్ పెరిగింది… మరి హఠాత్తుగా వచ్చిపడే టెక్నికల్ విపత్తు గురించి ఆహా టెక్నికల్ టీం ఆలోచించలేదా..? కొంతసేపు యాప్ కనిపించకపోతే పెద్దగా వచ్చిపడే నష్టం ఏమీ ఉండకపోవచ్చు… పైగా దీన్ని కూడా వేరే తోవకు మళ్లించి, ప్రభాస్ ఎపిసోడ్ వల్ల ఓవర్ లోడ్ అని పాజిటివ్ ప్రచారానికి వాడుకోవచ్చు… అది కూడా నష్టకారకం ఏమీ కాదు… కానీ ఇలాంటి అంతరాయాలు యాప్ నిర్వహణ ఏ స్థితిలో ఉందో చెబుతుంది… ఇది అల్లు అరవింద్ వంటి బడా వినోద వ్యాపారికి శోభనిచ్చేది మాత్రం కాదు… (ఈ స్టోరీ రాసే సమయానికి, అంటే పదింబావు వరకు కూడా ఆహా రిస్టోర్ కాలేదు…)
ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు కారణమని మరో టాక్… ఈ వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది… ప్రైమరీ information ప్రకారం John doe ఆర్డర్ ఇచ్చింది కోర్టు… అది యాప్ కే నయం… కొన్ని సైట్లు అనధికారికంగా ఈ ఎపిసోడ్ ప్రసారం చేస్తుంటే కోర్టు ఈ ఆర్డర్ పాస్ చేసింది… అంటే ఎవరూ దాన్ని ప్రసారం చేయకుండా…! దీనితో ఎవరైనా కక్షతో యాప్‌ను హ్యక్ చేసి, క్రాష్ చేశారా అనే కొత్త డౌట్స్ పుట్టుకొస్తున్నాయి … (Update :: అర్థరాత్రి restore అయ్యింది)
Share this Article