.
ఈటీవీ వాడు ఆశించినట్టు కామెడీయే… మల్లెమాల వాడు ఆశించినట్టు డబుల్ కామెడీయే… నవ్వొచ్చింది… ఎందుకంటే..? ఆ రెండు సంస్థ ప్లాగ్ షిప్ ప్రోగ్రాం కదా ఆ బూతు, నీచాభిరుచి జబర్దస్త్ కామెడీ షో…
ఆ షో తాలూకు తాజా ప్రోమో చూస్తే నవ్వొచ్చింది… హదేమిటో ఫాఫం, షో చూస్తుంటే నవ్వు రావడం లేదు, స్టిల్ వెగటుగానే అనిపిస్తోంది, కానీ ఈ ప్రోమో చూస్తే నవ్వొచ్చింది…
Ads
ఈమధ్య ఓ ఎఐ ప్రోగ్రాం వచ్చింది కదా… ఏదో ఒక ఫోటో పెడితే, అచ్చం అవే పోలికలున్న పిల్లవాడి వేషంలో మనం ఇన్‌పుట్ అందించిన డైలాగ్స్ వీడియోగా మారి కనిపిస్తుంది… వేల రీల్స్, షార్ట్స్ గట్రా వచ్చేశాయి, ఆ ఎఐ వాడుకుని ఓ ప్రోమో రిలీజ్ చేశారు… ఎందుకు..?
ఫాఫం, కామెడీని డబుల్ చేయాలని సంకల్పించారట, అదుగో, మీరు నవ్వుతున్నారు, జబర్దస్త్‌కూ నవ్వులకూ లింక్ ఏమిటని..! సరే, విషయం చెబుతాను… కామెడీ డబుల్, అన్నీ డబుల్ అని, కొత్త జబర్దస్త్ అని చెబుతూ కొన్ని మార్పులు చేశారుట కదా, అదుగో దాని తాలూకు ప్రోమో…
ఆ ప్రోమో చూస్తున్నంతసేపు ఓ నవ్వు దేనికంటే… దానంతటదే అంగీకరిస్తోంది, ఆ షోలో కామెడీ లోపించింది అని… సో, కామెడీ ఉండాలి, పెంచాలి అనే అద్భుత సంకల్పంతో ఆ మార్పులు చేశారట, శుభం, ఆత్మవిమర్శను మించిందేముంది..?
సరే, ఈ ప్రోమో విశేషం గురించి కదా… డబుల్ కామెడీ అన్నారు కదా… ఆ డబుల్ హోస్ట్ ఎవరెవరో చెబుతారేమో అని చూస్తే అదీ లేదు… రష్మికి తోడుగా మానస్ వస్తున్నాడు కదా… ఆ హింట్ కూడా లేదు… ఏదో శివగామి పాత్రలో ఖుష్బూ… అదేదో జబర్దస్త్ రాజ్యమట…
బిజ్జాలదేవగా కృష్ణభగవాన్ అట… నప్పలేదు, కుదరలేదు… ఇక సద్దాం, రాఘవ, నూకరాజు, రాంప్రసాద్, భాస్కర్ తదితరుల ఎఐ బొమ్మలూ కనిపించాయి… ఏవేవో అరిచాయి, వాటిని పక్కన పెడితే… ఒక ఫైమా లేక ఒక రోహిణికి టీమ్ ఉంటే తప్పేమిటట… లేరు…
సరే, కామెడీ లేకుండా పోయింది, మార్పులు చేద్దాం అనుకున్నారు సరే… కానీ చేయాల్సిన మార్పు టీమ్ లీడర్లు గట్రా కాదు… కెంటెంట్, కాన్సెప్ట్, ఆచరణ ముఖ్యం… అసలు దానిలో అంతర్లీనంగా ప్రవహించేదే బూతు… అది కదా మారాల్సింది…
కృష్ణ భగవాన్, ఖుష్బూ (థాంక్ గాడ్, శివాజీ లేడు… రిలీఫ్) ఆ కుళ్లు జోకులకు నవ్వుతూనే ఉంటారు, పాఫం, పేమెంట్‌కు తగిన పర్‌ఫామెన్స్ ఇవ్వాలి కదా మరి… సరే, రష్మిని వదిలేస్తే… సద్దాం, యాదమరాజు బాపతు స్కిట్స్ మాత్రమే కాస్త వోకే… మిగతావన్నీ బూతులే కదా…
నానాటికీ టీఆర్పీల వేటలో దారుణంగా భంగపడుతున్న జబర్దస్త్‌ను లేపాల్సింది ఈ పిచ్చి మార్పులతో కాదు, కంటెంటు, ఫార్మాట్ మారాలి… ఆ క్రియేటివిటీకి దిక్కులేదు… అదే జబర్దస్త్ తాలూకూ ట్రాజెడీ…!!
Share this Article