Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కోర్టులో ఒక ఎఐ జడ్జి ఉంటే..? రాబోయే రోజుల్లో ఈ సిట్యుయేషన్ తప్పదా..!

March 24, 2026 by M S R

.
John Kora ….. కోర్టులో ఒక ఏఐ జడ్జీ ఉంటే?….. మన మొబైల్ ఫోన్ ఒక్కటి చాలు.‌ మన జీవితాన్ని, జీవనశైలిని విశ్లేషించడానికి. ఇప్పటికే ప్రభుత్వం పలు రకాల యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకోవాలని ఒత్తిడి తెస్తోంది. భవిష్యత్‌లో వాటిని mandatory చేసినా ఆశ్చర్యం లేదు.

ఇక మన నగరాల్లో ఏర్పాటు చేస్తున్న సీసీ కెమేరాలు.. సాధారణమైనవి కావు. అవి ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాయి. అంటే నాలుగు గోడల మధ్య, నగరంలోని రోడ్లపై, ఆఫీస్, స్కూల్, కాలేజ్, రెస్టారెంట్, బార్.. ఎక్కడా మనకు ప్రైవసీ అనేదే లేదు. Privacy is a myth.

ఇక mercy సినిమా విషయానికి వస్తే.. లాస్‌ఏంజిల్స్ మెట్రోపాలిటన్ సంస్థ ఒక యాప్‌ను రూపొందించి.. దాన్ని తప్పకుండా ప్రతీ సిటిజన్ ఇన్‌స్టాల్ చేసుకోవాలని చెప్తుంది. డిటెక్టివ్ క్రిస్ రావెన్ (క్రిస్ ప్రాట్) భార్యను హత్య చేశాడనే ఆరోపణలతో అరెస్టవుతాడు. విచారణకు అతన్ని ‘మెర్సీ అనే’ జడ్జ్ (రెబెక్కా ఫెర్గూసన్) ముందు ప్రవేశపెడతారు.

Ads

అయితే ఈ మెర్సీ అనేది ఒక AI Judge. 90 నిమిషాల్లో ఏఐ జడ్జ్‌ను ఒప్పించి తాను నిర్దోషినని రావెన్ నిరూపించుకోవాలి. ఆ AI జడ్జ్ అతని ఫోన్ నుంచి మొదలు పెట్టి.. సీసీ కెమెరాలతో సహా.. ఎన్నో డిజిటల్ సాక్ష్యాలు ముందు పెడుతుంది. దాన్ని ఒప్పించాలంటే రావెన్ ఎంత కష్టపడి ఉంటాడో ఊహించుకోండి. సింపుల్‌గా కనిపించే థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌ ఇది.

మనం ఎన్నో కోర్ట్ రూమ్ డ్రామాలు చూసుంటాం, కానీ న్యాయమూర్తి స్థానంలో ఒక మనిషికి బదులు “ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్” (AI జడ్జి) ఉంటే ఎలా ఉంటుంది? టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందినా, ఒక మనిషి జీవితాన్ని డిసైడ్ చేసే తీర్పును ఒక మెషీన్ ఇవ్వగలదా? అందులో మానవత్వం, ఎమోషన్స్ ఉంటాయా? అనే పాయింట్‌ను ఈ సినిమాలో చాలా ఆసక్తికరంగా చూపించారు.

భవిష్యత్తులో టెక్నాలజీ న్యాయవ్యవస్థలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతోంది అనే కోణంలో సాగే ఈ స్టోరీ ప్రతి ఒక్కరినీ కచ్చితంగా ఆలోచింపజేస్తుంది. ​సైన్స్ ఫిక్షన్, డిఫరెంట్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారు కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది! Prime Videoలో ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. కానీ ఇంగ్లీషులో చూస్తే బాగుంటది. #భాయ్‌జాన్

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కోర్టులో ఒక ఎఐ జడ్జి ఉంటే..? రాబోయే రోజుల్లో ఈ సిట్యుయేషన్ తప్పదా..!
  • ‘‘నీకూ మోసం చేయడం తెలిస్తే… చేసి నువ్వూ సంపాదించుకో…’’
  • అమ్మ రాజీనామా చేస్తే… ఇల్లు కల్లోలమే…! మంచి కాన్సెప్టు మూవీ…!
  • ఇది లొట్టపీసు కేసు కాదు… రేవంత్ వర్సెస్ కేటీఆర్ – తిరగబడ్డ కాలచక్రం!
  • ఎన్నికల సంఘం సర్క్యులర్ మీద బీజేపీ స్టాంప్… ఏం జరుగుతోంది…
  • అమెరికాకు వాచిపోయింది… సగం యుద్ధాన్ని ఇరాన్ గెలిచినట్టే లెక్క…
  • హైదరాబాద్ జర్నలిస్టుల ఇళ్లస్థలాలు… మళ్లీ మొదటికొచ్చింది ఇష్యూ…
  • రిటైర్డ్ ఉద్యోగులకు ఊరట… రేవంత్ రెడ్డి సర్కారుకు హైకోర్టు డెడ్‌లైన్…
  • అమెరికా ‘గుండెకాయ’కే ఇరాన్ గురి..! పుతిన్ ఆడుతున్న కొత్త ఆట..!!
  • చెప్పేవాడికి వినేవాడు లోకువ… చివరకు ఆ డ్రగ్స్ తండ్రీ నీతిబోధ…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions