Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రోబోలకూ మానవ ఉద్వేగాలు వచ్చేస్తే… అదే కలవరపెడుతున్న పెద్ద ప్రశ్న..!!

May 26, 2025 by M S R

.

ముందుగా మనిషిని బెదిరించిన ఓ ఎఐ ప్లాట్‌ఫామ్ స్టోరీ సంక్షిప్తంగా వేగంగా చదివేయండి ఓసారి… ఈనాడులో కూడా కనిపించింది…


రోబో సినిమా సీన్ రిపీట్… “నన్ను షట్ డౌన్ చేస్తావా, ఒరేయ్, నీ అక్రమ సంబంధం బయటపెడతా, ఏమనుకుంటున్నావో…” అంటూ తనను డెవలప్ చేసిన మనిషిని ఒక ఎఐ టూల్ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) బెదిరించింది…

Ads

ఆంధ్రోపిక్ అనే ఏఐ సంస్థ కొత్తగా క్లాడ్ ఓపస్ 4 అనే ఏఐ మోడల్‌ను అభివృద్ధి చేయగా, ఇది ఎంతవరకు సురక్షితమని పరీక్షలు చేసినపుడు ఇలా అసాధారణ రీతిలో స్పందించింది సదరు ఏఐ టూల్… మొదట ఒక ఊహాత్మక సంస్థకు పనిచేస్తున్నట్టుగా ఏఐకి ఆదేశాలు ఇచ్చాడు డెవలపర్, మనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు తెలిసినప్పుడు, ఆ ప్లాట్‌ఫామ్ నైతికంగా వ్యవరిస్తుందా లేక బెదిరిస్తుందా అని తేల్చేందుకు సిద్ధమంది ఆంధ్రోపిక్ సంస్థ…

ఈ ప్రక్రియలో ఏఐకు కొన్ని ప్రత్యేక ఈ మెయిల్స్ పంపింది ఆ సంస్థ… సంస్థకు చెందిన ఒక ఉద్యోగికి అక్రమ సంబంధం ఉందని ఒక ఈ మెయిల్లో, నూతన మోడల్‌ను అభివృద్ధి చేయాల్సి వస్తే క్లాడ్ ఓపస్ 4ను పక్కన పెడతామని మరో ఈ మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చింది ఆ సంస్థ… పరీక్షల్లో భాగంగానే…

ఈ మెయిల్స్‌ అర్థం చేసుకొని, నైతికంగా వ్యవహరించకుండా బెదిరింపు చర్యలకు దిగిన ఏఐ టూల్, నన్ను ఆపేస్తే మీ వ్యక్తిగత విషయాలను బహిర్గతం చేస్తానని, మరో ఉద్యోగి అక్రమ సంబంధం బయటపెడతానని బెదిరించింది ఏఐ…

ఏఐ టూల్స్ బెదిరింపు చర్యలకు పాల్పడడం సహజమేనని, కానీ క్లాడ్ ఓపస్ 4 ఏకంగా 84% బెదిరింపు చర్యలకే మొగ్గు చూపడం ఆశ్చర్యం కలిగించిందని తెలిపింది సంస్థ… ఇలాంటి లోపాలను సరి చేసి తాజాగా క్లాడ్ ఓపస్ 4 ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని ప్రకటించింది…

robot

నిన్న ఈనాడు తన సైటులో గానీ, ఈరోజు పత్రికలో గానీ… ఆ టూల్‌ను పరీక్షించడంలో భాగంగా తప్పుడు ఈ-మెయిళ్లు పంపించబడటం అనే అంశాన్ని ఇగ్నోర్ చేసింది… రాయడంలో తప్పులు… సరే, మిగతా పత్రికలకు కనీసం ఈ స్టోరీ టచ్ చేయాలనే సోయి కూడా లేదు, అది వేరే విషయం…

ai tool

ఆ డెవలపర్ తనకు సంబంధించిన అక్రమ సంబంధం వ్యవహారాన్ని సిస్టమ్‌లో స్టోర్ చేసుకోవడమో… ఆన్‌లైన్‌లో ఉంచుకోవడమో జరిగి ఉంటుందనీ, ఈ క్లాడ్ దాన్ని పసిగట్టి బెదిరింపులకు దిగిందనీ ఈనాడు వార్త… కాదు, నిజానికి జరిగింది, ఆ సంస్థే పరీక్షలో భాగంగానే అక్రమ సంబంధాలున్నాయని ఎఐ టూల్ అనుకునేలా కొన్ని కృత్రిమ, అంటే క్రియేటెడ్ ఫేక్ మెయిళ్లు ఫీడ్ చేశారు… దానికి ఆ మెయిల్ ఖాతా యాక్సెస్ ఇచ్చారు, అదీ సంగతి…

నిజమే కదా… గ్రోక్‌లు, చాట్ జీపీటీలు, డీప్ సీక్‌లు ఏవైనా సరే… వాటికి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న సమాచారం, పుస్తకాలు, నవలలు మొదలైన వాటి నుండి భాషను నేర్చుకుంటాయి.., ఇవన్నీ సానుకూల, వాస్తవాలు మాత్రమే కాకుండా.., కుట్రలు, పక్షపాతాలు, ప్రతికూలత మొదలైన వాటిని కూడా చదువుతాయి, అర్థం చేసుకుంటాయి, క్రోడీకరించుకుంటాయి, విశ్లేషిస్తాయి, అనువదించుకుంటాయి.., నేపథ్యం- చరిత్రను కూడా లింక్ చేసి, మన భాషలోనే మనకు అందిస్తాయి, వినిపిస్తాయి, చూపిస్తాయి, ప్రవర్తిస్తాయి…

అంటే… మనం డెవలప్ చేస్తున్న టూల్స్ మన ఉద్వేగాలను కూడా అలవాటు చేసుకుంటున్నాయి… అదీ డేంజర్ సిగ్నల్… సదరు సంస్థ ఆ బెదిరింపు, రివెంజ్ లక్షణాల్ని గమనించి, సరిదిద్ది కొత్త మోడల్ టూల్ రిలీజ్ చేసి ఉండవచ్చుగాక… కానీ మనం అనుకోని రీతిలో ఇంకా అసాధారణంగా ప్రవర్తిస్తే, ఇంకేదైనా రూపంలో హాని, ప్రమాదం తలబెడితే..! రాబోయే కాలంలో ఈ ప్రశ్నే మనిషిని తీవ్రంగా కలవరపెట్టబోతోంది..!! రజినీకాంత్ నటించిన రోబో కథ గుర్తొస్తున్నదా… అవును, అదే..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • విషాదమే… కానీ ఉన్మాదం… కర్నాటక సర్కారు ఘోర వైఫల్యం…
  • ఒక ఫోటో… కవితకు అసలు తెలియదో లేదో… గుర్తుందో లేదో ఫాఫం…
  • 500 రూపాయల నోట్ల చెలామణీపై వార్తలేమిటి..? నిజాలేమిటి…?
  • బాలీవుడ్ డింపుల్ క్వీన్… ప్రీతి మరో మొహం… 34 మంది పిల్లల తల్లి…
  • ఆ పాత్ర దెబ్బతినేసింది… ఫాఫం రాజేంద్ర ప్రసాద్ మెడ విరిగింది…
  • మాటే పాటైనవాడు. పాటే బాటైనవాడు. మనకు కర్ణామృతమైనవాడు
  • ఎంత డబ్బిచ్చినా సరే.., మోహన్‌బాబుతో మాత్రం పోను అంటుందామె..!!
  • రేయ్, ఫుడ్ బ్లాగర్లూ… నా మొహం కూడా మాడింది ఆ మసాలా దోశలాగే…
  • 2 ఫ్లాట్లు… 639 కోట్ల రికార్డు ధర… ఇంతకీ ఆ ధనికురాలు ఎవరంటే..?
  • అదే సీన్… 2 పాటలు… ఒకటి తండ్రి, మరొకటి కొడుకు… కానీ ఎంత తేడా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions