Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎయిమ్స్ సర్వర్లు హ్యాక్… మన సర్కారీ సంస్థలన్నీ డిజిటల్లీ నాట్ సేఫ్…

November 29, 2022 by Rishi

[[ By :: పార్థ సారథి పొట్లూరి ]] ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ , ఢిల్లీ [AIIMS, DELHI] సర్వర్స్ డౌన్ ! హ్యాకర్లు ఢిల్లీలోని AIIMS సర్వర్స్ ని రాన్సం వేర్ [Ransomewere] తో ఎనక్రిప్ట్ చేశారు.


గత 6 రోజులుగా AIIMS సర్వర్లు పనిచేయడం లేదు.
నవంబర్ 23, బుధవారం రోజున సర్వర్లు దాడికి గురిఅయ్యాయి ! అప్పటి నుండి AIIMS లో అంతా మాన్యువల్ గానే పనిచేస్తున్నారు సిబ్బంది. హ్యాకర్లు 200 కోట్ల రూపాయలని క్రీప్టో కరెన్సీ [బిట్ కాయిన్ ] లో చెల్లింపులు జరపమని డిమాండ్ చేస్తున్నారు !
గత 6 రోజులుగా పేషెంట్ కేర్ సర్వీసెస్ ఇన్ ఎమర్జెన్సీ, ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్, ల్యాబ్ విభాగాలని మాన్యువల్ గానే ఆపరేట్ చేయాల్సి వస్తున్నది.


Ransomewere అంటే ఏమిటీ ?
రాన్ సమ్ వేర్ అనేది వైరస్ కాదు. మాల్ వేర్ లో ప్రత్యేకమయిన సోఫ్ట్వేర్. ఒక సారి హ్యాకర్ కనుక కంప్యూటర్ లేదా ఏదయినా సంస్థ కి చెందిన సర్వర్స్ ని యాక్సెస్ చేయగలిగితే వెంటనే తన సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేస్తాడు. అది సర్వర్స్ లో ఉన్న మొత్తం సమాచారాన్ని ఎన్క్రిప్ట్ చేస్తుంది. దాంతో ఆ సర్వర్ కు అనుసంధానంగా ఉన్న అన్ని కంప్యూటర్లు కూడా డాటా ని యాక్సెస్ చేయలేవు. సర్వర్స్ లో ఉన్న అన్ని ఫైల్స్ కూడా లాక్ అయిపోతాయి. ఫోల్డర్ పేర్లు కూడా మారిపోతాయి. అన్ని ఫైల్స్ కి ఒకే ఎక్స్ టెన్షన్ ఉంటుంది. హ్యాకర్ డిమాండ్ చేసిన డబ్బు ఇస్తే హ్యాకర్ ఆ రాన్ సమ్ వేర్ కి ఒక కీ ఇస్తాడు. దానిని ఉపయోగించి తిరిగి డాటా ని మామూలుగా వాడుకోవచ్చు. 2020 లో కోవిడ్ వల్ల ఆదాయం కోల్పోయిన కొంతమంది హ్యాకర్లు ప్రపంచవ్యాప్తంగా దాడులు చేసిన వేల కోట్ల రూపాయాలని డిమాండ్ చేశారు. 2020 లో యాంటీ వైరస్ ని అందించే అన్ని సంస్థలు కూడా ఈ రాన్ సమ్ వేర్ కి విరుగుడు కనిపెట్టలేకపోయాయి. దాంతో చాలా వరకు డబ్బులు చెల్లించి దీని బారి నుండి బయటపడ్డారు! Encryption అనేది హ్యాకర్ స్వంతంగా ప్రోగ్రామ్ చేస్తాడు కాబట్టి దానిని వేరే వాళ్ళు ఎవరూ కనిపెట్టలేరు. ఒక్కో హ్యాకర్ ఒక్కో రకమయిన అల్గారిథం రాస్తాడు. గత సంవత్సరం అంటే 2021 లో కొన్ని సంస్థలు రాన్ సమ్ వేర్ దాడులతో తమ డాటా ని కోల్పోయాయి కానీ 80% సంస్థలు హ్యాకర్స్ కి డబ్బులు చెల్లించి తిరిగి తమ డాటా ని పొందగలిగాయి.

Ads


మొదట ఈ రాన్ సమ్ వేర్ ని ఎవరు ఉపయోగించారు ?
నార్త్ కొరియా, ప్యాన్ గాంగ్ ! ఇప్పటికీ చాలా వరకు ransomewere దాడులు చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నది సింహభాగం నార్త్ కొరియన్లు. అయితే చైనా కి చెందిన ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే హ్యాకర్లు కూడా వివిధ రకాలయిన సైబర్ దాడులు చేస్తున్నారు. మరికొన్ని దేశాలు కూడా దీనితో సంబంధం కలిగి ఉన్నాయి. అయితే ప్రస్తుతం చైనాలో కోవిడ్ భూతం సృష్టిస్తున్న విలయంతో చైనా అధ్యక్షుడు జింగ్పింగ్ తీవ్ర నిరసనలని ఎదుర్కొంటున్న సమయంలో ఢిల్లీ లోని AIIMS మీద సైబర్ దాడి జరగడం అనుమానాలకి తావు ఇస్తున్నది. కోవిడ్ కి సంబంధించి పరిశోధన చాలా వరకు ఢిల్లీ లోని AIIMS కేంద్రంగా జరుగుతున్నది అన్నది గుర్తుపెట్టుకోవాలి !


ఢిల్లీ AIIMS సర్వర్ లో దాదాపుగా మూడు నుండి నాలుగు కోట్ల పేషంట్ల కి సంబంధించి వివరాలు ఉన్నాయి. వీటిలో మాజీ ప్రధానులు, రాష్ట్రపతులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియి సుప్రీం, హై కోర్టుల న్యాయమూర్తుల వివరాలు ఉన్నాయి.
ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న సంస్థలు సైబర్ ప్రొటెక్షన్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి అనే విమర్శ చాలా కాలంగా వినపడుతున్నది. ఇప్పటికీ చాలా ప్రభుత్వ రంగ సంస్థలలో Windows Xp ని వాడుతున్నారు. మైక్రోసాఫ్ట్ windos 7 కి సెక్యూరిటీ అప్ డేట్స్ నిలిపివేసి సంవత్సరం అవుతున్నది కానీ ఇప్పటికీ Windows 7 వాడుతున్నారు.

ఇక Windows 10 చాలా వరకు ప్రొటెక్ట్ చేస్తుంది కానీ Windows 10 కంటే Windows 11 మరింత రక్షణ కల్పిస్తుంది Ransomewere దాడుల నుండి. కానీ హ్యాకర్లు ఎప్పటికప్పుడు తమ ఆల్గోరిథం మార్చుకుంటూ వెళుతుండడం వలన అన్ని యాంటీ రాన్సమ్ వేర్ టూల్స్ రక్షణ ఇవ్వలేవు. ఎంతో పటిష్టమయిన ఆపిల్ IOS ఆపరేటింగ్ సిస్టమ్ ని కూడా హ్యాకర్లు యాక్సెస్ చేయగలుగుతున్నారు. గూగుల్ యాండ్రాయిడ్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ హ్యాకర్ల కి ముఖ్యమయిన ఆహారంగా మారిపోయాయి.
(****
అందుకే మీ మొబైల్ ఫోన్లు కూడా సురక్షితం కాదు. ఇటీవలే గూగుల్ ప్లే స్టోర్ హానికరమయిన కొన్ని apps ని తన ప్లే స్టోర్ నుండి తీసివేసింది, అంటే యాండ్రాయిడ్ కూడా సురక్షితం కాదు అని తెలిసిపోతున్నది. న్యూ జనరేషన్ ప్రాసెసర్లు కలిగిన మొబైల్ ఫోన్లు కొంచెం సేఫ్ ! మీ ఫోన్ లేదా కంప్యూటర్లలో ఉండే ఆపరేటింగ్ సిస్టమ్ ని నిత్యం అప్ డేట్ చేస్తూ ఉండాలి, లేకపోతే అంతే సంగతులు. మూడేళ్లు దాటిన మొబైల్ ఫోన్ కి అప్ డేట్లు రావు. అటువంటప్పుడు ఇంటర్నెట్ వాడే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇంటర్నెట్ వాడుతూ Windows7 వాడే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి…

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions