Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అమ్మా అలీదా గువేరా… వీళ్లకు సంఘీభావం చెప్పే అర్హత కూడా లేదమ్మా…

January 23, 2023 by M S R

Gurram Seetaramulu………. చేగువేరా బిడ్డ హైదరాబాద్ వస్తోంది అని తెలిసి, అంత గొప్ప యోధుని బిడ్డను చివరిసారిగా చూడాలి అని ఆఘమేఘాల మీద హైదరాబాద్ బయలుదేరా. రవీంద్ర భారతి ముందు ఈ ఇరవై ఏళ్ళలో అన్ని కార్లు ఆగి ఉండడం నేనెప్పుడూ చూడలేదు. మొత్తానికి నిలబడే స్థలం కూడా లేని, కిక్కిరిసిన రవీంద్ర భారతిలో ఒంటికాలి మీద నిలబడి ఒక్కసారి ఆమెను చూసి బయట పడ్డా..

ఐరిష్ మూలాలున్న చే కుటుంబం… లాటిన్ అమెరికాలో స్థిరపడ్డ మెడికో… ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన చే రష్యన్ విప్లవం విజయవంతం అయిన పదేళ్లకు పుట్టాడు. యాభయ్యో దశకంలో మొదలైన అలజడులు చూసి పెరిగి వాటికి ఆకర్షితుడై క్యూబన్ విప్లవాన్ని ఆవహించుకుని, బొలీవియన్ విప్లవంలో హంతక సిఐఎ చేతిలో హత్యకు గురై అమరుడు అయ్యాడు.
పెట్టుబడిదారీ సమాజ శవపేటికకు మేకులు కొడదాం అని క్యూబా అనుకున్నది. అలా కొడదాం అనుకున్న చే గువేరా బొమ్మను కూడా మార్కెట్ చేసుకుంది సామ్రాజ్యవాదం. అదీ పెట్టుబడికి ఉన్న శక్తి… చే ప్రవహించే ఉత్తుంగ తరంగం. కోట్లాది మందికి, ప్రత్యామ్నాయ ఆలోచనలు కలగన్న వాళ్లకు చీకట్లో చిరు ప్రమిద. ఏదో పని మీద ఆమె ఇండియా వచ్చింది. మొన్న పద్దెనిమిది నాడు మద్రాస్ సీపీఎం ఒక మీటింగ్ పెట్టింది ఇవ్వాళ… తెలంగాణ రేపు భ్రమరావతిలో …
ఇవ్వాళ మీటింగ్ లో క్యూబా సాలిడారిటీ కమిటీ అనే బ్యానర్ చూసి నవ్వుకున్నా. ప్రపంచానికి సామ్రాజ్యవాద పోరాటాన్ని ఎలా నడపాలో చెప్పిన క్యూబా, కరోనా కాలంలో ఆపన్న హస్తంలా నిలిచిన క్యూబా, వర్గపోరాటం విలువ తెలిపిన క్యూబా ఈ వేదిక మీద ఉన్న మొనగాళ్ల నుండి సాలిడారిటీ ఆశిస్తోందా..? అది వంచిత కాదు, నిలువెత్తు స్వాభిమాన చిహ్నం… అమెరికా సామ్రాజ్య వాదం నశించాలనాలి, తమ పిల్లలు అమెరికాలో చదివాలి, చే బిడ్డ మీటింగ్ లోనేమో దళారి అమెరికాను తిట్టాలి… ఏమిరా బాలరాజులూ, మీ వల్ల ఈ దేశానికి ఏం ఒరిగింది ?
ముందు ఎర్రజెండా త్యాగం గురించి మాట్లాడాలి… వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ బిచ్చం వేసే ఒకటి రెండు సీట్ల కోసం దేబిరించాలి… అదే ఇండియన్ కుల తార్కిక భౌతిక వాదం… నిన్న ఒక మాటన్నావ్… “పేదలుగా ఉంటాం, సంపన్నులుగా మరణిస్తాం” అని… మా కమ్యూనిస్టులు కూడా పైకి పేదలు, పిల్లలకు మాత్రం వందల కోట్ల పెట్టుబడులు పోగేస్తారు… తెలుసా అమ్మా నీకు..?

ఇలా ఎరుపుకీ గులాబీకీ మధ్య కాట్ వాక్ చేసే వాళ్లకు క్యూబా సంఘీభావ కమిటీలో మాట్లాడ్డం అంత కామెడీ మరొకటి లేదు.

ముప్పై మూడు వక్కలై, చెక్కలై, చెదిరిన స్వప్నాలలో… ఏ ముక్క ఎక్కడికో, ఏ వెలుగులకో ఈ ప్రస్థానం అర్ధం కాక, ఎర్ర జెండా తన తలను తానే నేలకి బాదుకుటోంది. నిజంగా మాకు బుర్ర ఉంటే, ఆ మీటింగ్ క్యూబన్ అనుభవాల నుండి నేర్చుకునే గుణపాఠం ఏదన్నా ఉంటే అది బాగుండేది.
బక్క చిక్కిన, సొమ్మసిల్లిన నీకు వీళ్లిచ్చే సాలిడారిటీ ఏముంది తల్లీ…
చివర మాట… హాల్ లో స్థలం లేక రవీంద్ర భారతి మెట్ల మీద కూర్చుని ఇది రాస్తున్న… అమ్మా అలీదా ఇక్కడ ఇంటింటికీ అమెరికా ముద్ర, వంట గదికి అమెరికా అలెక్సా కాపలా… ఎక్కడమ్మా నువ్వులేనిది అమెరికా అని పాడుకోవాలి. నా ముందు bmw, ఫోర్డ్, కియా, ఫార్చ్యూనర్ ఇన్నోవా , బెంజ్, సుజుకి లాంటి ఖరీదైన కార్లు వేసుకుని… బక్క చిక్కిన విధి వంచితురాలు అయిన అలీదా గువేరాకు సంఘీభావం చెప్పడానికి వచ్చాము. మొత్తానికి మా మాటల యుద్దాన్ని అజ్ఞానాన్నీ నీ ముందు ఒలకబోసాం అంతిమ ఘట్టం ముగిసింది అన్నమాట.
అమ్మా అలీదా… ఆ వేదిక మీద కాకుండా నువ్వు ఏ ఇంద్రవెళ్లి స్థూపాన్నో, కూలిన హుస్నాబాద్ స్థూపాన్నో , పాతపల్లికో, చెంచు గూడేనికో , భద్రాచలం పోలవరం నిర్వాసితుల కొంపలకో… వీలుంటే అబూజ్ మడ్ కో… అధవా మా జార్జ్ రెడ్డి సమాధినో ఒక్కసారి వెళ్లి చూసి ఉంటే, మీ అయ్య ఆశయం ఇక్కడ బ్రతికే ఉంది అని తృప్తితోనైనా మీ ఊరు తిరిగి వెళ్లేదానివి, నీకెన్ని కష్టాలు వచ్చాయి అలీదా… వీలుంటే మా అజ్ఞానాన్ని క్షమించు…

Share this Article






Advertisement

Search On Site

Latest Articles

  • ఫాఫం… లోకేష్ కూడా అదే బ్లడ్డు, అదే బ్రీడు కదా… ఆ గూటి పక్షికి ఆ కూతలే కదా..?!
  • నువ్వు చాలా దిల్‌దార్… గ్రేటే కానీ, మరి తెలంగాణ నీటిప్రయోజనాల మాటేంటి..?
  • ఝలక్కులు కావు… ఇదుగో మజ్లిస్ జిల్లాల్లో పోటీకి తొలిదఫాలో గుర్తించిన సీట్లు…
  • ఆధునిక సినిమా ద్వేషి రంగనాయకమ్మకూ నచ్చిన శంకరాభరణం..!
  • ‘‘ఆర్టిస్టులను గౌరవిద్దాం సరే… ప్రజల మనోభావాలను వాళ్లూ గౌరవించాలి కదా…’’
  • సహస్ర శిరచ్ఛేద ‘అహిలావతి’ కథ… రాక్షసరాజును పెళ్లాడిన ప్రజ్ఞా యోధ…
  • స్టెప్ మోషన్‌లో… ఒక్కొక్కరినీ పరిశీలిస్తూ ‘కవర్’ చేయాల్సి వచ్చింది…
  • అది ఖచ్చితంగా గూఢచర్య పరికరమే… అన్ని దేశాలపైనా చైనా నిఘా కన్ను…
  • ముంబైలో వాణిని తొక్కేసింది లత, ఆశ… అసలే సౌతిండియన్, పైగా మెరిటోరియస్…
  • సుప్రీం చెప్పినా కదలని కేసీయార్ సర్కారు…! తొండి ఆట- మొండిచేయి…!!

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions