Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బిగ్‌బాస్ హౌజులో ఉన్న శోభాశెట్టి హఠాత్తుగా ఈటీవీలో ప్రత్యక్షం..!!

November 17, 2023 by M S R

శోభాశెట్టి ఎక్కడుంది..? ఏమిటీ పిచ్చి ప్రశ్న… ఆమె బిగ్‌బాస్ హౌజులో ఉంది కదా… పెద కామందు శివాజీ కుట్రలకు, కుటిల వ్యూహాలకు ప్రధాన బాధితురాలు కదా… పది వారాలుగా అక్కడే ఉంది కదా… ఇదే కదా మీ సమాధానం…

అబ్బే, ఈటీవీలో ఆలీతో ఆల్ ఇన్ వన్ అనే ఓ అట్టర్ ఫ్లాప్ రియాలిటీ షో ఒకటి వస్తుంది కదా… అందులో పార్టిసిపేట్ చేసింది… ఈ 21న అది ప్రసారం కాబోతోంది… ఈటీవీ ప్రోమో కూడా రిలీజ్ చేసింది… ఆమెతోపాటు ఎవరో ఇద్దరు మగ సెలబ్రిటీలు ఉన్నారు కానీ ఈమే బాగా పాపులర్… సేమ్, బిగ్‌బాస్ తాలూకు టెంపరే ఇందులోనూ చూపించింది… మరి కార్తీకదీపం మోనితా మజాకా..!

మరి బిగ్‌బాస్‌లో ఉన్న శోభాశెట్టి ఈ ప్రోగామ్‌లో ఎప్పుడు పాల్గొంది..? ఎప్పుడు పాల్గొంది..? రహస్యంగా బిగ్‌బాస్ అనుమతి తీసుకుని, ఏ అర్ధరాత్రో హౌజ్ నుంచి బయటపడి, ఈటీవో షోలో పార్టిసిపేట్ చేసి, మళ్లీ గుట్టుచప్పుడు గాకుండా హౌజులోకి వెళ్లి పోయిందా..? హహహ… సరదాగా అనుకున్నా సరే, ఇలాగే అనిపిస్తుంది హఠాత్తుగా ఆ ప్రోమో చూస్తే… ఏమో, కొంపదీసి ఎలిమినేట్ అయిపోయి నేరుగా ఈటీవీకి వెళ్లిపోయిందా..?

Ads

శోభాశెట్టి

నిజమేమిటి..? అప్పుడెప్పుడో పదివారాలకు పూర్వం ఈ షో షూట్ చేసి ఉంటారు… ఆ చద్ది, పాచి వీడియోను ఇప్పుడు జనంలోకి వదులుతున్నారు… అసలు ఆ షోయే ఎవరూ చూడటం లేదు… చాలా దయనీయమైన రేటింగ్స్… పైగా ఇదుగో ఈ తరహా పైత్యాలు… అందుకే ఈటీవీ నాన్-ఫిక్షన్ ప్రోగ్రాములన్నీ నాసిరకంగా మారి, ఈటీవీ ఓవరాల్ రేటింగ్స్ ఘోరంగా పడిపోతున్నయ్…

ఈటీవీ న్యూస్ రేటింగ్స్ కూడా తీసేస్తే ఓవరాల్‌గా ఈటీవీ వినోద చానెల్ నాలుగో స్థానానికి పడిపోతుందేమో… సినిమా ప్రీమియర్ల ప్రసారాలు ఈటీవీకి చేతకావు… ఎక్కువ రేట్లు పెట్టి కొనదు, కొన్ని నాసిరకం సినిమాల్ని ఎవరూ చూడరు… ఈ వారం బ్లడీ మేరీ అనే సినిమా ప్రసారం చేస్తే వచ్చిన రేటింగ్స్ కేవలం 1.33… పరమ దయనీయమైన రేటింగ్స్…

ఈవారం స్టార్ మా రేటింగ్స్ 1192 కాగా ఈటీవీ రేటింగ్స్ 458 మాత్రమే… మాటీవీలో మూడో వంతుకు పడిపోయింది ఫాఫం… ఐనా చక్కదిద్దుకోవడం లేదు… మరోవైపు జీతెలుగు కాస్తోకూస్తో మాటీవీకి పోటీ ఇస్తోంది… రెండో ప్లేసులో ఉంది… దాని రేటింగ్స్ 740… (తాజా రేటింగ్సే ఇవన్నీ…) జెమిని టీవీని మనం ఎప్పుడో లెక్క నుంచి తీసేశాం కాబట్టి, ఆ ప్రస్తావనే అవసరం లేదు…

గతంలో ఆలీతో సరదాగా అని ప్రోగ్రామ్ హోస్ట్ చేసేవాడు ఆలీ… క్రమేపీ మొనాటనీ వచ్చేసి ఎవరూ చూడకపోయేవాళ్లు… పైగా జగన్ ఏదో పదవి ఇచ్చాడు… దాంతో ఆ షోకు ఫుల్ స్టాప్ పెట్టాడు ఆలీ… కొన్నాళ్లకు ఆ పదవిలో తను చేసేదేమీ లేదని అర్థమై ఇదుగో ఆలీతో ఆల్ ఇన్ వన్ అంటూ మరో సీజన్ స్టార్ట్ చేశాడు… ఐనాసరే పెద్దగా పాపులారిటీ రాలేదు… ఇలా షూటింగు జరిగిన మూడు, నాలుగు నెలలకు షో ప్రసారం చేస్తే ఎవరికి ఆసక్తి ఉంటుంది..? ఈవారం వచ్చిన రేటింగ్స్ 1.42 అంటేనే అర్థమవుతోంది కదా…

పైగా కాస్త పేరున్న సెలబ్రిటీలను తీసుకొచ్చి, ఆడించినా పాడించినా ఓ పద్దతి… శోభాశెట్టి వరకూ వోకే, కానీ ఆ మిగతా ఇద్దరు ఎవరికీ పెద్దగా తెలియదు… మరిక ఆ ప్రోగ్రాం మీద ఆసక్తి ఎలా పుడుతుంది ఆలీ..? ఎవరు చూడాలి… ఎస్పీ చరణ్, సుమ, ఆలీ… హబ్బ, అందరూ అందరే…!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • భలేవారే, యాంగ్రీ రాజశేఖర్‌ సాఫ్ట్ రొమాంటిక్ పాత్రలూ చేయగలడు తెలుసా..!!
  • భారత్ భాగ్య విధాత … ఫ్లాప్ … కంగనాపై నెగెటివిటీ తగ్గలేదు ప్రేక్షకుల్లో …
  • వైభవ్..! ఈ పేరంటేనే ఓ సంచలనం..! నడిసంద్రంలో కూడా..!!
  • శాంతి ఒప్పందం- యుద్ధవిరమణ… నో, మూడు దేశాల దోబూచులాట…
  • దివాళా అంచున దేశం… ఆ దిక్కుతోచని సర్కారు ఏం చేసింది…
  • మన పెట్రో బిల్లును ఎథనాల్ తగ్గించగలదా..? ఏమేం ప్రయోజనాలు..?!
  • రాజా రమేష్… సినిమా కథగా ఓ నిజ జీవిత థ్రిల్లర్… కానీ..?
  • పునర్జన్మ… మీరు నమ్మరా… పోనీ, ఈ రియల్ స్టోరీ ఓసారి చదవండి…
  • ఆకలి కడుపులకు అన్నపూర్ణ..! నచ్చిన రేవంత్ మరో పథకం..!!
  • CM Ramesh … అద్భుత వశీకరణ శక్తిమంతుడు… జై పాతాళ భైరవీ…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions