.
ముందుగా రామాయణంలో పిడకలవేట నుంచి మొదలు పెడదాం… తెలంగాణ ఐపీఎస్, డీజీపీ కాబోయి తృటిలో తప్పిన సీవీ ఆనంద్ ఓ పోస్టు పెట్టాడు… ‘బాలయ్యా సారీ’’ అని…! ఎందుకు..?
అప్పట్లో ఈయన ఐబొమ్మ రవిని పట్టుకోవడానికి స్పెషల్ ఆపరేషన్ నిర్వహించాడు… సినీ ప్రముఖులతో ఓ భేటీ ఏర్పాటు చేశాడు, కానీ దానికి బాలయ్య రాలేదు… ఆ మీటింగు ఫోటోలు, వివరాలు ఆనంద్ తన పర్సనల్ ఖాతాలో షేర్ చేసినప్పుడు ఎవరో కామెంటారు…
Ads
అసలే అసెంబ్లీలో ‘జగన్‌తో చిరంజీవి భేటీ’ మీద బాలయ్య వ్యాఖ్యల వివాదం వేళ… బాలయ్య ఆ భేటీలో లేడేమిటి అనడిగినట్టున్నాడు ఎవరో… దానికి ఆనంద్ మనిషి నవ్వుతున్న ఈమోజీ పెట్టాడు… దాన్ని వెటకారంగా భావించిన బాలయ్య ఫ్యాన్స్ ట్రోల్‌కు దిగారు…

ఇప్పుడు తను హోం శాఖ స్పెషల్ సీఎస్… నెట్‌లో ఈ వివాదం ఎక్కువయ్యేసరికి క్లారిటీ ఇచ్చాడు… ‘‘నా ఖాతాను వేరే వ్యక్తి హ్యాండిల్ చేస్తాడు, తను ఏదో ఈమోజీ పెట్టినట్టున్నాడు… బాలయ్యతో నాకు మంచి సంబంధాలున్నాయి… ఆ వ్యక్తిని తీసేశాను… ఇక ఈ వివాదానికి స్వస్తి పలకండి’’ అనేది ఆ పోస్టు సారాంశం…
ఇక అసలు విషయానికి వద్దాం… నిజంగా ఐబొమ్మ రవి అలియాస్ ఇమ్మడి రవి అరెస్టుతో తెలుగుజనం హేపీగా ఉన్నారా..? లేదు..! వాడొక రాబిన్ హుడ్… అడ్డగోలు టికెట్ రేట్లు, వ్యక్తి పూజ, హిపోక్రసీ, మబ్బుల్లో విహారాలు, బెనిఫిట్ షోలు, ఫ్యాన్స్ దోపిడీ, తోడుగా థియేటర్ల నిలువు దోపిడీ వంటి అనేక అంశాల్లో తెలుగు నిర్మాతలు, హీరోల మీద తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన నెగెటివిటీ ఉంది…
హాయిగా ఇంట్లో కూర్చుని ఐబొమ్మ లేదా బప్పం టీవీ చానెల్‌లో హెచ్డీ ప్రింట్లు చూసుకునే సౌలభ్యాన్ని తెలంగాణ పోలీసులు దూరం చేశారని ప్రేక్షకుల కోపం… ఇండస్ట్రీ పెద్దల నిర్వాకం కోణంలో చూస్తే, వాళ్ల దోపిడీతో పోలిస్తే ఇమ్మడి రవిది ఏమంత దోపిడీ..? (12 వేల కోట్ల నష్టం ఇండస్ట్రీకి అంటారుగానీ వాళ్ల వసూళ్ల లెక్కల్లాగే ఇవీ కాకిలెక్కలే…)
బట్, వోకే, తన టెక్నికల్ నాలెడ్జిని ఈ దొంగదారులకు వినియోగించాడు, చట్టరీత్యా నేరం… అక్కడివరకూ వోకే… కానీ నిజంగా తను ఎలా దొరికాడు..? ఎవరో ఏదో చెబుతున్నట్టు ఏవేవే కారణాలు కావు… ఏదో విడాకుల డాక్యుమెంట్ మీద సంతకాలు చేయాలి… దానికోసం వచ్చాడు, వస్తున్న విషయం తెలిసింది.,. భార్యే చెప్పి, పోలీసులకు సాయం చేసిందని వినికిడి…

వచ్చి అడ్డంగా ఇరుక్కున్నాడు… బుక్కయ్యాడు… సదరు ఐబొమ్మ, బప్పం మూతపడ్డాయి… ప్రతి నెలా 30 లక్షల మంది చూస్తారట తన సైట్లలో సినిమాలను…! నెటిజనంలో తీవ్ర వ్యతిరేకత… వాడు రాబిన్ హుడ్… అన్నీ సరేగానీ… ఏం సంపాదించాడు..? ఎంత సంపాదించాడు..?
తన తండ్రికి ఏమీ తెలియదు… ఒక్క పైసా కుటుంబానికి ఇవ్వలేదు… అసలు పెళ్లానికి విడాకులు ఇచ్చిన విషయం కూడా తండ్రికి తెలియదు… ఆ పేద తండ్రి మీడియాకు ఏమీ దాపరికం లేకుండా చెప్పుకున్నాడు… మరి ఎంత సంపాదించి ఏం సుఖం..? ఎవడికి ఉపయోగపడినట్టు..? పోనీ, తనకంటూ ఓ కుటుంబం కూడా లేదు..!!
తనకు ఓ పిచ్చి… సంపాదన కాదు తన టార్గెట్… పెద్ద పెద్ద సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్న సర్వర్ల మీద గ్రిప్ సంపాదించి, హెచ్‌డీ ప్రింట్లను పైరసీ సైట్లు, బప్పం టీవీలో పెట్టేసేవాడు… తరువాత టెలిగ్రామ్ చానెల్‌లో పెట్టి బెట్టింగ్ యాప్స్ యాడ్స్ పెట్టి డబ్బులు సంపాదించేవాడు…
జియో హాట‌్‌స్టార్ వంటి అత్యంత సేఫ్టీ ఫీచర్స్ ఉన్న సర్వర్లను కూడా కొల్లగొట్టేవాడు… అదొక పిచ్చి, అంతే… బ్యాంకులో 12 కోట్ల దాకా దొరికినట్టున్నాయి… బహుశా క్రిప్టో కరెన్సీలో 100 కోట్ల దాకా ఉండొచ్చునని అంచనా… అయ్య అవ్వకు పైసా ఇవ్వనివాడు ఎంత సంపాదిస్తే ఏం లాభం..? తనకంటూ ఓ కుటుంబం కూడా లేదు…
పైగా పెళ్లాంతో విడాకులు కాగానే తను పోలీస్ ట్రాకింగుకు దొరకకుండా కరేబీయిన్ దీవులకు, ఫ్రాన్స్‌కు వెళ్లి అక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నాడు… పోనీ, తన నేరం పట్ల ఏమైనా రిగ్రెట్స్ ఉన్నాయా..? నెవర్… పోలీసులు అడగ్గానే అన్నీ చెప్పేశాడు… నిజంగా వీడి తెలివిని దేశరక్షణకు ఉపయోగించుకుంటే ఎంత మేలు దేశానికి..!!

Share this Article