మరో హిందీ సినిమా ఢామ్ అన్నట్టుంది… షంషేరా… హిందీ సినిమాల ఫ్లాపుల పరంపర అనంతంగా అలా సాగిపోతూనే ఉంది… అలాగని తెలుగు ఫీల్డ్ ఏదో కలర్‌ఫుల్‌గా ఉందని కాదు… ఇక్కడా శోకాలే ఉన్నాయి… కొందరు బయటకు ఏడుస్తున్నారు… ఇంకొందరు లోలోపల కుమిలిపోతున్నారు… ఈ నేపథ్యంలో నిన్నటిదో మొన్నటిదో రిపోర్టు… ఇంట్రస్టింగుగా అనిపించింది… బాహుబలి-2 తరువాత ఓ ప్రచారం ప్రారంభమైంది…
మొత్తం సౌతిండియన్ సినిమాలు బాలీవుడ్‌ను తొక్కేసి, మొత్తం దేశవ్యాప్తంగా వసూళ్లను దున్నేస్తున్నాయి అనేది ఆ ప్రచారం… ఇలా సౌతిండియన్ సినిమాను హిందీలోకి డబ్ చేయడం, అది అలా కుమ్మేయడం అనేది ఓ నిత్యసత్యంగా ఏడుస్తున్నారు బాలీవుడ్ పెద్దలు… పుష్ప అనూహ్యమైన హిందీ హిట్ తరువాత ఈ ప్రచారం మరీ ఎక్కువైపోయింది… నిజమేనా..? హిందీలోకి డబ్ చేసిన ప్రతి సౌతిండియన్ సినిమా దుమ్ము రేపుతోందా..? లేదు, నెవ్వర్… అస్సలు నిజం కాదు…
ఈ సంవత్సరం సినిమాల్నే తీసుకుంటే హిందీలో మొత్తం ఫ్లాపులు అనేది నిజం కాదు… హిందీ సినిమాల్లో కఠియావాడి గంగూభాయ్, ది కశ్మీర్ ఫైల్స్, భూల్‌భులయ్యా-2 సక్సెస్‌లే… మరి సౌత్ నుంచి హిందీలోకి డబ్ అయిన సినిమాల పరిస్థితేమిటి..? కేజీఎఫ్్-2, ఆర్ఆర్ఆర్ మాత్రమే వసూళ్లను పిండుకున్నాయి… ఆ రెండూ సూపర్ హిట్ కాగా, మరో 9 డబ్ సినిమాలు డిజాస్టర్లు… మరి వాటేమిటి..?
Ads
బాక్సాఫీస్ ఇండియా రికార్డులను బట్టి చూస్తే… ఇవీ కొన్ని వసూళ్ల లెక్కలు
KGF: Chapter 2 – Rs 427 crore
RRR – Rs 275 crore
Radhe Shyam – Rs 17.41 crore
Major – Rs 9.6 crore (2 weeks)
Vikram: Hitlist – Rs 6 crore (2 weeks)
Beast (Raw) – Rs 2.3 crore
Valimai – Rs 2.1 crore
777 Charlie – Rs 1.65 crore (1 week)
Khiladi – Rs 1.4 crore
Etharkkum Thunindhavan (ET) – Rs 6 lakh
James – Rs 50 thousand
మేజర్ ఖర్చును, దాని వసూళ్లను బట్టి లెక్కేస్తే… అదీ సక్సెస్ కిందే లెక్క… విక్రమ్ తమిళం, తెలుగు వంటి సౌత్ భాషల్లో హిట్ అయ్యింది కానీ హిందీలో పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు… రాధేశ్యామ్ గురించి చెప్పనక్కరలేదు… ఇందులో 777 చార్లిని కూడా ఫ్లాప్ అనలేం… కన్నడం, తెలుగులో అది మంచి వసూళ్లను రాబట్టుకుంది… దాని ఖర్చు కూడా తక్కువే… మరీ ఘోరమైన డిజాస్టర్ అంటే జేమ్స్ సినిమా…
ఈ లెక్కలు ఏం చెబుతున్నాయి..? సౌతిండియన్ దర్శకులు తోపులు… వాళ్లేది తీసినా సరే, హిందీలో డబ్ చేసి వదిలితే చాలు వసూళ్ల వర్షాన్ని కురిపిస్తున్నాయి అనే ప్రచారం తప్పు… ఎస్, హిందీ సినిమాలు తన్నేస్తున్నాయి అనేది కరెక్టు… దానికి బాలీవుడ్ ఇంకెవరి మీదో పడి ఏడవడం దేనికి..? ప్రేక్షకుల అభిరుచిని పట్టుకోవాల్సిందే… తెలుగులో కూడా ఆ సమస్య ఉంది కదా… అది పాన్ ఇండియా సమస్య… పాండెమిక్ అనంతర సమస్య… హిందీలోనైనా రెండుమూడు మంచి హిట్లు పడితే, అదీ కొంత కుదుటపడొచ్చు… ఈ ఏడుపులు తగ్గొచ్చు…!!
Share this Article