.
స్మగ్లర్ పుష్పరాజ్ హిందీ బుల్లితెరపై విధ్వంసమే క్రియేట్ చేశాడు… అంటే వీక్షణాల్లో…! పెద్ద తెరపై 1800 కోట్ల వసూళ్లు అనే వార్తలు చదివాం కదా… సరే, ఆ లెక్కల్లో కొన్ని మాయలు, అతిశయోక్తులు కూడా ఉన్నాయేమో గానీ స్థూలంగా మొత్తం హిందీ సినిమా పరిశ్రమ కూడా షాక్‌తో చూస్తుండిపోయింది పుష్ప గారి వసూళ్ల వీరంగం చూసి… అది మాత్రం నిజం…
తాజాగా బుల్లి తెర మీద కూడా అంతే… ఇప్పటిదాకా టీవీ రేటింగుల్లో తోపు రికార్డులు ఉన్న సినిమాలను దాటేసి, కొత్త రికార్డులు క్రియేట్ చేశాడు పుష్పరాజ్…
Ads
500 కోట్ల మూవీ వీక్షణాల్లో పైన చూశారుగా… పఠాన్, యానిమల్, హిందీ సాలార్, మొన్నటి స్త్రీ2 సినిమాలను కూడా దాటేసి పుష్ప2 ఏకంగా 21.42 మిలియన్ల ఇంప్రెషన్స్, 44.98 మిలియన్ల రీచ్… అంటే టీవీలో బ్లాక్ బస్టర్…
5.1 టీవీఆర్ అంటే మామూలు రేటింగ్ కాదు… ఒకసారి ఈ పోలిక చూడండి… హిందీ స్పీకింగ్ మార్కెట్లో ఇది ఆల్‌టైమ్ రికార్డు… బహుశా ఇప్పట్లో మరో సినిమా దీన్ని సాధించడం కష్టమే… (సరళమైన భాషలో చెప్పాలంటే 5.4 కోట్ల మంది ఈ సినిమాను చూశారని రఫ్ లెక్క
)
తన పుష్ప1 రికార్డును తనే బ్రేక్ చేశాడు… ఈ బుల్లి తెరపై విజృంభణను ఆ టీమ్ ఇలా ట్వీట్ చేసుకుంది…
ఎందుకు విశేషంగా చెప్పుకుంటున్నాం అంటే… అసలు టీవీల్లో జనం సినిమాలు చూడటమే మానేస్తున్నారు… ఎప్పుడైతే ఓటీటీలు బాగా అందుబాటులోకి వచ్చాయో, అందులోని పలు సౌకర్యాలు సినిమా వీక్షణాన్ని మరింత సులభతరం చేశాయో… ఒకేచోట కట్టేసి ఉన్నట్టుగా టీవీల్లో సినిమాలు చూడటం జనానికి నచ్చడం లేదు…
పెద్ద పెద్ద తోపు హీరోల భారీ సినిమాలు సైతం అందుకే బుల్లి తెర రేటింగ్స్‌లో ఢమాల్ అంటున్నాయి… ఈ స్థితిలో కూడా పుష్ప2 తెలుగు టీవీ ప్రీమియం 12.61 టీవీఆర్ సాధించి అబ్బురపరిచింది…
ఇటీవల ముగిసిన ఐపీఎల్, టీ20 లీగ్ టీవీఆర్లను కూడా మించిపోయింది హిందీ పుష్ప2 బ్యాటింగ్… ఒకవైపు తమిళంలో కమలహాసన్, శంకర్, మణిరత్నం, సూర్య తదితరుల సినిమాలు తన్నేస్తుంటే… ఓ తెలుగు సినిమా రీసెంట్ డేస్‌లో ఇంత వసూళ్ల విధ్వంసాన్ని చూపడం విశేషమే… (థియేటర్, ఓటీటీ, టీవీ తదితర రికార్డులను వివరించే డాక్యుమెంటరీని పుష్ప టీమ్ రిలీజ్ చేసినా ఇంట్రస్టింగుగానే ఉంటుంది…)
ఒక పోలిక… బాహుబలి 1 కన్నా బాహుబలి 2 ఎక్కువ వసూళ్లు చేసింది… నిజానికి కథ, కథనంలో గ్రిప్, పాటల కోణంలో బాహుబలి1 సీక్వెల్కన్నా చాలా బెటర్… సేమ్, పాటలు, కొత్త కథ, గ్రిప్పింగ్ కథనం కోణంలో పుష్ప2 కన్నా పుష్ప1 పాపులర్… కానీ పుష్ప1ను మించి సీక్వెల్ దున్నేసింది… సీక్వెల్ కోసం ఇంట్రస్టు, దానిపై క్రియేటయ్యే హైప్ కొన్నిసార్లు ఇలా కలిసొస్తుందేమో..!
అల్లు అర్జున్, అట్లీ, దీపిక పడుకోన్ కాంబినేషన్‌తో రాబోయే సినిమాపై మరింత హైప్ ఇప్పటి నుంచే పెరుగుతోంది ఈ పుష్ప2 రికార్డుల నేపథ్యంలో…!
Share this Article