Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బన్నీ అరెస్టుతో కేటీయార్‌కు ఎందుకట నొప్పి..? జగన్ దోస్త్ అనేనా..?

December 13, 2024 by M S R

.

మెగాస్టార్, ఆయన భార్య…. నాగబాబు… అల్లు అరవింద్…. అందరూ అల్లు అర్జున్ ఉన్న స్టేషన్‌కు చేరారట… ఎస్, అదే చెప్పేది… వాళ్లూ వాళ్లూ ఒకటే… బన్నీ బర్సెస్ మెగా అని సోషల్ బజారులో తన్నుకునేవాళ్లు మూర్ఖులు… అర్థమవుతోందా…

.

Ads

ఒకడి వాదన… బన్నీ అంటే పీకేకు పడదు, పుష్ప2 బంపర్ హిట్టుతో ఈర్ష్య… తను చంద్రబాబుకు చెప్పాడు… చంద్రబాబు రేవంత్‌కు చెప్పాడు… రేవంత్ పోలీసులకు చెప్పాడు… అరెస్టు జరిగింది అట… వావ్…

లక్ష్మిపార్వతి కూడా అదే చెప్పింది… ఎస్, జగన్‌ను భ్రష్టుపట్టించిన అనేక వ్యక్తుల్లో ఒకతి… అసలు ఆమెకూ బన్నీ అరెస్టుకు ఏం సంబంధం..? దీన్నే పిచ్చి కూతలు అంటారు, కాస్త ఊరుకోమ్మా, పక్కకు వెళ్లు… మరీ కేఏ పాల్ తరహాలోకి దిగజారిపోకు…

బన్నీ మామూలు నేరస్థుడు కాడట కేటీయార్‌కు… అంటే ఏమిటో..? అంతర్జాతీయ నేరగాడు అనా..? ప్రతి విషయంలోనూ ఫాఫం మంచో కాదో కూడా తెలియనంత బయటపడిపోతున్నాడు చిన్నదొరవారు… కేటీయార్, థియేటర్ తొక్కిసలాటలో రేవతి మరణం సబబే అని భావిస్తున్నావా,..?

మీ వైసీపీకి దోస్త్ కాబట్టి బన్నీ మీవాడే అనుకుంటున్నావా..? రేవంత్ చర్య కాబట్టి ఖండిస్తున్నావా..? హ్యూమన్ యాంగిల్ ఏమీ అక్కర్లేదా..? పోలీసులకు చెప్పుకుండా హఠాత్తుగా వెళ్లి తొక్కిసలాటకు కారకుడైనవాడు శిక్షకు అనర్హుడా కేటీయార్..?

మరి మోహన్‌బాబు మాటేమిటి అంటారా..? ఏమో, కేటీయార్ ఏమీ స్పందించలేదు కదా… తనను అరెస్టు చేసినా ఇలాగే స్పందిస్తాడు… మొన్ననే చెప్పాడు రేవంత్… లా అండ్ ఆర్డర్ విషయానికి వచ్చినప్పుడు పెద్దా చిన్నా కేరక్టర్ల తేడా దేనికని..? సింపుల్… బన్నీ అరెస్టు…

పాన్ ఇండియా స్టార్లకు మామూలు నేరగాళ్లకు నడుమ చట్టానికి తేడా ఉండదు… ధనబలం ఉంది కాబట్టి గొప్ప లాయర్లు పెట్టుకోవడం మినహా వేరే మినహాయింపులు ఏమీ ఉండవు… ఒకవేళ పాలకుడు దయతలిస్తే తప్ప… అప్పట్లో వైఎస్ తనకు చంద్రబాబు అర్ధరాత్రి ఫోన్ చేసి అడిగాడని, అంతటి కాల్పుల కేసు నుంచే బాలయ్యను తప్పించాడు…

మరీ బీజేపీ రాజాసింగ్ కూడా లక్ష్మిపార్వతిలాగే మారిపోయినట్టున్నాడు… తనూ బన్నీ అరెస్టును ఖండించాడు… తను అంతకుమించి ఎదగడు…

మెగా కుటుంబం చట్టాలకు అతీతం ఏమీ కాదు… జనం విరగబడతారని తెలిసీ థియేటర్‌కు వెళ్లడం ఖచ్చితంగా అల్లు అర్జున్ తప్పు… అఫ్ కోర్స్, ఈ కేసులు నిలబడతాయా అనేది కాదు విషయం… చట్టం ఎదుట నిందితుడిగా నిలబడ్డావా లేదానేదే ముఖ్యం… పుష్పరాజ్ అనేదే నెగెటివ్ కేరక్టర్… పాత్రధారి కూడా ఆపాత్ర కేరక్టర్‌ను తలకెక్కించుకోకూడదు అనేదే ఈ మొత్తం కథలో నీతి..!!

దేవుడిగా భావించే ఫ్యాన్స్.. అపారమైన ధనసంపత్తి… బలమైన బ్యాక్ గ్రౌండ్… ఇవే కాదు, సమాజంలో చట్టం అని ఒకటి ఉంటుంది అనే భావన కూడా ప్రధానమే..!!

mohanbabu

ఇప్పుడు చూడాలిక రేవంత్ గట్స్ ఏమిటో… అరెస్టు చేయవద్దు, మోహన్‌బాబు కూడా మామూలు నేరస్థుడు కాడు అని ఇంకా శ్రీమాన్ కేటీయర్ ట్వీటలేదు… రేవతి మరణం పట్టదు, జర్నలిస్టులపై దాడి పట్టదు… కానీ సినిమావాళ్ల కాళ్లల్లో ముళ్లు మాత్రం కనిపిస్తుంటాయి ఫాఫం… నేషనల్ అవార్డు విన్నర్‌కు సడలింపులు, మినహాయింపులు ఉండవు హరీష్ గారూ..!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…
  • అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?
  • ఆ సైంటిస్టులందరూ ఎక్కడెక్కడ ఉన్నారో గానీ ఆనందిస్తూనే ఉంటారు…
  • నిజమే… ఆడ వారసులు ఐతేనేం… కేసీయార్‌కు అస్సలు నచ్చదా..?!
  • డ్రోన్ల యుద్ధమే కాదు… భీకరమైన సైబర్ యుద్ధానికీ దిగిన పాకిస్థాన్…
  • ఆట నుంచి క్రమేపీ దూరమవుతూ… ఆధ్యాత్మిక అంశాలకు దగ్గరగా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions