.
కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో మాత్రమే బీఆర్ఎస్, బీజేపీ అల్లు అర్జున్‌కు మద్దతుగా రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారనేది నిజమే అయినా… అదేమీ అల్లు అర్జున్ మీద సానుభూతి కాదు గానీ, కావాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓ ట్రాప్ వైపు నెట్టేసి బదనాం చేసే వ్యూహం అనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి…
సరే, ఆ రెండు పార్టీల ధోరణితో అల్లు అర్జున్‌కు ఒరిగేదేమీ లేదు, పైగా అల్లు అర్జున్‌ను మరింత గట్టిగా ఫిక్స్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది… ఇక్కడి దాకా వచ్చాక వెనక్కి తగ్గలేదు… తగ్గేదేలే అనాల్సిందే అదే పుష్పరాజ్ తరహాలో…
Ads
ఐతే ఈ మొత్తం వివాదం ఇండస్ట్రీకి చేసే నష్టం రకరకాల కోణాల్లో ఉండబోతోంది… ఏమో, మబ్బుల్లో విహరిస్తున్న స్టార్లను నేల మీదకు కూడా తీసుకురావచ్చు… ఫస్ట్, అడ్డగోలు ప్రీమియర్లు, బెనిఫిట్ షోలకు నో చాన్స్… ప్రభుత్వం క్లియర్ కట్‌గా చెప్పేసింది… భారీగా ఫ్యాన్స్ వచ్చే స్టార్ హీరోల ప్రిరిలీజ్ ఫంక్షన్లకూ అనుమతులు కష్టమే… నాలుగు గోడల నడుమ పరిమిత సంఖ్యలో అతిథులతో నిర్వహించుకోవల్సిందే…
(నిజానికి ప్రీమియర్ షోలు వేరు, బెనిఫిట్ షోలు వేరు… బెనిఫిట్ షోలు ఏదైనా కాజ్ కోసం చేసేవి… కానీ ఈ సినిమా ఇర్రెగ్యులర్ షోలు మొత్తం హీరో, నిర్మాతల జేబులు నింపుకోవడం కోసమే సాగుతున్నాయి… ఈ షోల రద్దు, టికెట్ రేట్ల పెంపుపై నిషేధం ఇండస్ట్రీకే మంచిదని ఎగ్జిబిటర్లు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు…)
టికెట్ రేట్ల పెంపు కూడా ఉండకపోవచ్చు… పెరుగుట విరుగుట కొరకే అన్నట్టుగా మొన్నటి పుష్ప రేట్ల పెంపు మరీ అడ్డగోలుగా ఉండి, చివరకు ఇప్పుడిలా విరిగిపడింది… ఐతే కాంగ్రెస్ ప్రభుత్వం కదా, మాట మీద నిలబడుతుందనే నమ్మకం లేదు గానీ… ప్రభుత్వం నుంచి ఏది పడితే ఆ సాయం గతంలోలాగా మాత్రం ఉండకపోవచ్చు… సంధానకర్తగా ఫిలిమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కొత్త చైర్మన్ దిల్ రాజు వ్యవహరించినా సరే..! (త్వరలో తన ప్రిస్టేజియస్ భారీ సినిమాలూ రాబోతున్నాయి…)
తెలుగు ఇండస్ట్రీకి మరోవిధమైన నష్టం పుష్ప2 బంపర్ హిట్ కారణంగా జరగబోతున్నది… ఇకపై స్టార్ హీరోల పాన్ ఇండియా సినిమాలు ఎలా ఉండాలో ఈ సినిమా ఓ బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది… రఫ్, రస్టిక్ లుక్… విలనీ లక్షణాలు… వెగటు పాటలు… దానికి తగిన స్టెప్పులు… హిందీ మార్కెట్ కోసంపాన్ పరాగ్, గుట్కా హీరోలు… లేదా మందు… అసాధారణ పైట్లు సరేసరి…
ఆమధ్య ఎవరో అసలు స్టార్ హీరో సినిమాకు కథ ఎందుకని అడిగాడు కదా… అంతే… కథ ఎలా ఉన్నా సరే, హై అనిపించే ఎలివేషన్ సీన్లను వరుసగా పేరిస్తే సరి… డౌట్ దేనికి..? పుష్ప3 కూడా ఇదే తరహాలో ఉండబోతోంది… అంతేకాదు, స్టార్ హీరోల పాన్ ఇండియా సినిమాల తీరే మారబోతోంది… కాస్త సంప్రదాయిక ధోరణిలో తీసేవాడు ఆరిపోవాల్సిందే…
యాక్షన్, ఎంటర్‌టెయిన్‌మెంట్… అంతే… స్టోరీ లేదా వోకే, లాజిక్ లేదా వోకే, అసభ్యంగా ఉందా వోకే… పుష్ప టాప్ కలెక్షన్లు హిందీ బెల్టు నుంచే కాబట్టి… ఆ నార్త్ రుచిమరిగారు కాబట్టి నిర్మాతలంతా అదే బాట ఇక… సో, సినిమా మరింత పొల్యూట్ కాబోతోంది…!!
Share this Article