Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పుష్పరాజ్‌… జబర్దస్త్ బ్యాచ్ కమెడియన్ కాదు… తన లెక్కలే వేరు…

May 15, 2024 by M S R

చాలామంది రాశారు… ముందుగా నమ్మలేదు… ఎక్స్‌లో నాగబాబు అధికారిక పోస్టే అని చూశాక ఆశ్చర్యం కూడా వేయలేదు… నాగబాబు ధోరణి అదే కాబట్టి… గతంలోనూ చూశాం కాబట్టి… కాకపోతే అల్లు అర్జున్ పేరు తీసుకోలేదు అందులో… ఐనా అందరికీ అర్థమైంది, నాగబాబు కోపపు ట్వీట్ అల్లు అర్జున్‌ను ఉద్దేశించే అని… అందరూ అదే రాసుకొచ్చారు…

అబ్బే, నేను జనరల్‌గా ట్వీటాను తప్ప, అల్లు అర్జున్‌ను ఉద్దేశించి కాదు అంటూ నాగబాబు ఖండించలేదు కాబట్టి ఖచ్చితంగా అది అల్లు అర్జున్‌ను ఉద్దేశించిన ఆగ్రహపు ట్వీట్, జనసైనికులను ఉసిగొల్పే ట్వీట్ అనేది నిరూపణైంది… మెగా ఫ్యామిలీకి సంబంధించి ఎవరిని తిట్టిపోయాలన్నా సరే నాగబాబును ముందుపెడుతుంటారు కదా… ఇదే అదేనన్నమాట…

ఒక గరికపాటి, ఒక యండమూరి, ఒక రాంగోపాలవర్మ… ఇలా ఎవరిని టార్గెట్ చేయాలన్నా నాగబాబే తెర మీదకు వస్తాడు.,. ఫాఫం, విమర్శల్ని, తిట్లను తను భరిస్తాడు… (అదే యండమూరి, మళ్లీ అదే మెగా బాస్ చిరంజీవి ఆత్మకథ రాయడానికి పూనుకుంటాడు, అది వేరే కథ…)

Ads

bunny

సరే, అల్లు అర్జున్ మీద నాగబాబు అండ్ ఫ్యామిలీకి కోపం ఎందుకొచ్చింది..? వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కోసం నంద్యాలకు వెళ్లాడు… అదీ కారణం… జనసేన కూటమి కోసం గాకుండా జనసేన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థికి మద్దతునిస్తావా..? ఇదీ కోపం… సరే, అల్లు అర్జున్‌కు సదరు శిల్పా రెడ్డి గారికి నడుమ స్నేహం, బంధుత్వం ఏమిటనేది ఇక్కడ అప్రస్తుతం… (అల్లు అర్జున్ రెడ్డి గారి అల్లుడే… భార్య పేరు స్నేహారెడ్డి)

వాస్తవానికి.. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి భార్య శిల్పా నాగిని రెడ్డి, అల్లు అర్జున్‌ సతీమణి స్నేహా రెడ్డి బెస్ట్ ఫ్రెండ్స్… వారిద్దరూ క్లాస్ మేట్స్‌ కూడా… దీంతో వారిద్దరి ద్వారా తరచూ బన్నీ, రవి చంద్ర కలుసుకునే వారు… అలా భార్యల మధ్య స్నేహంతో రవిచంద్ర, అల్లు అర్జున్‌ మంచి స్నేహితులు అయ్యారు… అప్పుడప్పుడు కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఇద్దరూ కలుస్తుంటారు… అంతా కలిపి ఫారిన్ ట్రిప్స్ కూడా వెళ్తుంటామని ఓ ఇంటర్వ్యూలో రవిచంద్ర తెలిపాడు…

అక్కడికీ తను శిల్పా రెడ్డి గారికి మద్దతు పలికితే విమర్శలు వచ్చిపడతాయని తెలుసు కాబట్టి ముందుగా పవన్ కల్యాణ్‌కు మద్దతుగా ఓ ట్వీట్ కొట్టి, తను స్వయంగా నంద్యాల వెళ్లిపోయాడు… అల్లు అరవింద్‌ ఈ పరిణామాలన్నీ ఊహించగలడు కాబట్టి తను తన సోదరి సురేఖ, మేనల్లుడు రాంచరణ్‌తోపాటు పిఠాపురం వెళ్లి పవన్ కల్యాణ్‌ను కలిశాడు… (సో, ఎవరు అధికారంలోకి వచ్చినా కుర్చీ వద్దకు వెళ్లడానికి వేర్వేరు రూట్లు క్లియర్… అరవింద్ ఎప్పుడూ తెలివైన వ్యాపారి..)

ఐనా కొన్ని తప్పవు… వెంకటేశ్ తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు, అదే ఏపీలో బీజేపీకి మద్దతు… తన కారణాలు తనకు ఉంటాయి… ఎస్, అల్లు అర్జున్‌కు కూడా వ్యక్తిగత ఇష్టాయిష్టాలు ఉంటయ్, ఉండాలి… తను మెగా ఫ్యామిలీ మెంబర్ అయినంత మాత్రాన తప్పకుండా పవన్ కల్యాణ్‌కూ జై అనాల్సిందేనా..? తనకంటూ సొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, పాన్ ఇండియా హీరో…

పైగా గతంలోనూ జనసేనకూ, బన్నీకి నడుమ గ్యాప్ ఉంది… ‘చెప్పను బ్రదర్’ అనే బాపతు వివాదం… (ఆ వివాదం లోతుల్లోకి ఇక్కడ వెళ్లడం అనవసరం కానీ…) రాజకీయాల్లో ఏదైనా సహజమే… సొంత భార్యాభర్తలే విభేదించుకుంటారు, అవసరమైతే ఒకేచోట పరస్పరం పోటీపడతారు… పరకాల ప్రభాకర్ బీజేపీకి పచ్చి వ్యతిరేకి, ఆయన భార్య నిర్మలా సీతారామన్ బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో కేబినెట్ మంత్రి… అదంతే…

పైగా ఏపీ పాలిటిక్స్ అంటేనే ఎవరు ఏ క్యాంపులో ఉంటారో, ఎవరు ఎటు జంపుతారో ఎవరికీ తెలియదు… అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు దూకడం కామన్… సో, తమ వ్యక్తిగత సంబంధాలు, ఇష్టాలను బట్టి బన్నీ ఎవరికి మద్దతునివ్వాలనేది తన చాయిస్… కానీ తన మీద భారీగా గతంలోలాగే ఇప్పుడూ ట్రోలింగ్… అక్కడికీ బన్నీ చెప్పాడు… ‘నాకు రాజకీయాలతో సంబంధం లేదు, వచ్చే ఉద్దేశం కడూా లేదు’ అని…!

bunny

నాగబాబు నేరుగానే విమర్శ చేయొచ్చు కదా మరి నచ్చకపోతే… మళ్లీ మార్మికత దేనికి..? ‘మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడే అయినా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే’ అట… మావాడు ఎలా అయ్యాడు..? కేవలం పవన్ కల్యాణ్ సొంత వదిన అన్న కొడుకుగా పుట్టినందుకేనా..? వోకే, ఐనంతమాత్రాన తను తప్పకుండా జనసేన పక్షానే ఉండాలా..? ఉండకపోతే పరాయివాడేనా..? అందుకే అనేది రాజకీయాల్లో రాణించడానికి పరిపక్వత, పరిణతి అవసరం అని..! తనేమైనా జబర్దస్త్ బ్యాచ్ కమెడియనా..?!

మెగా హీరోలు పలువురు వచ్చి ప్రచారం కూడా చేశారు కదా… అది వాళ్ల ఇష్టం… నిర్బంధం అవసరం లేదు… పైగా చాలా విషయాల్లో చిరంజీవికి, అల్లు అరవింద్‌కు నడుమ కూడా గ్యాప్ ఉందనే ప్రచారం కూడా ఉంది… ఉండొచ్చు, ఉండకూడదనీ ఏమీ లేదు… వ్యాపారం వేరు, రాజకీయం వేరు, బంధుత్వం వేరు… అన్నింటి నడుమ కనిపించని గీతలుంటాయి… మొరటుగా వాటిని చెరిపేసే ప్రయత్నాలు రాబోయే కాలంలో మరింత నష్టాన్ని కూడా కలుగజేసే ప్రమాదం కూడా ఉంటుంది… ఐనా నాగబాబు కదా, అంత లోతుగా వెళ్లడు, వెళ్లనివ్వరు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాటలు బాగుంటాయి… కానీ అసలు కథే సైకో ప్రేమలకు గ్లోరిఫికేషన్…
  • బుల్‌డోజింగ్ పాలసీకి ఆద్యుడే కేసీయార్… కేటీయార్ మరిచినట్టున్నాడు…
  • ఎంతసేపూ బాహుబలి ప్రమోషనే… మహాశయా, ఇస్రో రాకెట్ పేరు అది కాదు…
  • బంగారు తల్లులు..! ప్రత్యర్థులనూ ఓదార్చి, కన్నీళ్లు తుడిచిన వైనం..!!
  • ఒక్కసారి లిటిగెంట్ ముద్ర పడితే… ఎంతటి ప్రశాంత్ వర్మకైనా దెబ్బే..!!
  • అయ్యో ఉషాపతి..! సంసారంలో మంటబెట్టి, ఎగదోస్తున్న మీడియా..!!
  • స్మృతి మంధాన..! కప్ గెలుపు ప్రచారంలో ఎందుకో దక్కని ప్రాధాన్యత ..!!
  • వరల్డ్ కప్ గెలుపు సంబురాల్లో… ఈ వీల్ చైర్ భాగస్వామి ఎవరో తెలుసా..?
  • జస్ట్,, టైమ్‌ పాస్ పల్లీ బఠానీ… చిరంజీవి కదా… పైసలొచ్చేసినయ్…
  • అల్పపీడనాలు… అవి ప్రకృతి జారీ చేస్తున్న ప్రమాద హెచ్చరికలు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions