….. By……. Jagannadh Goud…………….. నయా అలెగ్జాండర్: అమెజాన్…!
ఒక ఇండియన్ కంపనీని ఇంకో ఇండియన్ కంపనీ కొనటం అమెరికన్ కంపనీ అమెజాన్ కి ఇష్టం లేదు, వాళ్ళు ఒక వెయ్యి కోట్లు పెట్టుబడులు పెట్టారు… బిగ్ బజార్, లైఫ్ స్టయిల్, ఫుడ్ బజార్ ఇవి అన్నీ కలిసిన ఫ్యూచర్ రీటైల్ అనే ఇండియన్ కంపనీని మరో ఇండియన్ కంపనీ రిలయన్స్ వాళ్ళు 25,000 కోట్లకి కొన్నారు. కాని ఫ్యూచర్ రీటైల్ లో ఒక వెయ్యి కోట్లు పడేసి, మాకిష్టం లేనివాళ్ళకి మేం పెట్టుబడులు పెట్టిన కంపనీని అమ్మకూడదు అని విదేశీ కంపనీ అమెజాన్ అంటుంది…
Ads
విదేశీయులు పెట్టుబడులు పెట్టాక ఆ కంపనీకి నష్టాలు వచ్చి, సర్వ నాశనం అయినా సరే, ఇంకోడు కొనకూడదు, కొంటే గింటే వాడే కొనాలి లేదా వాడికి ఇష్టం అయిన వాళ్ళే కొనాలి. ఇన్వెస్టర్లు, ప్రమోటర్లు, ఇటుక ఇటుక పేర్చుకుంటూ ఫ్యూచర్ రీటైల్ ని నిజాయతీగా నిర్మించిన కిశోర్ బియానీ, ఉద్యోగులు, లక్షలాది రీటైల్ ఇన్వెస్టర్లు సర్వ నాశనం అయినా ఏమీ కాదు… విదేశీయుడు పెట్టుబడి పెట్టాడు అంటే వాడి ఇష్టప్రకారమే అంతా..!
మన ఢిల్లీ హై కోర్ట్ కూడా అమెజాన్ హక్కులకి భంగం కలగకూడదు అని నిన్న తీర్పు ఇచ్చారు. మన వ్యవస్థల్లో అలా రాసి ఉంది, ఈ తీర్పుని 100% గౌరవించాల్సిందే; హాట్సాఫ్, జయహో ఇండియా.
కేంద్ర ప్రభుత్వం కూడా నిన్నటి బడ్జెట్ లో కొన్ని రంగాలలో 74% వరకు విదేశీ పెట్టుబడులు పెట్టొచ్చు అని పేర్కొన్నారు. రేపొద్దున బాత్ రూంకి వెళ్ళాలన్నా అమెజాన్ వాడిని అడిగి వెళ్ళాల్సిన రోజు వచ్చినా వస్తుంది. వాడు ఒకే అంటేనే పోవాలి, లేకపోతే లేదు…! తెలిసీ తెలియని జనాలు ఏమో ముఖేష్ అంబాని మీద సెటైర్లు, అంబానీకే న్యాయంగా ఇంకో ఇండియా కంపనీని కొనే దిక్కులేదురా నాయనా… ఆనాడు అలెగ్జాండర్ ప్రపంచంతో పాటు భారత్ ని జయించాడో లేదో కాని… ఈ నయా అలెగ్జాండర్ అమెజాన్ జెఫ్ బెజోస్ మాత్రం భారత్ ని జయించాడు. Alexander పేరులోని మొదటి అక్షరాలతో “Alexa” అని కూడా పెట్టుకున్నాడు ఈ నయా అలెగ్జాండర్ అమెజాన్… ఆనాడు బ్రిటీష్ వాళ్ళు వ్యాపారం పేరుతో పూర్తిగా దేశాన్ని దోసుకున్నారు. ఈ డు గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్, అమెజాన్, యూట్యూబ్ లాంటి సంస్థల “చెప్పు చేతుల్లో” మనం బతకాల్సి రావటాన్ని గౌరవంగా భావిస్తున్నాం! Dear GOD save this country, Amen… దేశం తగలబడుతుంది. ఓ దేవుడా కాపాడు అంటే… దేవుడు ఉండా లేడా అని తెలిసీ తెలియని “కొందరు” దిక్కుమాలిన చర్చలు… అసలు దేవుడు ఎందుకు..? అమెజాన్ జెఫ్ బేజోస్, మైక్రోసాఫ్ట్ సత్తయ్య, గూగుల్ పిచ్చయ్య, డెమోక్రాటిక్ కమలమ్మ ఉందిగా అని చతుర్లు. I am deeply hurt
Share this Article