ఒక వార్త… దేశంలోని అహ్మదాబాద్, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కత్తా, ముంబై, పూణె, ఢిల్లీ నగరాల్లోకి తన ఎయిర్ ఫైబర్‌ను తాజాగా విస్తరించింది… ఇవన్నీ సాఫ్ట్‌వేర్ కేంద్రాలు ప్లస్ పెద్ద నగరాలు… హాపెనింగ్ సిటీస్… తద్వారా రిలయబుల్ బ్రాడ్‌బాండ్, డిజిటల్ ప్రసారాలు, ఓటీటీల కోణంలో జియో గ్రిప్ ఇంకా పెరిగిపోయినట్టే… కేబుల్స్, దూరం, దూరప్రాంతాలకు ఓఎఫ్‌సీ లేకపోవడం వంటి అడ్డంకులు, సమస్యలకు ఇక సెలవు అన్నమాట… డైరెక్ట్ టు హోం… రియల్ డీటీహెచ్…
మరో వార్త… ఆల్‌రెడీ రిలయెన్స్ వాళ్ల వయాకామ్18 మీడియాకు క్రికెట్ ప్రసారాల హక్కుల్ని కోల్పోయాక ఇక డిస్నీ తమ మొత్తం వ్యాపారాన్ని రిలయెన్స్‌కు అమ్మేందుకు సిద్ధమవుతోంది… ఆల్‌రెడీ ప్రాథమిక చర్చలు జరగాయి… ప్రస్తుతం వినోదరంగంలో నంబర్ వన్‌గా ఉన్న హాట్‌స్టార్ కూడా ఈ డీల్ సక్సెసయితే ముఖేష్ అంబానీ గుప్పిట్లోకి చేరుకుంటుంది… ఫస్ట్ స్టార్ గ్రూప్ నుంచి అన్ని ఇండియా క్రికెట్ మ్యాచ్ లు అండ్ ఐపీఎల్ రైట్స్ కొట్టేసి, ఇప్పుడు హాట్ స్టార్ మరియు స్టార్ నెట్వర్క్ ని అగ్గువకు కొట్టేయడం తన స్ట్రాటజీ… ఆల్‌రెడీ పలు భాషల న్యూస్ చానెళ్లున్న ఈ గ్రూపుకి చెందిన న్యూస్18 దేశంలోకెల్లా నంబర్ వన్ న్యూస్ చానెల్ (రేటింగ్స్‌లో)…
డేటా… అనగా వినోదం, సమాచారం, డిజిటల్ వ్యాపారం, టెలికాం సర్వీస్… ప్రస్తుత సమాజానికి అత్యంత కీలకమైన రంగాలు ఇవి… వీటిపై రిలయెన్స్ పట్టు బ్రహ్మాండంగా పెరిగిపోయింది… రాబోయే రోజుల్లో ఇవన్నీ ఎవరి చేతుల్లో ఉంటే వాళ్లే చక్రవర్తులు… సమాచార చక్రవర్తులు… ప్రస్తుతం ముఖేష్ అంబానీ ఆ కుర్చీలో పదిలంగా కూర్చుని ఇంకా చక్రాలు తిప్పుతున్నాడు… పెట్రోకెమికల్స్, పవర్, రిటెయిల్, ఇతర కీలక పారిశ్రామిక రంగాల్లో కూడా ఆల్‌రెడీ అంబానీ టాప్…
Ads
దాదాపు మోనోపలీ… ఇక్కడే ఆదానీకి అంబానీకి నడుమ తేడా కనిపిస్తుంది… ఆదానీ ఎయిర్ పోర్టులు, మైనింగ్, షిప్ యార్డులు, గోదాములు వంటి రంగాల్లోకి విస్తరిస్తున్నాడు… బీజేపీతో సంబంధాల విషయంలో బదనాం అవుతున్నాడు… రేప్పొద్దున బీజేపీ అధికారం కోల్పోతే ఆదానీ సఫర్ అవుతాడు… కానీ ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే అంబానీ అదే సేఫ్ పొజిషన్‌లో ఉంటాడు… అదీ విశేషం… పైగా ఆదానీ విస్తరించే ఫీల్డ్స్ జనసామాన్యానికి పెద్దగా డైరెక్ట్ లింకున్నవి కావు… కానీ అంబానీ వ్యాపారాలన్నీ సమాజంలోని దాదాపు అన్ని సెక్షన్లనూ కవర్ చేసే ఇంపార్టెంట్ ఫీల్డ్స్…
మళ్లీ సమాచార రంగంలోకి వద్దాం… ఇది సమాచార యుగం… దాని ప్రాధాన్యత అంతా ఇంతా కాదు… డేటా లేనిదే ప్రస్తుతం సొసైటీకి ఊపిరాడదు… దేశమంతా ఆప్టిక్ ఫైబర్ పరిచేసిన అంబానీ ఇప్పుడు గాలిలో కూడా తన బ్రాడ్‌బ్యాండ్‌ను పరిచేస్తున్నాడు… అనగా వైర్‌లెస్… ఎయిర్‌టెల్‌కు కూడా డిజిటల్ వ్యాపారంలో చోటుంది… కానీ సర్వీస్ లోపాలు, రిలయెన్స్ స్థాయిలో విస్తరణ వేగం లేకపోవడంతో వెనకబడిపోతోంది… నిజానికి ఎయిర్‌టెల్ కాస్త తెలివిగా వ్యవహరిస్తే డీటీహెచ్, టెలికాం, బ్రాడ్‌బ్యాండ్ వంటి డేటా దందాలో రిలయెన్స్‌కు పోటీ ఇవ్వడానికి స్కోప్ ఉంది… దానికి ఎలాగూ వినోదరంగంలో ఆసక్తి లేదు, అడుగు వేసిందీ లేదు… కానీ ప్రవేశం ఉన్న డేటా వ్యాపారంలోనూ పోటీ ఇవ్వలేక చతికిలపడుతోంది…
ఒక జియో ఎయిర్ ఫైబర్ లేదా జియో ఫైబర్ కనెక్షన్ తీసుకుంటే… ఎయిర్‌టెల్, ఇతర సర్వీస్ ప్రొవైడర్లతో పోలిస్తే చౌక రేట్లకే… టీవీ చానెళ్లు, బ్రాడ్‌బ్యాండ్, ఓటీటీలన్నీ ఒకేచోట…. సో, రాను రాను సమాచార వ్యాపారంలో అంబానీయే కింగ్… ఈ కోణంలో తన లక్ష్యంలో చాలాదూరం వచ్చేశాడు..!!
Share this Article