నిజానికి అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే… భారతీయ వినోదరంగంలో రెండు దిగ్గజాలు భీకరంగా ఢీకొనేవి… కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులు, కౌరవుల పక్షంలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన పరిస్థితి ప్రతి రాజ్యానికి ఏర్పడినట్టే… వినోదరంగంలోని ప్రతి ప్లేయర్ ఏదో ఒక పక్షాన్ని ఎంచుకుని విలీనం కావడమో, అనుబంధం అయిపోయవడమో జరిగి ఉండేది…
- రిలయెన్స్ ప్లస్ హాట్ స్టార్…
- సోనీ లివ్ ప్లస్ జీ5
కానీ ఏం జరిగింది..? జీ5, సోనీ లివ్ విలీనం కాస్తా అటకెక్కింది… దాదాపు రెండేళ్లుగా సాగుతున్న విలీన ప్రయత్నాలు మూసుకునిపోయాయి… దాదాపు 85 వేల కోట్ల ఒప్పందం… దాదాపు 75 టీవీ చానెళ్లు, సినిమాలు, ఇతర కంటెంట్‌తో అది దేశంలోకెల్లా అతిపెద్ద వినోద సంస్థ అయి ఉండేది… ప్చ్, జరగలేదు…
రిలయెన్స్ ప్లస్ హాట్‌స్టార్ విలీనం ముగిసింది… సక్సెస్‌ఫుల్… రిలయెన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీ, వయాకామ్18 మీడియా సంస్థల నడుమ ఓ జాయింట్ వెంచర్ కుదిరింది… దీంతో స్టార్ ఇండియా, వయాకామ్18 కంటెంట్ సహా మొత్తం కలిసిపోతాయి… చానెళ్లు, స్పోర్ట్స్ ఒప్పందాలు, సినిమాలు, ఓటీటీలు గట్రా ఈ జాయింట్ వెంచర్ పరిధిలోకి వస్తాయి…
Ads
ఈ జాయింట్ వెంచర్ విలువ 70 వేల కోట్లు… ఇందులో దాదాపు 64 శాతం వాటా ముఖేష్ అంబానీదే… 36 శాతం డిస్నీది, అనగా హాట్‌స్టార్‌ది… తెలుసు కదా, భారతీయ వినోదరంగంలో స్టార్ టీవీ బలం… దాదాపు మోనోపలీ… ఇప్పుడిక అంబానీ తోడయ్యాడు… సో, దేశంలోని అనేకరంగాలపై అంబానీ పట్టు బిగిసినట్టే ఇప్పుడు వినోదరంగంపైనా తన పట్టు బిగిసింది… ఇందులో ఇక మోనోపలీ స్టార్టయినట్టే… సోనీ, జీ5 కలిసి ఉంటే కథ వేరే ఉండేది…
చాన్నాళ్లుగా ఇది పాత వార్తే… కానీ ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు… ఈ ముఖేష్ అంబానీ కొత్త వెంచర్‌కు ఆయన భార్య నీతా అంబానీ ఛైర్ పర్సన్‌గా వ్యవహరిస్తుంది… ఎందుకు మోనోపలీ అవబోతోందీ అంటే… ఈ ప్లేయర్ ఏది చెబితే అదే ఇక… సినిమాల రైట్స్ (డిజిటల్, టీవీ రైట్స్) విషయంలో వాళ్లు చెప్పిందే రేటు… టీవీ రంగంలో స్టార్ ఇండియా పట్టు తెలిసిందే కదా… కలర్స్, స్టార్ ప్లస్, స్టార్ గోల్డ్, వివిధ భాషల్లో స్టార్ చానెళ్లు… వెరీ బిగ్ ప్లేయర్స్…
ఇప్పుడిక జియో సినిమా, హాట్‌స్టార్ డిజిటల్ వేదికలు ఒక్కటయ్యాయి కాబట్టి మిగతా ప్లేయర్లకన్నా సాధనసంపత్తిలో ఎంతో ఎత్తులో ఉండే ఈ కొత్త సంస్థే టరమ్స్ శాసిస్తుంది… అంబానీ మార్కెటింగ్ ప్లాన్స్ ఎంత వ్యూహాత్మకంగా, తెలివిగా ఉంటాయో తెలిసిందే కదా… క్రమేపీ ప్రతి రంగాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకుని, మోనోపలీ దిశగానే తన అడుగులు ఉంటాయి… (ఆదానీకి వినోదరంగంలో ఇంకా పట్టుచిక్కడం లేదు… ఏదో ఎన్డీటీవీతో న్యూస్‌లోకి ప్రవేశించినా సరే, టీవీ, డిజిటల్, సినిమా రంగాలకు సంబంధించి తనకు అగ్రెసివ్ ప్లాన్స్ లేవు… కనిపించడం లేదు…)
ఈ అంబానీ వినోద వెంచర్‌కు ఇప్పుడు కంబైన్డ్‌గా 75 కోట్ల వీక్షకులు ఉన్నారు… బోధి ట్రీసిస్టమ్స్ కోఫౌండర్ ఉదయశంకర్ కూడా ఈ జాయింట్ వెంచర్ోతో జతకూడాడు… తను వైస్ ప్రెసిడెంటుగా మొత్తం వ్యవహారాలను పర్యవేక్షించబోతున్నాడు… ఏతావాతా చెప్పుకునేది ఏమిటయ్యా అంటే… సినిమాలు, టీవీలు, ఓటీటీలు, ప్రత్యక్ష ప్రసారాలు గట్రా దేశీయ వినోదరంగంలో అంబానీ మోనోపలీ స్టార్ట్ కాబోతోంది అని..!!
Share this Article