Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హేమయ్యా పరిమళ్ నత్వానీ… హేమిటిది..? ఏ క్యాహై అంబానీ సాబ్..?!

June 15, 2022 by M S R

అందరికీ తెలిసిన సమాచారం ఏమిటి..? విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెట్టడానికి మమతా బెనర్జీ ప్రయత్నిస్తోంది… నిజానికి పెద్ద పార్టీ కాంగ్రెస్ ఈ పనిచేయాలి… చేయలేకపోతోంది… మమత చేస్తోంది… ప్రజాస్వామిక స్పూర్తి ఏమిటంటే గెలిచినా ఓడినా సరే, పోటీపడాలి… సో, మమత రాజకీయ ప్రయత్నాల్ని ఖండించాల్సిన పనిలేదు… కానీ ఆమెకు ఆ క్రెడిబులిటీ లేదు…

శరద్ పవార్‌ను పెట్టాలని అనుకున్నారు… తను ఇంకా క్రియాశీల రాజకీయాల్లో ఉండాలట… ఓడిపోయే పోటీ వద్దట… అంటే ముందుగానే మోడీ అభ్యర్థి విజయాన్ని ప్రకటించేశాడు… తరువాత గోపాలకృష్ణ గాంధీ పేరు తెరపైకి తెచ్చారు… ఈ ఉగ్రవాద మద్దతుదారు గురించి మనం ఆల్‌రెడీ చెప్పేసుకున్నాం… మరో పేరు ఫరూఖ్ అబ్ధుల్లా అట… సూపర్… ఇక చెప్పనక్కర్లేదు…

ఆమె 8 మంది సీఎంలను పిలిస్తే ఒక్కరూ రాలేదు… టీఆర్ఎస్, ఆప్, బీజేడీ, అకాలీదళ్ లైట్ తీసుకున్నాయి… ఏవో సాకులు చెప్పాయి… కాంగ్రెస్ లోలోపల కుతకుతమంటున్నా సరే ఖర్గే, జైరాం, సూర్జేవాలాలను పంపించింది… ఎన్‌సీపీ, జేడీఎస్, ఎస్పీ, పీడీపీ, ఎన్సీల నుంచి ముఖ్యులు హాజరయ్యారు… ఒక్క ముక్కలో చెప్పాలంటే ‘‘ఏకగ్రీవ విపక్ష బలమైన అభ్యర్థి’’ అనేది అసాధ్యం అని తేలిపోయింది…

Ads

anti modi

అయితే ఫస్ట్ నుంచీ జరిగిన ప్రచారం ఏమిటి..? జగన్‌కు, చంద్రబాబుకు ఆహ్వానాలే రాలేదు అని… ఒకప్పుడు కేంద్ర రాజకీయాల్లో చక్రాలు తిప్పిన చంద్రబాబును ఇప్పుడు దేశంలో ప్రతి పార్టీ లైట్ తీసుకుంటోంది సరే… మరి జగన్..? తను బీజేపీ ఫోల్డ్‌లోని మనిషి అనే భావనతో మమత తనను వదిలేసిందా..? లేదు… జగన్‌కు కూడా ఆహ్వానం వచ్చిందట… అంబానీకి చెందిన న్యూస్18 ఎడిటర్ పల్లవీ ఘోష్ చెబుతోంది… ఓ ట్వీట్ పెట్టింది… సీబీఐ కేసుల భయంతో దానికి హాజరు కాలేనని జగన్ చెప్పినట్టు ఆమెకు విశ్వసనీయ వర్గాలు చెప్పాయట… ఇప్పుడు అది కాస్త వైరల్ అవుతోంది… ఆ ట్వీట్‌లోనే మమత జగన్‌కు రాసిన లెటర్ కాపీని యాడ్ చేసింది ఆమె…


this is according to tmc sources – ysr cong rejects this . Sources say they can’t share space with congress https://t.co/aMTQWJmOE7

— pallavi ghosh (@_pallavighosh) June 15, 2022


ఆ భేటీకి వెళ్లాలా వద్దానేది జగన్ ఇష్టం… నవీన్ వెళ్లకపోతే ఎవరూ ఏమీ అనడం లేదు కదా… ఒక పార్టీ తీసుకునే రాజకీయ నిర్ణయానికి అనేక లెక్కలు ఉండవచ్చు… కానీ ఇప్పటిదాకా అసలు జగన్‌ను పిలవలేదు అనుకుంటే… లేదు, లేదు, పిలిచారు, కానీ భయంతో వెళ్లలేదు అని చెప్పడం ఒకరకంగా జగన్‌కు ఇబ్బందికరమైన ట్వీటే… తనేమో అంబానీ మీద ప్రేమతో పాపం, ఓ రాజ్యసభ సీటు కూడా ఇచ్చాడు… వాళ్లతో సత్సంబంధాల్లో ఉన్నాడు…

మరి తన మీడియా ఇలా బదనాం చేయడం ఏమిటి..? ఆ ఎడిటరే సాక్షాత్తూ ట్వీట్ చేసి, ఇరుకునపడేయడం ఏమిటి..? హేమిటి హంబానీ సాబ్, హిదేమైనా మర్యాదగా ఉందా..? లేక పేకాట పేకాటే అంటారా..? జగన్ ఫాపం, రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో గుంభనంగా, గుట్టుగా వ్యవహరిస్తుంటే మీరే ఇలా బజారుకు లాగడం ఏమిటి సాబ్… బాగాలేదు…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…
  • అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?
  • ఆ సైంటిస్టులందరూ ఎక్కడెక్కడ ఉన్నారో గానీ ఆనందిస్తూనే ఉంటారు…
  • నిజమే… ఆడ వారసులు ఐతేనేం… కేసీయార్‌కు అస్సలు నచ్చదా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions