Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

186 అమెరికన్ బ్యాంకులు దివాలా దిశలో… అగ్రరాజ్యంలో ఆర్థిక సంక్షోభం…

March 20, 2023 by M S R

పార్ధసారధి పోట్లూరి ……….. 186 అమెరికన్ బాంకులు దివాళా దిశగా పయనిస్తున్నాయి ! సిలికాన్ వ్యాలీ బాంక్ ఎలా అయితే మూతపడే స్థితికి వచ్చిందో అదే రీతిలో మరో 186 బాంక్స్ కూడా మూత పడడానికి కావాల్సిన అన్ని సూచనలు కలిగి ఉన్నాయని ఒక సర్వే లో తేలింది ! సోషల్ సైన్స్ రీసర్చ్ నెట్వర్క్ [Social Science Research Network] అనే సంస్థ తన లేటెస్ట్ రిపోర్ట్ లో ఈ విషయం తెలిపింది.

ఎందుకిలా జరుగుతున్నది ? ‘Monetary Tightening and US Bank Fragility in 2023 అనే శీర్షికతో సోషల్ సైన్స్ రీసర్చ్ నెట్వర్క్ వివరంగా కారణాలని పేర్కొంది…

1. బాంకుల ఆస్తుల విలువ రోజు రోజుకి తగ్గిపోతున్నది. ఇది ఒక్కో రోజు భారీగా మరో రోజు నెమ్మదిగా జరుగుతున్నది.

Ads

2. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రెట్లు పెంచడం మరియు దానిని ప్రత్యేక డ్రైవ్ ద్వారా ప్రమోట్ చేయడం వలన ఖాతాదారులు ఫెడరల్ రిజర్వ్ లో డిపాజిట్లు చేయడానికి పరుగులు పెడుతున్నారు.

3. బాంకుల దగ్గర ఉన్న ట్రెజరీ నోట్స్ మరియు మార్టిగేజ్ లోన్ల విలువ తగ్గుతూ వస్తున్నది. బాంకుల దగ్గర ఉన్న వాటికంటే ఫెడరల్ రిజర్వ్ ఇచ్చే బాండ్స్ ఎక్కువ విలువ కలిగి ఉండడం మరో కారణం.

4. ఇక 186 బాంకులు తమ ఖాతాదారుల డిపాజిట్లని ఇన్స్యూరెన్స్ చేయకపోవడం మరో కారణం.

5. సగానికి సగం ఇన్స్యూర్ చేయని డిపాజిట్ దారులు తమ డిపాజిట్లని విత్ డ్రా చేసుకున్నా కూడా ఇన్స్యూరెన్స్ ఉన్న డిపాజిట్ దారులకి వాళ్ళ డబ్బుని వెనక్కి తిరిగి ఇచ్చేంత లిక్విడ్ కాష్ ఈ 186 బాంకుల దగ్గర లేదు. పోనీ ఈ బాంకుల దగ్గర ఉన్న ఆస్తులని వేరే చోట తాకట్టు పెట్టి అప్పు తీసుకొవాలన్నా ఈ బాంకుల దగ్గర ఉన్న ఆస్తులు [అసెట్స్ ] సరి పోవు.

6. అయితే ఈ రీసర్చ్ సంస్థ బాంకుల హెడ్జింగ్ ని లెక్కలోకి తీసుకోలేదు.

7. ఎలా చూసినా లేదా ఏం చేసినా సరే 300 బిలియన్ డాలర్ల విలువ చేసే డిపాజిట్లు ప్రమాదంలో ఉన్నాయి.

8. సిలికాన్ వ్యాలీ బాంక్ చాలా పటిష్టంగా ఉంది మిగిలిన 186 బాంకుల కన్నా… కానీ కుప్పకూలడాన్ని ఎవరూ ఆపలేకపోయారు.

*************************

ఎప్పుడో సంక్షోభం వచ్చేదాకా ఆగడం కంటే, ముందే ఫెడరల్ రిజర్వ్ కనుక ఈ 186 బాంకులలోకి కనీసమ్ 300 బిలియన్ డాలర్లని కనుక ఇస్తే తాత్కాలికంగా ఇవి మూత పడకుండా ఆపడానికి వీలు ఉంది. అయితే 300 బిలియన్ డాలర్లని పంప్ చేయడం ద్వారా పూర్తి స్థాయి ఫలితాలు వస్తాయన్న గ్యారంటీ ఏమీ లేదని తేల్చి చెప్పింది సదరు రీసర్చ్ సంస్థ.

సోషల్ సైన్స్ రీసర్చ్ నెట్వర్క్ [Social Science Research Network] వెల్లడించిన అంశాలు తాము చేసిన రీసర్చ్ కేవలం 186 బాంకులకే పరిమితం అంటూ మరో 19 బాంకులు కూడా వీటికంటే ఎక్కువ రిస్క్ తో పనిచేస్తున్నాయని తెలిపింది ! 2008 లో యూరోపులో వచ్చిన సంక్షోభం కంటే ఈసారి మరింత తీవ్ర స్థాయిలో ఉండబోతున్నట్లు తెలిపింది ! ఎందుకంటే యూరోపు బాంకుల్లో అమెరికన్ మార్కెట్ల లో పెట్టుబడి పెట్టినవి చాలానే ఉన్నాయి. చెయిన్ రియాక్షన్ ఉంటుంది ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా !

**************************

ముందు ఆమెరికన్ల మైండ్ సెట్ మారాలి !

ఈ మాట ఎందుకంటున్నాను అంటే మూతపడిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కి ఒక మహిళా ఉద్యోగి ఉన్నారు ఆమె పేరు ; జే ఎర్సెపా

[Jay Ersapah] మరియు ఈవిడగారి బాధ్యత ఏమిటంటే బాంక్ రిస్క్ లో పడకుండా తగిన సలహాలు సూచనలు మరియు ముందస్తు హెచ్చరిక ఇవ్వడం [Head of Risk Assessment ]. SVB లో ఈవిడగారిది పెద్ద పోస్టే ! కానీ తనకి అప్పగించిన బాధ్యతలని పక్కన పెట్టి డొనాల్డ్ ట్రంప్ మీద జోకులు వేయడం, హిందూ వ్యతిరేక సంస్థలకి నిధులు సమకూర్చడం, బ్లాక్ లైవ్స్ మాటర్ లాంటి వాటి మీద ఉపన్యాసాలు దంచడం… ఇలా అనేక పనికిమాలిన వాటి మీద పనిచేస్తూ వచ్చింది .. ఫలితం : బాంక్ మూత పడ్డది. ఇలా ఎందుకు ఈ విషయం ఇక్కడ ప్రస్తావించాల్సి వస్తున్నది అంటే ఇదే అమెరికన్ బాంకింగ్ రంగంలో పనిచేస్తున్న రఘురామరాజన్ ని తీసుకొచ్చి రిజర్వ్ బాంక్ గవర్నర్ గా నియమించింది సోనియా అండ్ కో!

************************************

ఎన్ని ఆంక్షలు విధించవచ్చో అన్ని ఆంక్షలు రష్యా మీద విధించినా, రష్యాలో ఏ బాంక్ కూడా మూతపడలేదు ఇప్పటివరకు. పైగా ఆదాయం కంటే ఎక్కువ ఖర్చుపెడుతూ వచ్చింది రష్యా యుద్ధం మీద ! కారణం ఏమిటి ?

డాలర్ తో లావాదేవీలు చేయకుండా ఉండడమే రష్యన్ బాంకులు మూతపడకపోవడానికి కారణం అయ్యి ఉండవచ్చు! అమెరికా, యూరోపు దేశాలతో కలిసి చివరకి జపాన్ కూడా రష్యా మీద ఆంక్షలు విధించినా రష్యా తన పని తాను చేసుకుంటూ పోతున్నది ! మరోవైపు చైనా, ఇరాన్ దేశాలు ఆర్ధిక మాంద్యం బారిన పడకుండా ఉన్నాయి !

వీలు ఉన్నంత వరకు డాలర్ తో లావాదేవీలు చేయకుండా చైనాతో కలిసి వాణిజ్యం చేయడానికి ఆఫ్రికా దేశాలు ముందుకు వస్తున్నాయి ! అయితే ఇవన్నీ ఇప్పటికిప్పుడు అమెరికాని కుంగదీసే అంశాలు కావు, కానీ డాలర్ సమాధికి పునాది రాళ్ళు పడుతున్నాయి అని చెప్పవచ్చు ! అమెరికా ఆర్ధిక సంక్షోభం పరోక్షంగా ట్రంప్ కి లాభం చేకూర్చవచ్చు… త్వరలో డొనాల్డ్ ట్రంప్ ని అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు ఇప్పటికే ఉన్నాయి !

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఔరా అక్కినేనీ… నాసిరకం ఉత్పత్తుల్లో నువ్వూ తక్కువేమీ కాదు….
  • పాక్ పీచమణిచిన S-400 కాదు… దాని తాత S-500 కూడా వస్తుంది…
  • ఇది నిజంగా బాపు తీసిన పాటేనా..?! ఆమె అసలు ఆ జయప్రదేనా..?!
  • వేలాడదలుచుకోలేదు… క్లియర్ ప్లానింగ్… జస్ట్, అలా వదిలేశాడు…
  • మోడీజీ… అన్నీ బాగానే చెప్పావు… కానీ ఆ ఒక్క ప్రశ్నకు జవాబు..?!
  • ఆ భూకంపాలు ప్రకృతి కోపమా..? అణ్వస్త్ర గోదాముకు పడిన తూట్లా..?!
  • నీకోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో… ఇదో వింత కథ…
  • ఏమాత్రం ధృవీకరణ లేని… ఓ డిటెక్టివ్ స్టోరీ ఫ్రం ఆపరేషన్ సిందూర్…
  • మళ్లీ ఓసారి ఈ దేశం ఈ ఐరన్ లేడీ ఇందిరని గుర్తుతెచ్చుకుంటోంది..!!
  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions