Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మెస్సీ పట్ల ఈ ‘ఫస్ట్ లేడీ’ అమర్యాదకర ప్రవర్తన..! నెటిజనం తిట్టిపోతలు..!!

December 16, 2025 by M S R

.

మెస్సీ పర్యటనలో మమత ఎలా అట్టర్ ఫెయిల్ అయిపోయి, అందరికీ క్షమాపణలు చెప్పిందో… పూర్తి భిన్నంగా హైదరాబాదులో తన పర్యటన ఎంత పద్ధతిగా, ఆహ్లాదంగా సాగిపోయిందో… ఆ పూర్తి కంట్రాస్టు గురించి చెప్పుకున్నాం కదా ఆల్రెడీ… మీడియా, సోషల్ మీడియా కూడా హైదరాబాద్ షో నిర్వహణను ప్రశంసించింది కదా…

కోల్‌కత్తాలో ‘ప్రివిలేజ్ సెల్ఫీల ప్రహసనం’ ఎంత నవ్వులపాలైందో… మెస్సీ ముంబై పర్యటన కూడా అలాగే వివాదాస్పదమైంది… కాకపోతే ఇక్కడ ఒకే ఒక్కరు దీనికి కారణం… వాళ్లెవరో కాదు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ భార్య అమృత… నెటిజనం ఆమె అమర్యాదకరమైన ప్రవర్తనను తిట్టిపోస్తున్నారు… ఏమాత్రం డీసెన్సీ లేని మహిళగా ఆక్షేపిస్తున్నారు…

Ads

అదీ తేడా… ఒక కలకత్తాకు ఒక హైదరాబాదుకు… ఒక హైదరాబాదుకు ఒక ముంబైకి…!! మెస్సీ భారత పర్యటన, మైదానంలో ఆనందం కంటే, మైదానం వెలుపల రాజకీయ ప్రముఖుల ‘ప్రివిలేజ్డ్ సెల్ఫీ’ల కారణంగానే పెద్ద చర్చనీయాంశమైంది… సాధారణ అభిమానులు మెస్సీని ఒక క్షణం చూడటానికి క్యూలలో నిలబడగా, ప్రయాసలకు గురి కాగా… కొందరు ప్రముఖులు మాత్రం తమ అధికారిక హోదాను ఉపయోగించి మర్యాద మరచి వ్యవహరించడం ప్రజాగ్రహానికి కారణమైంది…

ముంబైలో మర్యాద మరచిన ‘ఫస్ట్ లేడీ’

అమృత ఫడ్నవీస్ వ్యవహారం ముంబైలో, వాంఖేడే స్టేడియంలో… ఈ వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచింది… ఎగ్జిబిషన్ మ్యాచ్ సందర్భంగా అమృత ఫడ్నవీస్ మెస్సీతో సెల్ఫీ తీసుకునేందుకు చేసిన ప్రయత్నం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది… ఆమె చూయింగ్ గమ్ నములుతూ ఉండటం, సెల్ఫీ కోసం పక్కనే ఉన్న అర్జెంటీనా ఆటగాడు రోడ్రిగో డీ పాల్ను పక్కకు జరగమని సూచించడం వంటి చర్యలు విమర్శలకు తావిచ్చాయి…

ఈ చర్యను నెటిజన్లు తీవ్రంగా ఖండించారు… ముఖ్యమంత్రి సతీమణిగా అంతర్జాతీయ అతిథి పట్ల ఆమె వ్యవహరించిన తీరు “మర్యాదరహితంగా” ఉందని, ఇది ‘ప్రివిలేజ్డ్ బిహేవియర్’ (విశేషాధికార ప్రవర్తన) అని, దేశానికి అవమానకరమని పలువురు ట్వీట్లు చేశారు… ఆమె తన హోదాను అడ్డుపెట్టుకుని, మెస్సీ వ్యక్తిగత స్పేస్‌ను కూడా ఉల్లంఘించారని ఆరోపణలు వచ్చాయి… (ఆమెకు వివాదాలు కొత్త కాదు… ఆమధ్య వల్గర్ డ్రెస్సింగుతో అభాసుపాలైంది ఓ సందర్భంలో… ఇదీ లింకు…)

కలకత్తాలో టీఎంసీ నేతల హడావుడి

మెస్సీ కలకత్తా పర్యటనలో కూడా ఇలాంటి దృశ్యాలే కనిపించాయి… ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీకి చెందిన పలువురు నేతలు, మంత్రులు తమ అధికారిక వాహనాలను ఉపయోగించి మెస్సీ ఉన్న ప్రాంతంలోకి దూసుకురావడం, తమ భద్రతా వలయాన్ని దాటుకుని మరీ సెల్ఫీలు తీసుకోవడానికి ప్రయత్నించడం వివాదాస్పదమైంది…

మెస్సీని చూడటానికి గంటలుగా వేచి చూసిన సాధారణ ఫుట్‌బాల్ అభిమానులకు దీంతో నిరాశే మిగిలింది… అది కాస్తా ఆగ్రహానికి, స్టేడియంలో ధ్వంసానికి, ఉద్రిక్తతకు దారితీసింది… ఈ ‘సెల్ఫీ వివాదాలు’ అంతర్జాతీయ స్థాయిలో మన ప్రముఖులు ప్రదర్శించిన అనవసర హడావుడిని, మర్యాద లేని ప్రవర్తనను ఎత్తి చూపాయి, మెస్సీ పర్యటనను కేవలం ‘ప్రివిలేజ్డ్ సెల్ఫీల ప్రహసనంగా’ మార్చేశాయి…

amrita fadnavis

లియోనెల్ మెస్సీ భారత పర్యటనను స్వాగతించిన నగరాల్లో హైదరాబాద్, ముంబై, కలకత్తా ఉన్నాయి… అయితే, ఈ మూడు నగరాలలో మెస్సీ పర్యటనల నిర్వహణ, ప్రముఖుల ప్రవర్తనలో ఆకాశానికి, నేలకు ఉన్నంత తేడా కనిపించింది… హైదరాబాద్ పోలీసులు పాటించిన కట్టుదిట్టమైన క్రమశిక్షణ (డిసిప్లిన్) కారణంగా షో సరదాగా, వివాదాలు లేకుండా ముగిస్తే… ముంబై, కలకత్తాలో ప్రముఖుల ‘ప్రివిలేజ్డ్ యాక్సెస్’ ప్రహసనం పెద్ద దుమారాన్ని రేపింది…

హైదరాబాద్‌లో మెస్సీ పర్యటన వివాద రహితంగా జరిగింది… దీనికి ప్రధాన కారణం తెలంగాణ పోలీసులు అనుసరించిన కఠినమైన ప్రణాళిక…

 తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి స్వయంగా రంగంలో దిగి, కోల్‌కత్తా చేదు అనుభవాల నేపథ్యంలో కట్టుదిట్టాలు, కట్టుదిట్టమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు… రాజకీయ ప్రముఖులు లేదా వారి కుటుంబ సభ్యులు తమ హోదాను ఉపయోగించి మెస్సీకి అనవసరంగా దగ్గరయ్యే ప్రయత్నాలను సమర్థవంతంగా అడ్డుకున్నారు…

షో అనధికారికమైనప్పటికీ, ప్రముఖులు, ఆటగాళ్లకు మధ్య పాటించాల్సిన కనీస మర్యాద, దూరం పాటించబడింది…స్థానిక ప్రముఖులు కూడా భద్రతా నియమాలను గౌరవించి, అనవసరమైన హడావుడి చేయకుండా సంయమనం పాటించారు… ఫలితంగా, షో ప్రధాన లక్ష్యం – ఫుట్‌బాల్ ఆటను ఆస్వాదించడం – సజావుగా నెరవేరింది…

నిజమైన ఫుట్‌బాల్ అభిమానులు మెస్సీ ఆటను, తనను చూడాలని కోరుకుంటే, ఈ ‘విఐపి సెల్ఫీ హంటర్ల’ కారణంగా ముంబై, కలకత్తా పర్యటనలు ఫుట్‌బాల్ పండుగగా కాకుండా, ప్రివిలేజ్డ్ యాక్సెస్ ప్రహసనంగా మిగిలిపోయాయి… హైదరాబాద్ నిర్వహణ మాత్రం, క్రమశిక్షణతో కూడిన ప్లానింగ్ ఉంటే ప్రపంచ స్థాయి ఈవెంట్‌లను వివాదాలు లేకుండా ఎలా నిర్వహించవచ్చో నిరూపించింది…



Not so dear @fadnavis_amruta, your appearance as First Lady of Maharashtra was utterly irritating & shocking…

Chewing gum in front of those gentlemen? I mean why? what were you trying to prove?
Have some decency in life please…!pic.twitter.com/CwHnXa7Bzr https://t.co/ezFaICZ7yq

— Archana Pawar 🇮🇳 (@SilentEyes0106) December 14, 2025

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వావ్… తొలిసారిగా ఓ ‘ప్రెస్‌’టీజియస్ పోస్టులోకి లేడీ జర్నలిస్ట్..!
  • స్క్రిప్టెడ్ లవ్‌ట్రాక్ కాదు… సైలెంటుగా చిగురించి పెనవేసుకున్న బంధం..!
  • జుహీ చావ్లా తొలి తెలుగు సినిమా… అదీ సూపర్ స్టార్ డైరెక్షన్‌లో…
  • మెస్సీ పట్ల ఈ ‘ఫస్ట్ లేడీ’ అమర్యాదకర ప్రవర్తన..! నెటిజనం తిట్టిపోతలు..!!
  • ఎవరూ అడుగుమోపని… ఆ మార్మిక కైలాస పర్వతం ఎక్కిన ఏకైక వ్యక్తి..!!
  • 55 ఏళ్ల క్రితం గల్లంతు..! ఆ అణు పరికరం కథ తెలిస్తే నేటికీ వణుకే..!!
  • నందమూరి దిష్టి తమన్… తెలియకపోతే అన్నీ మూసుకోవాలి బ్రదర్..!!
  • మూడు తెలుగు సినిమా పాటలు- ఒక నోస్టాల్జియా… అజరామరం…
  • నకిలీలకే ‘మెరుపు’లెక్కువ..! ముగ్గురు గరల్‌ ఫ్రెండ్స్, గర్భాలు..!!
  • తెలంగాణ గ్రామీణ వోటరు ఏం చెబుతున్నాడు..? ఇదీ క్లారిటీ..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions