చాలామంది సినిమా ఇండస్ట్రీ వాళ్లకు భీముడి పాత్ర అంటే… భారీ ఆకారం ఉండాలి… అంతే… ఓ సుమో తరహాలో లేదా ఓ మల్లయోధుడి తరహాలో ఆకారం ఉండి, గద పట్టుకుని అటూ ఇటూ తిరుగుతూ ఉంటే చాలు… నిజానికి భీముడి పాత్ర మహాభారతంలో చాలా విశిష్టమైనది… అసలు తన కథే మహాభారతం అన్నట్టుగా చెప్పొచ్చు… అందుకే ఆమధ్య ఎవరో కేరళ బడా నిర్మాత భీముడి కోణంలోనే మహాభారతాన్ని 500 కోట్లతో నిర్మించాలని అనుకున్నాడు… ఇండస్ట్రీలో భీముడి పాత్ర ఎలాంటిదో… నిజంగానే ఈ టీవీ భీముడి జీవితమూ అలాగే గడిచిపోయింది…
టీవీ భీముడు అంటే ఈ తరానికి తెలియదు… అప్పట్లో, అంటే 1988లో దూరదర్శన్‌లో బీఆర్ చెప్రా మహాభారత్ సీరీస్ నిర్మించాడు… అప్పట్లో పెద్ద హిట్… మొన్న లాక్ డౌన్ పీరియడ్‌లో పునఃప్రసారం చేస్తే మళ్లీ సూపర్ హిట్… నిజానికి ఆ భీముడి పాత్రకు ప్రవీణ్ కుమార్ సొబ్తిని ఎన్నుకోవడమే తన ఆకారం ప్లస్ తను అంతకుముందు చేసిన సినిమాల పాత్రల్ని చూసి..! ఆ టీవీ సీరిస్‌కు ఏడేళ్ల ముందు నుంచే ప్రవీణ్ సినిమాల్లో నటిస్తున్నాడు…
ఎంతసేపూ పెద్ద సైజు గుండాలా కనిపించే ప్రధాన అనుచరుడు లేదా అనుచరుల గ్రూపు సభ్యుడిగానే కనిపించేవాడు… దాదాపు యాభై సినిమాలు చేస్తే ఒక్కటీ చెప్పుకోదగిన పాత్ర లేకపోవడం ఓ విషాదం… తను తెలుగులో కూడా ఓ సినిమా చేశాడు… కిష్కింధకాండ..! మహాభారత్ సీరియల్ తరువాత మరికొన్ని సినిమాల్లోనూ భీముడి పాత్రలే ఇచ్చారు… 2013లో బర్బరీకుడి పేరిట సినిమా తీస్తే అందులో కూడా భీముడు ప్రవీణే… 74 ఏళ్ల వయస్సులో సోమవారం రాత్రి చనిపోయాడు తను…
Ads
నిజానికి తనను ఓ నటుడిగా కాదు గుర్తించాల్సింది… తనే మంచిపేరును సినిమాల్లో పిచ్చి పిచ్చి పాత్రలు చేసి చెడగొట్టుకున్నాడని అనిపిస్తుంటుంది… తను ఒరిజినల్‌గా ఓ సైనికుడు… బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో డిప్యూటీ కమాండెంట్ వరకూ చేశాడు… దీనికన్నా తనకు ఓ క్రీడాకారుడిగా కూడా మంచి పేరుంది… హ్యామర్, డిస్కస్ త్రో విభాగాల్లో రెండుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్నాడు… ఆసియన్ గేమ్స్‌లో రెండు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం… అర్జున అవార్డు విజేత…
ఒక దశలో తను ఏం చేయాలో తేల్చుకోలేకపోయాడు… రాజకీయాల్లోకి వచ్చాడు… ఫస్ట్ తనే ఓ పార్టీ పెట్టాలని అనుకున్నాడు, కానీ ఎందుకో మనసు మార్చుకుని 2013లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరాడు… ఢిల్లీ ఎన్నికల్లో నిలబడ్డాడు కూడా… ఓడిపోయాడు… తరువాత బీజేపీలోకి జంపయ్యాడు… ఇలా జీవితమంతా ఓ దశ, ఓ దిశతో… నిలకడ లేని ధోరణితోనే సాగిపోయింది… చివరకు 74 ఏళ్ల వయస్సులో నిన్న ఆగిపోయింది…!!
Share this Article