Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

లేచిపోలేదు… పారిపోలేదు… నిలబడ్డారు, ఒప్పించారు, పెళ్లాడారు…

January 19, 2025 by M S R

.

( రమణ కొంటికర్ల )..   …. కొన్ని ప్రేమకథలు సినిమాల కన్నా నిజజీవితంలో ఇంకా అందంగా ఉంటాయి. అలాంటిదే చిరాగ్ గుప్తా, అదితి మమెన్ ప్రేమకథ.

అదితి మమెన్ ఓ మళయాళీ. చిరాగ్ గుప్తా పంజాబీ. ఈ ఉత్తర, దక్షిణ ధృవాలు ఆరిజిన్ న్యూట్రీషన్ అనే స్టార్టప్ వ్యవస్థాపకులు.

Ads

స్నేహం ప్రేమగా చిగురించిన్నాట్నుంచీ ఆరిజిన్ న్యూట్రీషన్ వ్యాపారాన్ని నిలబెట్టేవరకూ ఈ ఇద్దరూ భాగస్వాములే. కానీ, వీరిద్దరూ వివాహబంధం రిత్యా ఒక్కటయ్యేందుకు ఎదుర్కొన్న సవాళ్లు మాత్రం ఎన్నెన్నో. అందుకే వీరి లవ్ స్టోరీ సినిమాలను మించిన ఇంట్రెస్టింగ్ కథ.

చిరాగ్ గుప్తా పంజాబీ హిందూ కుటుంబానికి చెందినవాడైతే.. అదితి మమెన్ కేరళకు చెందిన క్రిస్టియన్ అమ్మాయి.

వీరిద్దరూ చదువుకునే సమయంలో స్నేహితులయ్యారు. ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారింది. పైగా వీరిద్దరూ తమ తండ్రిని చిన్ననాటే కోల్పోవడంతో ఒక ఎమోషనల్ బాండ్ కూడా ఏర్పడింది. కానీ, వీరి వివాహానికి మాత్రం ఇరు కుటుంబాలూ ససేమిరా అన్నాయి. అలా అని వీరిద్దరూ చాలామంది జంటల్లా లేచిపోలేదు. కుటుంబాలకు దూరంగా బతకలేదు. అసాధ్యమని తేల్చేసిన కుటుంబాల్లో పరివర్తన తీసుకొచ్చారు. పట్టుబట్టి కుటుంబాలను ఒప్పించారు. అందుకు ఏకంగా 15 ఏళ్ల సమయం పట్టింది.

ఆ పదిహేనేళ్ల కాలంలో ఎలాంటి బ్రేకప్ లకు తావివ్వని స్వచ్ఛమైన ప్రేమ చిరాగ్, అదితిది. తమ స్వచ్ఛమైన ప్రేమతోనే మతం గోడలు బద్ధలుకొట్టారు. అయినవాళ్లను ఒప్పించారు. కాదు, వీరి ప్రేమ ముందు మతం ఎంతమాత్రం గొప్పకాదని ఇరు కుటుంబాలు విశ్వసించాయి. అందుకు పదిహేనేళ్లు పట్టింది. అయితేనేం, వీరిద్దరూ 15 ఏళ్ల తర్వాత వివాహం చేసుకున్నారు. కానీ, ఇక్కడితో వీరి ప్రేమకథ ముగిసిపోలేదు.

పెళ్లి ఆ తర్వాత ఇద్దరు పిల్లలు.. ఇలా సాగిపోతున్న సంసార ప్రేమకథలో ఏదో చేయాలన్న తలంపు.. ఇద్దరి ఫ్రీక్వెన్సీ ఒకటే అవ్వడంతో ఒక స్టార్టప్ ప్రారంభించాలనుకున్నారు. అది 2020 కరోనా సమయం కావడంతో ప్రోటీన్స్ ఉన్న న్యూట్రీషన్ ఫుడ్ పైన ఈ జంట దృష్టి పడింది. దాంతో ఆరిజిన్ న్యూట్రిషన్ అనే స్టార్టప్ కు నాంది పడింది. అలా వీరికి మూడో బిడ్డలా ఆరిజిన్ న్యూట్రిషన్ మారిపోయింది.

ఆరిజిన్ న్యూట్రిషన్ జననం!

ఆరిజిన్ న్యూట్రిషన్ ఆలోచన అవసరం, అభిరుచి నుండి పుట్టింది. కరోనా కాలంలో ప్రతీది అనుమానించే పరిస్థితుల్లో.. మార్కెట్ లో శుచిగా ఉండే కూరగాయలు లభించకపోవడం, లాక్టోస్ అధికంగా ఉండే పాల ఉత్పత్తులు ఇవన్నీ ప్యూర్ వెజిటేరియన్ అయిన చిరాగ్ లో అసహనానికి కారణమయ్యాయి.

అదిగో అక్కడే మంచి ప్రోటీన్స్ తో హైజీన్ న్యూట్రీషన్ ఫుడ్స్ కు సంబంధించిన ఒక వ్యాపార సంస్థను ప్రారంభిస్తే ఎలాగుంటుందన్న ఆలోచన రేకెత్తింది. అదే విషయాన్ని భార్య అదితికి చెబితే.. అంతకుముందే అదితికి కేరళలో ఇలాంటి ఫుడ్ బిజినెస్ అనుభవముండటంతో ఆమె సరేనంది.

లెట్స్ మేక్ ఇట్ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అదితి.. న్యూట్రీషన్ ఫుడ్ కు సంబంధించిన ఉత్పత్తి, క్రియేటివ్ కాంటెంట్ పై దృష్టి పెడితే.. చిరాగ్ తమ సంస్థ ఉత్పత్తులను మార్కెట్ చేసే పనిలో పడ్డాడు.

ఆరిజి న్యూట్రీషన్ సంస్థ విక్రయించే ప్రోటీన్ న్యూట్రీషన్ ఫుడ్ కోసం ఈ జంట ఎన్నో ప్రయోగాలు చేసింది. నెలల తరబడి చేసిన ప్రయోగాల తర్వాత ఒక స్పెసిఫిక్ రుచి, ఆరోగ్యపరంగా బెనిఫిట్స్ అందే విధంగా వెనీలా కోకోనట్ బర్ఫీ, హైజీన్ ఇడ్లీ, వేగన్ స్ట్రాబెర్రీ పాయసం,హై ప్రోటీన్ క్యారెట్ హల్వా, హై ప్రోటీన్ మూంగ్లెట్ పిజ్జా, హై ప్రోటీన్ బీట్రూట్ టిక్కీ, మ్యాంగో ప్రోటీన్ ఐస్ పాప్స్, హై ప్రోటీన్ చాక్లెట్ కేక్స్, హై ప్రోటీన్ బేసన్ చిల్లా పేర్లతో రకరకాల న్యూట్రీషన్ బై ప్రోడక్ట్స్ ను పూర్తిగా సేంద్రీయ పంటల నుంచి తయారుచేసి కొత్త కొత్త రుచులను పరిచయం చేశారు. ఇప్పుడు ఈ కామర్స్ ఫ్లాట్ ఫామ్స్ అన్నింటిలోనూ మీకు ఆరిజిన్ న్యూట్రిషన్ కంపెనీ తయారుచేసే అన్ని బై ప్రోడక్ట్స్ అందుబాటులో ఉంటాయి.

ఇద్దరు నైపుణ్యం కల్గిన వ్యక్తులు ప్రేమలో పడి, తమ ప్రేమను ఏళ్ల తరబడి నిరీక్షించినా సాకారం చేసి, ఆ తర్వాత తమకంటూ ఓ అస్తిత్వాన్ని చాటిచెప్పేలా ఓ కొత్త వ్యాపారాన్ని ప్రారంభించి, ఆ స్టార్టప్ లో సక్సెస్ సాధించి… ఒక సినిమాను మించిన సక్సెస్ ఫుల్ లవ్ స్టోరీగా నిల్చారు కేరళ అమ్మాయి అదితి మమెన్, పంజాబ్ అబ్బాయి చిరాగ్ గుప్తా.

అందుకే ఇప్పుడు వీరిద్దరి ప్రేమకథకు హ్యూమన్స్ ఆఫ్ బాంబే అనే ఫోటో అండ్ స్టోరీ టెల్లింగ్ బ్లాగ్ లో చోటుదక్కింది. బ్రాండన్ స్టాంటన్ ప్రారంభించిన హ్యూమన్స్ ఆఫ్ న్యూయార్క్ నుంచి ఇన్స్పిరేషన్ పొంది 2014లో కరిష్మా మెహతా ఈ బ్లాగ్ ను ప్రారంభించారు. కదిలించే హ్యూమన్ యాంగిల్ స్టోరీస్ తో.. వాల్ ఆఫ్ కైండ్ నెస్ పేరుతో హ్యూమన్స్ ఆఫ్ బాంబే బ్లాగ్ ఇలాంటివెన్నో మనకందిస్తోంది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • దిక్కుమాలిన ఎలిమినేషన్…! మరిక ప్రజాభిప్రాయం దేనికిరా భయ్..!?
  • ‘ఎ’ తెలుగు…’యాన్’ టెల్గూ…’ది’ తెగులు… ‘థి’క్కుమాలిన యాడ్…
  • నడిరాతిరి వేళా నీ పిలుపు… ఇలాంటి ఓ హిందీ పాటే ఓ ఉత్సవం…
  • ఈ తూరుపు, ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళ…!
  • జామ ఆకులు తెగ తింటున్నారు… పచ్చి, ఎండు, పొడి… అన్నీ…
  • ఆంధ్రాబాబు బుర్రలో బనకచర్ల పురుగు మెసులుతూనే ఉంది..!!
  • పొంగులేటి పొగ..! సిస్టం, పార్టీ, సర్కారు… అన్నింటికీ ఓ కొత్త థ్రెట్..!!
  • సార్, మా కరెంటు కనెక్షన్ తీసుకుంటారా..? బోలెడు ఆఫర్లున్నాయి..!!
  • Amitabh Bachchan: The Timeless Titan of Indian Branding
  • ఈ వయస్సులోనూ అత్యంత విలువైన బ్రాండ్ ప్రమోటర్… బిగ్ బీ..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions