Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓ ఐపీఎస్ అధికారి పరివర్తన..! కైలాస పర్వతయాత్రతో ఆత్మమథనం…!!

February 26, 2025 by M S R

.

అన్నామలై… ఔను, అదే నా పేరు, 37 ఏళ్ల వయస్సుకే ఒక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడినయ్యానని రాసిన మీడియాయే ఈరోజు చెడామడా తిట్టేస్తోంది… అసలు నేను ఏమన్నానని..? జస్ట్, 6 నెలలు ఆగండ్రా భయ్, రాజకీయ పక్షపాతంతో నానా కూతలూ, సారీ, రాతల రాసే ఈ మీడియా అంతా కంట్రోల్‌లోకి వస్తుందన్నాను… అంతే కదా…

నాకన్నా ముందు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా చేసిన మురుగన్ కేంద్ర ప్రసార, సమాచార శాఖకు మంత్రి అయ్యాడు, ఈ దిక్కుమాలిన మీడియా వైఖరి నియంత్రణలోకి వస్తుంది అనే కదా నేనన్నది..? తప్పేమున్నది..? ఈ మీడియా చేస్తున్నది ఏమైనా తక్కువా..?

Ads

ఎస్, నేనే, కర్నాటక కేడర్ ఐపీఎస్ అధికారిగా చేశాను, సింగం అనిపించుకున్నాను… తొమ్మిదేళ్లకే రిజైన్ చేశాను… బీజేపీలో చేరాను, స్వరాష్ట్రం చేరాను… నా బ్యాచ్ మిత్రుడి మరణం నా మనసు వికలం చేసింది… అంతేకాదు, ఓసారి కైలాస యాత్ర నన్ను అంతర్ముఖుడిని చేసింది… అవును, ఆ అనుభవం నేను చెప్పనే లేదు కదూ… అప్పట్లో డెక్కన్ హెరాల్డ్‌లో రాసుకున్న నా ట్రావెలాగ్ ఇదీ…

annamalai

‘‘ఈ లాక్ డౌన్లు, ఈ కరోనా కష్టాలను ఓసారి స్థూలంగా పరిశీలిస్తే…. నిజంగా జీవితం మీదే ఓ ఆత్మచింతన కలుగుతోంది కదా… మన ఆత్మీయులతో మనసారా భేటీ వేసి ఎన్నాళ్లయింది..? మన వ్యాపారాలు ఏమిటి..? మన కెరీర్ ఏమిటి..? ఎక్కడ నిలిచిపోయాం మనం..? మనవాళ్లను ఎందరిని పోగొట్టుకున్నాం..? అసలు రేపు ఏమిటి..? టైం ఇంకా మనతో ఎంత ఆడుకోబోతోంది… అందరి మనస్సుల్లోనూ ఎంత మథనం..?

మనసు వికలం కాకపోతే మరేమిటి..? అవును, మానస సరోవరానికి కదా మనం వెళ్లాల్సింది… నా సర్వీస్ బెంగుళూరు… అది 2018… అవును, నేను స్వచ్ఛంద పదవీ విరమణ చేయడానికి ముందు ఏడాది… మానస సరోవరయాత్రకు లైజన్ ఆఫీసర్‌గా నియమించారు నన్ను… అంటే, ఏమీలేదు, యాత్రికులకు అంతా మేమై సహకరించడం…

చైనా వీసాల అవసరం ఉంటుంది కదా, అందుకని ఈ యాత్రను సూపర్‌వైజ్ చేసేది భారతీయ విదేశాంగ శాఖ… అంతకుముందు మేఘాలు దట్టంగా కమ్ముకుని, హెలికాప్టర్లు ప్రయాణికులను అటూఇటూ తరలించడం లేటయ్యేది… అందుకని ఈసారి కాస్త పకడ్బందీగానే ప్లాన్ రచించాం… ఎన్ని చాపర్లు అవసరం, ఏ సమయంలో అవసరం, షెడ్యూల్ ప్రకారం ఎలా యాత్ర నిర్వర్తించడం…

ఒకటికి పదిసార్లు చదువుకున్నాను, నా షెడ్యూల్ ప్లాన్ పర్‌ఫెక్ట్… యాత్ర ప్రారంభమైంది… ఢిల్లీ నుంచి మానససరోవరం, అక్కడి నుంచి మళ్లీ ఢిల్లీ… ఆ బాధ్యత లైజన్ ఆఫీసర్లది… నాతోపాటు మరో ఐపీఎస్ అధికారి కూడా ఉన్నాడు…

జూలై 20… మొత్తం 23 రోజులు… ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్… అక్కడి నుంచి టిబెట్… తిరిగి రిటర్న్ జర్నీ… జస్గ్, మూడో రోజుకే జర్నీ మన చేతుల్లో ఏమీ ఉండదని అర్థమైంది… కేరళలో భారీ వర్షాలు, వరదలు… పలు చాపర్లను సహాయక చర్యల కోసం పంపించారు… మాకన్నా ముందు వెళ్లిన బ్యాచులు ఎక్కడికక్కడ స్థంభించాయి…

మేం మెల్లిగా గుంజి వరకు చేరుకున్నాం… అది ఇండియా బోర్డర్ గ్రామం… మేం లిపూలేక్ పాస్ ద్వారా టిబెల్‌లోకి అడుగుపెట్టాలి, కానీ ఈలోపు చైనా వీసాల గడువు ముగిసింది… మా యాత్ర షెడ్యూల్‌కు విరుద్ధంగా సాగుతోంది కదా… ఏం చేయాలి..? నాతోపాటు ఉన్న లైజన్ ఆఫీసర్ని ఢిల్లీకి వీసాల గడువు పొడిగింపు చేసుకుని రమ్మని పంపించేశాం… అందరూ నన్నే దోషిగా చూస్తున్నారు…

రకరకాల యాత్రికులు వేల కోట్ల టర్నోవర్ ఉన్న గుజరాతీ వజ్రాల వ్యాపారి దగ్గర్నుంచి హర్యానకు చెందిన ఓ పేద మెకానిక్ దాకా… బోలెడు వృత్తులు, నేపథ్యాలు… ఇళ్ల దగ్గర పిల్లలు ఎదురుచూసే కుటుంబాలు… నేనూ అంతే… నా మూాడేళ్ల కొడుకును ఎంత మిస్సవుతున్నానో కదా… ఢిల్లీ నుంచి సవరించిన వీసాలు వచ్చేసరికి మూడు బ్యాచులు గుంజిలో చేరాయి…

అది 16 వేల అడుగుల ఎత్తున్న పర్వతగ్రామం… రోజుకు రెండు గంటలే కరెంటు… ఫోన్లు పనిచేయవు, ఓన్లీ శాటిలైట్ ఫోన్లు మాత్రమే… ఇన్నిరోజులూ ఒకటే పని… ఆకాశానికి కళ్లను వేలాడదీసి, చాపర్లు ఎప్పుడు వస్తాయి అని ఎదురుచూడటమే… హార్డ్ లివింగ్… 17 రోజులు అలాగే ఉండిపోయాం… జీవితం స్తంభించిపోయింది…

ఎలాగోలా తిరిగి ప్రయాణం ఆరంభం… నాలో ఓ మథనం… కైలాస పరిక్రమ నిజంగా అంత గొప్పదా..? దానికి ఇన్ని కష్టాలు అవసరమా..? ఈ ప్రయాస మనకిచ్చేది ఏమిటి..? మెల్లిమెల్లిగా కష్టతరమైన లిపూలేక్ పాస్ దాటి, టిబెట్‌లోకి ఎంటరయ్యాం… పరిక్రమ ఆరంభం… 3 రోజుల తరువాత గానీ నా పోలీస్ బుర్ర కరగడం స్టార్ట్ కాలేదు… నా మనసులో ఏవో ప్రకంపనలు, నాకే తెలియని పాజిటివిటీ…

ఎహె, ఈ కైలాస పర్వతం శివుడు కాదు, శివుడంటే అసలు పర్వతం కానే కాదు… దేవుడు అంటే ఓ నిశ్చితత్వం… కాదు, కాదేమో… ఏమీలేనితనం… ఊఁహూ, అన్నీఉన్నతనం… పూరిపూర్ణమైన శూన్యత… అంటే..? అవును, నాకేదో అవుతోంది… గతం మీద ధ్యాస లేదు, భవిష్యత్తు మీద చింత లేదు, అంచనాయే లేదు… వర్తమానమే…

యోగనిద్రలోకి వెళ్లినట్టుగా ఉంది… ఓహ్, దేవుడంటే ఇదేనా..? నేనేమిటి అని చెప్పడానికేనా ఇంతమందిని ఇక్కడిదాకా రప్పించుకుంటున్నాడు దేవుడు..? నాలో చెలరేగే ప్రకంపనలకు నేను బాష్యాలు చెప్పలేను, అనుభవించడమే అంతిమం… అది అపూర్వం…

మొత్తానికి మా షెడ్యూల్ దాటి 26 రోజుల తరువాత ఢిల్లీ చేరాం… ప్రయాణికులు తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు… ఎవరిని మాట్లాడించినా ఓ వైరాగ్య భావనతో కనిపిస్తున్నారు… నాలో ఏదో రియలైజేషన్… నా వర్తమానం సరైనదేనా..? ఏదో మథనం… ఈ కరోనా, ఈ లాక్ డౌన్లు ఇప్పుడు నన్ను మరింత మథనంలో ముంచేస్తున్నయ్…

వాటీజ్ హ్యూమన్ లైఫ్..? కైలాస పరిక్రమ అనుభవాన్నిచ్చింది, కానీ అర్థం చెప్పేది ఎవరు..? నేను ఏదో కోల్పోతున్నానా..? నా పంథా ఏమైనా మారాలా..? నన్ను నేను మార్చుకోవాలా..? అసలు నేను నేనులా ఉన్నానా..? నాకేమైంది..? ఏమో, కాలమే చెబుతుందేమో… చూస్తాను… చూడక ఇంకా చేసేదేముంది..?’’

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘‘ఒక్క పోలీసు లేకుండా ఆర్ట్స్ కాలేజీకి వస్తా… నాకు ధైర్యం ఉంది…’’
  • సీన్ ఛేంజ్..! నాడు ఎంట్రీపై నిరసన… నేడు సీఎం హోదాలో ఘన స్వాగతం…
  • నో తుర్కియే, నో అజర్‌బైజాన్… ఇప్పుడిదే ట్రెండ్… ఎందుకంటే..?!
  • కంగాళీ వెన్నెల..! బాపు చేతులెత్తేశాడు… కెమెరా వీఎస్ఆర్ స్వామి ఫ్లాప్…!!
  • తెలంగాణ ప్రజల చెవుల్లో కేంద్ర బీజేపీ ప్రభుత్వం క్యాబేజీ పూలు..!!
  • జీవనపోరాటం… మానవ సంబంధాలన్నీ జస్ట్, మనీబంధాలే…
  • పాపం బమ్మెర పోతన ప్రాజెక్టు… ఎక్కడికక్కడ ఆగి ఏడుస్తోంది…
  • ప్రకృతి సౌందర్యానికి ప్రతీక… సముద్రపు ఒడిలో తేలియాడే గ్రామం..!
  • ఓ చిక్కు ప్రశ్న… పీటముడి… మీరేమైనా విప్పగలరా..? చెప్పగలరా..?
  • ఓహ్… కేటీయార్ ప్రేమించిన కంచె ఐలయ్య కాంగ్రెస్ సలహాదారా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions