Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రచయిత అనంత శ్రీరాం తప్పు… స్టార్ మాటీవీది మరీ తప్పున్నర…

February 2, 2024 by M S R

అనంత శ్రీరాం మంచి గీత రచయితే… కానీ నోటి దూల ఎక్కువ… తనంతటతనే ఇజ్జత్ తీసుకుంటూ ఉంటాడు అనాలోచిత వ్యాఖ్యలు చేస్తూ… ఆమధ్య దిగుదిగునాగ అనే ఓ పిచ్చి గీతాన్ని సమర్థించి నవ్వులపాలయ్యాడు… తరువాత ఏదో మరో వివాదం… సూపర్ సింగర్ టీవీ సినిమా సాంగ్స్ కంపిటీషన్స్ షోలో నలుగురు జడ్జిల్లో తను ఒకడు ప్రస్తుతం… అంతకుముందు జీతెలుగులో ఇలాంటి షోలో కూడా జడ్జిగా చేస్తూ, పిచ్చి గెంతులు వేస్తూ చిరాకెత్తించాడు…

ఈ సూపర్ సింగర్ షోలో కూడా మళ్లీ అదే టైపు… టీవీ రేటింగ్స్ కోసం అంత సీనియర్ రచయిత ఇలాంటి వేషాలు వేయడం ఏమిటి అసలు..? ఎప్పుడైనా చంద్రబోస్ వంటి రచయితలు ఇలా తిక్క స్టెప్పులు, సర్కస్ ఫీట్లు చేశారా స్టేజీ మీద…! ప్రస్తుతం సూపర్ సింగర్ షో నిర్వహణ తీరు మీదే నాకు బోలెడు కంప్లయింట్స్ ఉన్నయ్… సీనియర్ సింగర్స్‌తో కంటెస్టెంట్లు కలిసి పాడే ఓ తాజా ఎపిసోడ్ లేటుగా చూడబడ్డాను… అందులో అక్షయ సాయి అనే లేడీ కంటెస్టెంట్ ఏదో పాడింది…

రాహుల్ 8 మార్కులు, మంగ్లి 8 మార్కులు, శ్వేతా మోహన్ 7 మార్కులు ఇచ్చారు… ఆమె తన టీం మెంబర్ కాబట్టి అనంత శ్రీరాం మార్కులివ్వడానికి వీల్లేదు… యాంకర్ స్త్రీముఖికి కాస్త పుల్లలు పెట్టే ధోరణి ఎక్కువ కదా… శ్వేత 7 మార్కులే ఇచ్చింది పర్లేదా అని అడిగింది శ్రీరాంను… పర్లేదు, ఆమెకు పూర్తి సాధికారత ఉంది అన్నాడు ఆయన… యాంకర్ ఊరుకోదు కదా… అంటే మంగ్లికి, రాహుల్‌కు అంత సాధికారత లేదా అని మరో పెద్ద పుల్ల పెట్టింది… ‘ధైర్యంగా చెప్పాలీ అంటే, వీళ్లిద్దరికన్నా ఖచ్చితంగా శ్వేతా మోహన్ బెటర్’ అన్నాడు అనంత శ్రీరాం…

Ads

దాంతో ఎక్కడో మండినట్టుంది ఈ ఇద్దరికీ… ఈ వ్యాఖ్యలు మమ్మల్ని కించపరచడమే, మీ ఒపీనియన్‌ను మ-డి-చి… జేబులో పెట్టుకొండని కాస్త ద్వంద్వార్థం వచ్చే ఓ సీరియస్ కామెంట్ చేశాడు రాహుల్… మంగ్లి కూడా ‘మేం ఏమీ నేర్చుకోకుండానే ఇక్కడిదాకా వచ్చామా..? మీ కామెంట్స్ సరిగ్గా లేవు, మ్యూజిక్ నాలెడ్జి గురించి కాదు, ఒక కంటెస్టెంట్ ఎలా ప్రజెంట్ చేసిందనేదీ ముఖ్యమే’ అని ఇచ్చిపడేసింది… తామిచ్చిన 8 మార్కుల్ని సవరించి ఏడు మార్కులు అని చెప్పారు…

అక్కడ ఊరుకోవచ్చు కదా ఈ అనంతుడు… టాలెంట్ నిరూపించుకోవాలీ అంటే పరీక్ష పెట్టాలి అన్నాడు… అంటే రాహుల్, మంగ్లీలు శ్వేతామోహన్‌తో పరీక్షకు సిద్దపడాలని తన భావం… ఈ పరీక్షలు మీ ఇంట్లో పెట్టుకొండి అని రాహుల్ తిప్పికొట్టగా…, పరీక్షలు కాదు, ఇదొక పరంపర, మేమిద్దరమూ ఇండిపెండెంట్‌గా నేర్చుకున్నాం, సాధన చేసి వచ్చాం అని మంగ్లి మళ్లీ వాయించేసింది… నిజానికి ఇక్కడ యాంకర్ అలా గెలకాల్సింది కాదు… గెలికెను పో అనంత శ్రీరాం అలా సంయమనం కోల్పోవాల్సి కాదు…

ఒక వేదిక మీద తోటి జడ్జిలను, ప్రస్తుత పాపులర్ సింగర్లను అలా వేరే భాషా గాయనితో పోల్చి, ఆమె ఎదుటే కించపరచడం సంస్కారం కాదు… అనంత శ్రీరాం స్పందన, వ్యవహార శైలి మరీ దిగువ స్థాయిలో ఉంది… ఇదంతా టీఆర్పీల కోసం ఆడిన ప్రహసనంలా కూడా కనిపించలేదు, ఈ వ్యాఖ్యలు, ప్రతివ్యాఖ్యల ఎపిసోడ్ జరుగుతున్నప్పుడు ఆ శ్వేతా మోహన్ మొహం దాచుకుంది ఏమీ చెప్పలేక, నిజంగానే ఆమె స్పందించడానికి ఏమీ లేదు ఇందులో…

సరే, టీఆర్పీల కోసం ఇదేదో స్క్రిప్టును ఆ జడ్జిలు ప్లే చేశారు అనుకుంటే… రాహుల్, మంగ్లి దానికి అంగీకరించి ఉండాల్సింది కాదు… అలాగే చేసి ఉంటే తమను తామే కించపరుచుకోవడమే అది… అన్నింటికన్నా పెద్ద తప్పు స్టార్ మాటీవీ టీంది… ఒకవేళ నిజంగానే అక్కడ ఈ చిల్లర ప్రహసనం జరిగి ఉండవచ్చుగాక… కానీ దాన్ని యథాతథంగా ఎందుకు ప్రసారం చేసినట్టు..! శ్వేతామోహన్ మలయాళ మూలాలున్న చెన్నై గాయని, సీనియర్… బోలెడు అవార్డులు వచ్చాయి… తల్లి సుజాత కూడా గాయకురాలు… సో వాట్..? రాహుల్, మంగ్లి, శ్వేత… ఎవరి విశిష్టత వాళ్లదే… ఎవరి పాపులారిటీ వాళ్లదే… ఈ మొత్తం ఎపిసోడ్‌లో అనంత శ్రీరామే తన సంస్కార రాహిత్యాన్ని బయటపెట్టుకున్నాడు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కితకితలు గీతాసింగ్… జోవియల్ సెల్ఫ్ పంచుల నడుమ కళ్లల్లో చెమ్మ..!!
  • సినిమా అంటేనే పత్తాలాట… ఏడిస్తే లాభం లేదోయీ ‘బార్బరికా..’
  • అత్తా అనసూయమ్మా… నీతో వరసోయమ్మా… హేమిటో, అప్పట్లో ఆ కథలు..!
  • గెలిచినవాడే తోపు..! ఇదే బాబు మార్క్ ‘పడిలేచే కెరటం’ ఫిలాసఫీ…!
  • మిస్టర్ అమిష్… పురాణాల్ని కూడా వక్రీకరించింది నువ్వు కాదా..?!
  • కొరియన్ హీరోయిన్… మంగోలియా విలన్… హీరో లోకలేనా సార్..?!
  • కాళేశ్వరం కత్తి ఇక మోడీ చేతిలో..! రేవంత్‌రెడ్డి వదిలేశాడు దేనికి..?!
  • పిచ్చి కూతలు, తిక్క చేష్టలు… మ్యూజిక్ అంటూనే ఇవేం పైత్యాలురా సామీ…
  • మూయించిన ఒక వీరుని కంఠం…. చక్రవర్తి టాప్ నంబర్ వన్ సాంగ్…
  • గోదాట్లో పడిపోయిన భానుప్రియ… ఆ నీళ్ల కింద ఊబి… హాహాకారాలు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions