.
బెంగాల్ పూర్తిగా అదుపు తప్పింది… అరాచకం మాత్రమే ఉంది అక్కడ… దానికి సంపూర్ణ బాధ్యత మమతా బెనర్జీదే… అక్కడ రౌడీ రాజ్యం ఈ దేశానికి సంబంధించిన అన్ని వ్యవస్థల వైఫల్యం… కటువుగా ఉన్నా సరే, ఇదే నిజం… చివరకు సుప్రీం కోర్టుకు కూడా అర్థమైంది… అక్కడి వోట్ల రాజకీయాలు, రౌడీ రాజకీయాలు కలిసి అసలు బెంగాల్ ఈ దేశంలోనే ఉందా అన్నంత దిగ్భ్రమను కలిగిస్తున్నాయి…
అక్రమ వలసలకు అధికార పార్టీ, ప్రభుత్వమే మద్దతు ఇస్తుంది… వలసల నివారణకు సరిహద్దుల్లో కంచె వేయడానికీ అడ్డంకులు… ఇతర పార్టీల కార్యకర్తలు, నాయకులపై దాడులు… ఆమె చెప్పిందే శాసనం… సర్ అవసరం లేదట, సీఏఏ వద్దట, ఎన్‌సీఆర్‌ను ప్రాణాలు పోయినా అంగీకరించదట… కేంద్ర ప్రభుత్వ సంస్థలు బెంగాల్‌లో అడుగుపెట్టడానికే వీల్లేదట… చెబుతూ పోతే ఎన్నో… సుప్రీం కోర్టుకు కూడా అర్థమైంది నిన్న…
Ads
చివరకు చీఫ్ జస్టిస్ స్వయంగా అర్ధరాత్రి దాటేదాకా స్వయంగా పర్యవేక్షించినా సరే… ప్రత్యేక బలంగాల్ని రంగంలోకి దింపినా సరే… పరిస్థితి వెంటనే వేగంగా అదుపులోకి రాలేదు నిన్న… (ఆర్టికల్ 356 అవసరం ఏమిటో బహుశా కోర్టుకు అర్థమై ఉంటుందా..? ఇన్నాళ్లుగా అక్కడ పరిస్థితి అదుపు తప్పుతున్నా కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఉపేక్షించిందో కూడా అడగాల్సి ఉందా..? నిన్నటి మాల్డా సంఘట న్యాయవ్యవస్థపైనే దాడి… ఈ దేశ వ్యవస్థలు ఏం చేయగలవో చూద్దామనే బరితెగింపు… డెమొక్రటిక్ సిస్టంపైనే దాడి…

నిన్న ఏం జరిగిందీ అంటే..? మాల్డా జిల్లా, మోతాబారి ప్రాంతంలో సర్ ప్రక్రియలో భాగంగా న్యాయాధికారులు పనిచేస్తున్నారు… సాయంత్రం వేల మంది తమ వోట్లు తొలగించారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు… ముగ్గురు మహిళా అధికారులు సహా మొత్తం ఏడుగురిని ఘెరావ్ చేశారు, తరువాత నిర్బంధించారు… విషయం తెలిసి హైకోర్టు నేరుగా డీజీపీకి, హోం సెక్రెటరీకి ఫోన్లు చేసినా రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక లేదు… ఇలాంటివి జరగాలనే భావనతోనే రాష్ట్ర యంత్రాంగం ఉన్నట్టుంది… రాత్రి 11 గంటల దాకా ఎవరూ స్పందించలేదు…
ఇది న్యాయవ్యవస్థ మీద దాడిగానే భావించి చీఫ్ జస్టిస్ స్వయంగా పర్యవేక్షణకు దిగాక ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగాయి… వాటిపైనా ఆందోళనకారులు దాడులు చేశారు, వాహనాలపై రాళ్ల దాడులు జరిగాయి… బలగాలు ఇక బలప్రయోగం మొదలుపెట్టాక, రాత్రి ఒంటిగంట తరువాత పరిస్థితి అదుపులోకి వచ్చింది…

(SIR ప్రక్రియ జరగవద్దని మమతా బెనర్జీ అన్నిరకాల ప్రయత్నాలు చేస్తోంది… బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సహకరించటం లేదు అని ఎన్నికల సంఘం విచారణ సమయంలో సుప్రీం కోర్టుకు చెపితే సుప్రీం కోర్టు 250 కి పైన న్యాయాధికారులను ఈ ప్రక్రియ కోసం నియమించింది… ఇప్పుడు వారి మీద ఈ దాడి జరిగింది…)
ఈ ఘటనపై Supreme Court of India అత్యంత తీవ్రంగా స్పందించింది… సీజేఐ Surya Kant వ్యాఖ్యలు… “ఇది పూర్వ ప్రణాళికతో చేసిన చర్య” “న్యాయాధికారులలో భయాన్ని సృష్టించే ప్రయత్నం” “రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా కూలిపోయింది” ఇది న్యాయవ్యవస్థపై సైకాలజికల్ దాడి. భవిష్యత్తులో అధికారుల పని మీద చిల్లింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. పశ్చిమ బెంగాల్ “అత్యంత రాజకీయంగా విభజించబడిన రాష్ట్రం”
కోర్టు వెంటనే కఠిన నిర్ణయాలు తీసుకుంది… చీఫ్ సెక్రటరీ, హోమ్ సెక్రటరీ, డీజీపీకి షోకాజ్ నోటీసులు, న్యాయాధికారుల భద్రత కోసం కేంద్ర బలగాల నియామకం, కేసు విచారణను National Investigation Agency (NIA)కి అప్పగించాలని ఆదేశం… ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థ స్వతంత్రత & భద్రత చాలా కీలకం, మాల్టా సంఘటన కేవలం ఒక రాష్ట్ర సమస్య కాదు దేశానికి సంబంధించిన విషయం… ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా కఠిన చర్యలు తప్పనిసరి…

‘‘అబ్బే, ఇంత జరిగిందా..? నాకేమీ తెలియదే… ఐనా ఇదంతా బీజేపీ కుట్ర, మేం చెబితే అధికారులు ఎవరు వింటున్నారు..? అందరూ అమిత్ షా చెప్పినట్టే నడుస్తున్నారు… మా ప్రభుత్వం లేదు కదా ఇప్పుడు రాష్ట్రంలో… ఎన్నికల సంఘమే పరిపాలిస్తోంది’’ ఇదీ మమత వ్యాఖ్య… ఇలాంటి సంఘటనలకు పూర్తి బాధ్యురాలు… బాధ్యతారహిత వ్యాఖ్యలు… ఆమధ్య ఈడీ అధికారులు ఐప్యాక్ ఆఫీసు మీద దాడులు చేస్తుంటే, ఈమె స్వయంగా పోలీసు ఉన్నతాధికారులను తీసుకుపోయి, కీలక ఫైళ్లను తనే స్వయంగా ఎత్తుకొచ్చిన సంగతి గుర్తుంది కదా…
Share this Article